Home /News /technology /

ONEPLUS NORD 2T 5G LAUNCH DATE PRICE TIPPED FOR INDIA UMG GH

OnePlus: వన్‌ప్లస్ లవర్స్‌కి స్వీట్ న్యూస్.. నార్డ్ సిరీస్‌‌లో కొత్త మోడల్ లాంచ్

వన్ ప్లస్ నార్డ్‌ సిరీస్‌లో కొత్త ఫోన్ లాంచ్

వన్ ప్లస్ నార్డ్‌ సిరీస్‌లో కొత్త ఫోన్ లాంచ్

వన్‌ప్లస్ (One Plus) నార్డ్ 2T 5G ఫోన్ ఇండియాలో జూలై 1న లాంచ్ కానుంది. ఈ ఫోన్ సేల్స్ జూలై 5 నుంచి ప్రారంభం కానున్నాయి. నార్డ్ 2T ఫోన్ 8 GB RAM + 128 GB స్టోరేజ్ వేరియంట్, 12 GB RAM + 256 GB స్టోరేజ్ వేరియంట్ వంటి రెండు కాన్ఫిగరేషన్‌లలో వస్తుంది.

ఇంకా చదవండి ...
ఇండియన్ మిడ్‌రేంజ్, ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో వన్‌ప్లస్(OnePlus)కు మంచి వాటా ఉంది. ఈ కంపెనీ వరుసగా కొత్త స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేస్తోంది. ముఖ్యంగా నార్డ్ సిరీస్ విస్తరణపై కంపెనీ దృష్టిపెట్టింది. ఈ క్రమంలో గత నెలలో యూరప్‌లో వన్‌ప్లస్ నార్డ్ 2టీ (OnePlus Nord 2T 5G) ఫోన్‌ను ఆవిష్కరించింది. తాజాగా డివైజ్‌ ఇండియన్ లాంచ్ డేట్ గురించి కీలక వివరాలు వెల్లడించారు టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్. దీంతోపాటు ఫోన్ ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్ల గురించి కొంత సమాచారం బయటకు వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఈ నెలలోనే ఇండియాలో లాంచ్ కానుందని గతంలో కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. అయితే కొత్త లీక్స్ ప్రకారం, ఈ డివైజ్ వచ్చే నెలలో దేశంలో లాంచ్ కానుంది.

లీక్ అయిన సమాచారం ప్రకారం.. వన్‌ప్లస్ నార్డ్ 2T 5G ఫోన్ ఇండియాలో జూలై 1న లాంచ్ కానుంది. ఈ ఫోన్ సేల్స్ జూలై 5 నుంచి ప్రారంభం కానున్నాయి. నార్డ్ 2T ఫోన్ 8 GB RAM + 128 GB స్టోరేజ్ వేరియంట్, 12 GB RAM + 256 GB స్టోరేజ్ వేరియంట్ వంటి రెండు కాన్ఫిగరేషన్‌లలో వస్తుంది. ఈ వేరియంట్‌ల ధర వరుసగా రూ. 28,999 ($371), రూ. 33,999 ఉంటుంది. కొత్త స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన అధికారిక టీజర్‌లు రాబోయే కొద్ది రోజుల్లో వెలువడే అవకాశం ఉంది. ఇతర వన్‌ప్లస్ ఫోన్‌ల మాదిరిగానే, దీన్ని కూడా వన్‌ప్లస్ ఇండియా వెబ్‌సైట్, అమెజాన్ ఇండియా ద్వారా ఆన్‌లైన్‌లో విక్రయించవచ్చు. తాజా ఫోన్ షాడో గ్రే, జేడ్ ఫాగ్ వంటి రెండు కలర్ ఆప్షన్లలో వస్తుందని భావిస్తున్నారు.



వన్‌ప్లస్ నార్డ్ 2T 5G స్పెసిఫికేషన్లు
వన్‌ప్లస్ నార్డ్ 2T 5G ఫోన్ పంచ్-హోల్ డిజైన్‌తో, 6.43-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇది FHD+ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను అందిస్తుంది. ఈ ఫోన్‌లో 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 50-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌ ఉండే ట్రిపుల్ కెమెరా యూనిట్‌తో రానుంది. నార్డ్ 2T ఫోన్ డైమెన్సిటీ 1300 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 4,500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 12, ఆక్సీజన్ OS 12.1తో మంచి యూజర్ ఎక్స్‌పీరియన్స్ అందించనుంది.

ప్రస్తుతానికి వన్‌ప్లస్ నార్డ్ 2T 5G ఫోన్‌ను ఇండియాలో లాంచ్ చేసే విషయంపై కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు. లీక్ అయిన వివరాలపై కూడా వన్‌ప్లస్ స్పందించలేదు. అయితే త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావచ్చని టిప్‌స్టర్స్ చెబుతున్నారు.
Published by:Mahesh
First published:

Tags: Mobiles, ONE PLUS, Smart phones, Tech news

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు