Oneplus Nord 2 vs Oneplus Nord CE: ఈ రెండు 5జీ స్మార్ట్‌ఫోన్ల మధ్య తేడాలు ఏంటీ? తెలుసుకోండి

Oneplus Nord 2 vs Oneplus Nord CE: ఈ రెండు 5జీ స్మార్ట్‌ఫోన్ల మధ్య తేడాలు ఏంటీ? తెలుసుకోండి (image: OnePlus India)

Oneplus Nord 2 vs Oneplus Nord CE | వన్‌ప్లస్ నార్డ్ సిరీస్‌లో రెండు 5జీ స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. వన్‌ప్లస్ నార్డ్ 2, వన్‌ప్లస్ నార్డ్ 2 సీఈ మధ్య తేడాలు తెలుసుకోండి.

  • Share this:
    వన్‌ప్లస్ నుంచి ఇండియాలో మరో 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. వన్‌ప్లస్ నార్డ్ 2 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది కంపెనీ. అయితే అంతకన్నా ముందే వన్‌ప్లస్ నార్డ్ సీఈ పేరుతో ఓ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాకు పరిచయం చేసింద్ వన్‌ప్లస్. ఇప్పుడు వన్‌ప్లస్ నార్డ్ 2 5జీ మోడల్ కూడా రిలీజ్ చేసింది. రెండు స్మార్ట్‌ఫోన్లు నార్డ్ సిరీస్‌లో వచ్చినవే. మరి వన్‌ప్లస్ నార్డ్ సీఈ కన్నా వన్‌ప్లస్ నార్డ్ 2 ధర ఎందుకు ఎక్కువగా ఉంది? ఈ రెండు 5జీ స్మార్ట్‌ఫోన్ల మధ్య తేడాలు ఏంటీ? అన్న సందేహాలు స్మార్ట్‌ఫోన్ యూజర్లలో ఉన్నాయి. మరి వన్‌ప్లస్ నార్డ్ 2, వన్‌ప్లస్ నార్డ్ సీఈ మధ్య పోలికలు, తేడాల గురించి వివరంగా తెలుసుకోండి.

    డిస్‌ప్లే: వన్‌ప్లస్ నార్డ్ 2, వన్‌ప్లస్ నార్డ్ సీఈ స్మార్ట్‌ఫోన్లలో సేమ్ డిస్‌ప్లే ఉంది. ఈ రెండు మోడల్స్‌లో స్మార్ట్‌ఫోన్‌లో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే ఉండటం విశేషం.

    ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్: వన్‌ప్లస్ నార్డ్ 2, వన్‌ప్లస్ నార్డ్ సీఈ స్మార్ట్‌ఫోన్లు 6జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ, 12జీబీ+256జీబీ వేరియంట్లలో రిలీజ్ అయ్యాయి. ర్యామ్, స్టోరేజ్ వేరియంట్లు కూడా ఒకేలా ఉన్నాయి.

    Asus Chromebook: రూ.17,999 ధరకే ల్యాప్‌టాప్... ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ మొదలైంది

    Airtel Plans: కొత్త ప్లాన్స్ ప్రకటించిన ఎయిర్‌టెల్... బెనిఫిట్స్ ఇవే

    ప్రాసెసర్: వన్‌ప్లస్ నార్డ్ 2 స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ఏఐ ప్రాసెసర్‌ ఉంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

    రియర్ కెమెరా: వన్‌ప్లస్ నార్డ్ 2 స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ సోనీ IMX766 ప్రైమరీ కెమెరా + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రావైడ్ కెమెరా + 2 మెగాపిక్సెల్ మోనోక్రామ్ సెన్సార్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ స్మార్ట్‌ఫోన్‌లో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా+ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది.

    ఫ్రంట్ కెమెరా: వన్‌ప్లస్ నార్డ్ 2 స్మార్ట్‌ఫోన్‌లో 32మెగాపిక్సెల్ సోనీ IMX615 ఫ్రంట్ కెమెరా ఉంటే, వన్‌ప్లస్ నార్డ్ సీఈ స్మార్ట్‌ఫోన్‌లో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. సెల్ఫీ కెమెరా విషయంలో వన్‌ప్లస్ నార్డ్ 2 ఎక్కువ ఫీచర్స్ ఉండటం విశేషం.

    Samsung Galaxy M21 2021: సాంసంగ్ గెలాక్సీ ఎం21 కొత్త మోడల్ వచ్చేసింది... ధర ఎంతంటే

    Redmi Note 10T 5G: రెడ్‌మీ నుంచి తక్కువ ధరకే తొలి 5జీ స్మార్ట్‌ఫోన్... రెడ్‌మీ నోట్ 10టీ 5జీ ప్రత్యేకతలు ఇవే

    బ్యాటరీ: వన్‌ప్లస్ నార్డ్ 2, వన్‌ప్లస్ నార్డ్ సీఈ స్మార్ట్‌ఫోన్లలో 4,500ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. కానీ వన్‌ప్లస్ నార్డ్ 2 65వాట్ వార్ప్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తే, వన్‌ప్లస్ నార్డ్ సీఈ స్మార్ట్‌ఫోన్ 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.

    ఆపరేటింగ్ సిస్టమ్: వన్‌ప్లస్ నార్డ్ 2, వన్‌ప్లస్ నార్డ్ సీఈ స్మార్ట్‌ఫోన్లు ఆక్సిజన్ ఓఎస్ 11.3 + ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తాయి.

    కలర్స్: వన్‌ప్లస్ నార్డ్ 2 స్మార్ట్‌ఫోన్ బ్లూ హేజ్, గ్రే సియెర్రా, గ్రీన్ వుడ్ కలర్స్‌లో లభిస్తుంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ స్మార్ట్‌ఫోన్ బ్లూ వాయిడ్, చార్‌కోల్ ఇంక్, సిల్వర్ రే కలర్స్‌లో లభిస్తుంది.

    ధర: వన్‌ప్లస్ నార్డ్ 2 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.27,999 కాగా 8జీబీ+128జీబీ ధర రూ.29,999. ఇక హైఎండ్ వేరియంట్ 12జీబీ+256జీబీ ధర రూ.34,999. వన్‌ప్లస్ నార్డ్ ధరలు చూస్తే వన్‌ప్లస్ నార్డ్ సీఈ 6జీబీ+128జీబీ ధర రూ.22,999 కాగా, 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.24,999. ఇక హైఎండ్ వేరియంట్ 12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.27,999.
    Published by:Santhosh Kumar S
    First published: