OnePlus Nord 2: అదిరిపోయే ఫీచర్స్‌తో వన్‌ప్లస్ నార్డ్ 2 వచ్చేసింది... ధర ఎంతంటే

OnePlus Nord 2: అదిరిపోయే ఫీచర్స్‌తో వన్‌ప్లస్ నార్డ్ 2 వచ్చేసింది... ధర ఎంతంటే (image: OnePlus India)

OnePlus Nord 2 | వన్‌ప్లస్ నార్డ్ 2 స్మార్ట్‌ఫోన్ ఇండియాలో లాంఛ్ అయింది. ధర, స్పెసిఫికేషన్స్, ఇతర వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    కొంతకాలంగా వన్‌ప్లస్ ఫ్యాన్స్‌ను ఊరిస్తున్న వన్‌ప్లస్ నార్డ్ 2 స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. ఇండియాలో ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. గతేడాది రూ.30,000 లోపు సెగ్మెంట్‌లో వన్‌ప్లస్ నార్డ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవల వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. ఇప్పుడు వన్‌ప్లస్ నార్డ్ 2 5జీ స్మార్ట్‌ఫోన్ కూడా ఇండియాకు వచ్చేసింది. వన్‌ప్లస్ నార్డ్ 2 స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.27,999. ఇది 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. ఇక 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999 కాగా, 12జీబీ ర్యామ్ + 256జీబీ వేరియంట్ ధర రూ.34,999. జూలై 28న అమెజాన్ ఇండియా, వన్‌ప్లస్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్, విజయ్ సేల్స్, ఇతర రీటైల్ పార్ట్‌నర్స్ దగ్గర సేల్ మొదలవుతుంది. మొదట 8జీబీ+128జీబీ వేరియంట్ సేల్ మాత్రమే మొదలవుతుంది. 2021 ఆగస్టులో 6జీబీ+128జీబీ, 12జీబీ+256జీబీ వేరియంట్స్ అందుబాటులోకి వస్తాయి.

    Asus Chromebook: రూ.17,999 ధరకే ల్యాప్‌టాప్... ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ మొదలైంది

    Airtel Plans: కొత్త ప్లాన్స్ ప్రకటించిన ఎయిర్‌టెల్... బెనిఫిట్స్ ఇవే


    వన్‌ప్లస్ నార్డ్ 2 డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇది 5జీ స్మార్ట్‌ఫోన్. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ఏఐ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. తొలిసారి మీడియాటెక్ ప్రాసెసర్‌తో వన్‌ప్లస్ రిలీజ్ చేసిన స్మార్ట్‌ఫోన్ ఇది. వెనుకవైపు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50 మెగాపిక్సెల్ సోనీ IMX766 ప్రైమరీ కెమెరా + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రావైడ్ కెమెరా + 2 మెగాపిక్సెల్ మోనోక్రామ్ సెన్సార్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ముందువైపు టాప్ లెఫ్ట్ కార్నర్‌లో 32మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.

    Samsung Galaxy M21 2021: సాంసంగ్ గెలాక్సీ ఎం21 కొత్త మోడల్ వచ్చేసింది... ధర ఎంతంటే

    Redmi Note 10T 5G: రెడ్‌మీ నుంచి తక్కువ ధరకే తొలి 5జీ స్మార్ట్‌ఫోన్... రెడ్‌మీ నోట్ 10టీ 5జీ ప్రత్యేకతలు ఇవే

    వన్‌ప్లస్ నార్డ్ 2 స్మార్ట్‌ఫోన్‌లో 4,500ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 65వాట్ వార్ప్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్సిజన్ ఓఎస్ 11.3 + ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ బరువు 190గ్రాములు. వన్‌ప్లస్ నార్డ్ 2 స్మార్ట్‌ఫోన్‌ను బ్లూ హేజ్, గ్రే సియెర్రా, గ్రీన్ వుడ్ కలర్స్‌లో కొనొచ్చు. వన్‌ప్లస్ నార్డ్ 2 స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే పోకో ఎఫ్3 జీటీ, రియల్‌మీ ఎక్స్7 మ్యాక్స్, ఎంఐ 11ఎక్స్ లాంటి స్మార్ట్‌ఫోన్లకు గట్టిపోటీ ఇవ్వనుంది.
    Published by:Santhosh Kumar S
    First published: