Home /News /technology /

ONEPLUS NORD 2 CE 5G INDIA LAUNCH TIPPED FOR THE FIRST QUARTER OF 2022 JNK GH

OnePlus Nord 2 CE: త్వరలోనే వన్ ప్లస్ నార్డ్ 2 CE స్మార్ట్‌ఫోన్ విడుదల.. స్పెషల్ కోడ్ నేమ్‌తో లాంచ్ కానున్న డివైజ్

త్వరలోనే వన్ ప్లస్ నార్డ్ 2 CE స్మార్ట్‌ఫోన్ విడుదల.. ఇవే స్పెసిఫికేషన్లు

త్వరలోనే వన్ ప్లస్ నార్డ్ 2 CE స్మార్ట్‌ఫోన్ విడుదల.. ఇవే స్పెసిఫికేషన్లు

OnePlus Nord 2 CE: ప్రీమియం స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా ఇండియన్ మార్కెట్‌లో దూసుకుపోతున్న వన్‌ప్లస్.. మరో కొత్త ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. వన్‌ప్లస్ నార్డ్ 2 సీఈ (OnePlus Nord 2 CE 5G) పేరుతో 5G ఫోన్‌ను సంస్థ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. దీన్ని త్వరలోనే ఇండియాలో లాంచ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇంకా చదవండి ...
ప్రీమియం స్మార్ట్‌ఫోన్ (Smart Phone) బ్రాండ్‌గా ఇండియన్ మార్కెట్‌లో దూసుకుపోతున్న వన్‌ప్లస్ (One Plus).. మరో కొత్త ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. వన్‌ప్లస్ నార్డ్ 2 సీఈ (OnePlus Nord 2 CE 5G) పేరుతో 5G ఫోన్‌ను సంస్థ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. దీన్ని త్వరలోనే ఇండియాలో లాంచ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. డివైజ్ విడుదల తేదీని ఇంకా అధికారికంగా ధ్రువీకరించనప్పటికీ.. ఈ వన్‌ప్లస్ నార్డ్-సిరీస్ ఫోన్ వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో (2022- Q1) లాంచ్ అవుతుందని తాజా లీక్ సూచిస్తోంది. ఈ డివైజ్ ఇవాన్ (Ivan) అనే కోడ్‌నేమ్‌తో రానుంది. ఈ సంవత్సరం జూన్‌లో వచ్చిన వన్‌ప్లస్ నార్డ్ సీఈ (OnePlus Nord CE 5G) డివైజ్‌కు తరువాతి వెర్షన్‌గా తాజా మోడల్‌ను సంస్థ అభివృద్ధి చేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ 90Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ వంటి ఫీచర్లతో లభిస్తుందని లీక్ అయిన డేటా ద్వారా తెలుస్తోంది.

91మొబైల్స్ సహకారంతో టిప్‌స్టర్ యోగేశ్ బ్రార్ వన్‌ప్లస్ నార్డ్ 2 మోడల్‌కు సంబంధించిన వివరాలు వెల్లడించారు. 2022 మొదటి త్రైమాసికంలోనే దీన్ని భారత్‌లో లాంచ్ చేయడానికి సంస్థ సిద్ధమవుతోందని చెప్పారు. యూరప్ మార్కెట్‌లో కూడా ఈ హ్యాండ్‌సెట్‌ను ఆవిష్కరించాలని వన్‌ప్లస్ భావిస్తోంది. మన దేశంలో వన్‌ప్లస్ నార్డ్ 2 CE 5G ధర సుమారు రూ. 28,000 వరకు ఉండవచ్చని యోగేశ్ తెలిపారు. నార్డ్ సిరీస్‌లో గతంలో వచ్చిన వన్‌ప్లస్ నార్డ్ CE 5G డివైజ్‌.. 12GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.27,999గా ఉంది. రాబోయే నార్డ్ 2 CE 5G ఫోన్‌లో డ్యుయల్ నానో-సిమ్ కార్డ్‌లు, మైక్రో SD కార్డ్‌ ఉంచడానికి ట్రిపుల్ కార్డ్ స్లాట్‌ ఉంటుందని లీకేజీలు చెబుతున్నాయి. అయితే కొత్త మోడల్‌పై పనిచేస్తున్నట్లు వన్‌ప్లస్ ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు.

Flipkart Big Saving Days 2021: కేవలం 10 వేలకే Mi 40 ఇంచుల స్మార్ట్ టీవీ.. ఫ్లిప్‌కార్ట్ లో బెస్ట్ ఆఫర్.. వివరాలివే..


* స్పెసిఫికేషన్లు..
వన్‌ప్లస్ నార్డ్ 2 CE 5G స్పెసిఫికేషన్‌లు ఇప్పటికే ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 12-బేస్డ్ ఆక్సిజన్‌OS 12పై రన్ అవుతుంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.4 అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6GB నుంచి 12GB RAM ఆప్షన్లతో, మీడియాటెక్ డైమెన్సిటీ 900 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ 128GB, 256GB స్టోరేజ్ ఆప్షన్‌లలో కూడా లభిస్తుందని ఆన్‌లైన్‌లో లీక్ అయిన డేటా వెల్లడిస్తోంది.

Mark Zuckerberg’s Dream: తన ఆశయం కోసం భారత్ నే నమ్ముకున్న మార్క్ జుకర్‌బర్గ్‌.. ఎందుకంటే..



 వన్‌ప్లస్ నార్డ్ 2 CE ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ ఉండవచ్చు. దీంట్లో 64 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ ఉంటాయి. ఈ ఫోన్ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో రానుంది. 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,500mAh బ్యాటరీ, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ వంటి స్పెసిఫికేషన్లతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను వన్‌ప్లన్ అభివృద్ధి చేసింది.


(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:John Kora
First published:

Tags: ONE PLUS, Smart phone

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు