Home /News /technology /

ONEPLUS MIGHT LAUNCH ANOTHER AFFORDABLE SMARTPHONE ONEPLUS NORD LITE WITH SNAPDRAGON 690 CHIPSET SS

OnePlus Nord Lite: వన్‌ప్లస్ నార్డ్ లైట్ ఇండియాకు వస్తోందా? ఫీచర్స్ ఏంటంటే

OnePlus Nord Lite: వన్‌ప్లస్ నార్డ్ లైట్ ఇండియాకు వస్తోందా? ఫీచర్స్ ఏంటంటే
(image: OnePlus Nord)

OnePlus Nord Lite: వన్‌ప్లస్ నార్డ్ లైట్ ఇండియాకు వస్తోందా? ఫీచర్స్ ఏంటంటే (image: OnePlus Nord)

OnePlus Nord Lite | వన్‌ప్లస్ నుంచి మరో స్మార్ట్‌ఫోన్ తక్కువ ధరకే రిలీజ్ కానుందన్న వార్తలొస్తున్నాయి. వన్‌ప్లస్ నార్డ్ లైట్ పేరుతో కొత్త ఫోన్ రావొచ్చని ప్రచారం జరుగుతోంది.

    వన్‌ప్లస్ నార్డ్... ఇటీవల బాగా హైప్ వచ్చిన స్మార్ట్‌ఫోన్. కొద్ది రోజుల క్రితం రిలీజైంది. ప్రస్తుతం ప్రీ-బుక్ సేల్ నడుస్తోంది. ఆగస్ట్ 4న తొలి సేల్ ప్రారంభం కానుంది. ఇంతలో మరో వార్త హల్‌చల్ చేస్తోంది. వన్‌ప్లస్ నార్డ్ కన్నా కాస్త తక్కువ స్పెసిఫికేషన్స్‌తో వన్‌ప్లస్ నార్డ్ లైట్ రిలీజ్ కానుందన్న చర్చ జరుగుతోంది. వన్‌ప్లస్ నార్డ్ ప్రారంభ ధర రూ.24,999. అయితే వన్‌ప్లస్ నార్డ్ కన్నా కాస్త తక్కువ ధరకే వన్‌ప్లస్ నార్డ్ లైట్ పరిచయం చేసేందుకు కంపెనీ కసరత్తు చేస్తోందన్నది ఆ వార్తల సారాంశం. ఇందులో స్నాప్‌డ్రాగన్ 690 5జీ ప్రాసెసర్ ఉంటుంది. వన్‌ప్లస్ నార్డ్ లాంఛింగ్ కన్నా ముందే గీక్‌బెంచ్ వెబ్‌సైట్‌లో BE2028 మోడల్ నెంబర్‌, 6జీబీ ర్యామ్‌, ఆండ్రాయిడ్‌ 10 ఓఎస్‌ వన్‌ప్లస్ ఫోన్ కనిపించింది. అది వన్‌ప్లస్ నార్డ్ లైట్ స్మార్ట్‌ఫోన్ కావచ్చని అంచనా.

    Vivo V19: ఈ ఫోన్ ధర రూ.4,000 తగ్గింది... ఇప్పుడు ఎంతంటే

    Samsung Galaxy M31s: భారీ బ్యాటరీతో సాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్ రిలీజ్... ధర ఎంతో తెలుసా?

    నార్డ్ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌ను ఈ ఏడాది చివరి నాటికి అమెరికాలో లాంఛ్ చేస్తామని వన్‌ప్లస్ సీఈఓ కార్ల్ పీ కన్ఫామ్ చేశారు. అయితే అది వన్‌ప్లస్ నార్డ్ కాదని, స్పెసిఫికేషన్స్ వేరేలా ఉంటాయని తెలిపారు. వన్‌ప్లస్ నార్డ్ కేవలం ఇండియా, యూరప్ మార్కెట్లలో మాత్రమే రిలీజైంది. ఇవన్నీ చూస్తే వన్‌ప్లస్ నార్డ్ లైట్ మొదట అమెరికన్ మార్కెట్‌లో రిలీజ్ కానుంది. వన్‌ప్లస్ నార్డ్‌ను ఇండియాలో లాంఛ్ చేసినట్టే తక్కువ స్పెక్స్‌తో గల వన్‌ప్లస్ నార్డ్ లైట్ స్మార్ట్‌ఫోన్‌ను కూడా ఇండియన్ మార్కెట్‌లో రిలీజ్ చేయొచ్చని భావిస్తున్నారు. అదే జరిగితే వన్‌ప్లస్ నార్డ్ ధర ఎక్కువగా ఉందని ఫీలవుతున్నవారికి గుడ్ న్యూసే. వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ రూ.24,999 ధరతో రిలీజ్ అయింది కాబట్టి వన్‌ప్లస్ నార్డ్ లైట్ ధర రూ.20,000 లోపే ఉండొచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Oneplus, Smartphone, Smartphones, Technology

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు