ONEPLUS MAY LAUNCH TWO BUDGET SMARTPHONES UNDER RS 20000 AND RS 10000 SEGMENT IN INDIA SS
OnePlus: వన్‌ప్లస్ మరో సంచలనం... తక్కువ బడ్జెట్లో మరో రెండు స్మార్ట్‌ఫోన్స్
OnePlus: వన్‌ప్లస్ మరో సంచలనం... తక్కువ బడ్జెట్లో మరో రెండు స్మార్ట్‌ఫోన్స్
(ప్రతీకాత్మక చిత్రం)
OnePlus Smartphone | వన్‌ప్లస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. త్వరలో వన్‌ప్లస్ నుంచి రెండు స్మార్ట్‌ఫోన్స్ వచ్చే అవకాశముంది. ధర, ఫీచర్స్పై ప్రస్తుతం వచ్చిన లీక్స్ ఇవే.
ప్రీమియం సెగ్మెంట్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ అయిన వన్‌ప్లస్ మరో సంచలనం సృష్టించబోతోంది. త్వరలో ఇండియాలో రూ.20,000 లోపు, రూ.10,000 లోపు రెండు స్మార్ట్ఫోన్లను వన్‌ప్లస్ రిలీజ్ చేయనుందన్న వార్తలొస్తున్నాయి. ఒక ఫోన్ ధర కూడా రూ.16,000 నుంచి రూ.18,000 మధ్య, మరో ఫోన్ ధర రూ.10,000 లోపే ఉండొచ్చని అంచనా. 2015 లో తొలిసారి వన్‌ప్లస్ రూ.20,000 లోపు స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. ఆ తర్వాత అన్నీ ప్రీమియం ఫోన్లనే తీసుకొచ్చింది. ఇప్పుడు బడ్జెట్ స్మార్ట్ఫోన్లపై దృష్టిపెట్టింది. రూ.20,000 లోపు స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 665 లేదా స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 4జీబీ ర్యామ్ లాంటి ఫీచర్స్ ఉండే అవకాశముంది. ఇక రూ.10,000 లోపు స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 460 ప్రాసెసర్ ఉంటుందని అంచనా.
ఇటీవల రూ.30,000 లోపు వన్‌ప్లస్ నార్డ్ లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్‌కు బాగా హైప్ వచ్చింది. అయితే ఇండియాలో ధర కాస్త ఎక్కువన్న అభిప్రాయం కూడా వినిపించింది. అందుకే కాస్త తక్కువ ధరతో కొత్త ఫోన్లను రిలీజ్ చేయనుంది వన్‌ప్లస్. ఇండియాలో రూ.20,000 లోపు బడ్జెట్లో వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ చివరి నాటికి వచ్చే అవకాశముంది. ఇది వన్‌ప్లస్ నార్డ్ లైట్ పేరుతో రావొచ్చని అనుకుంటున్నారు. ఈ స్మార్ట్ఫోన్లు రిలీజ్ అయితే ఇండియాలో సాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్, రెడ్మీ నోట్ 9 ప్రో, రెడ్మీ నోట్ 9, సాంసంగ్ గెలాక్సీ ఎం21 లాంటి స్మార్ట్ఫోన్లకు గట్టిపోటీ ఇవ్వొచ్చు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.