Home /News /technology /

ONEPLUS LAUNCHES LOW COST 4K TV WITH AMAZING FEATURES PRICE AND FEATURES TO KNOW HERE GH VB

OnePlus TV: అదిరిపోయే ఫీచర్లతో తక్కువ ధరకే 4K టీవీని లాంచ్ చేసిన వన్‌ప్లస్.. ఆ వివరాలిలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వన్‌ప్లస్ కంపెనీ వై సిరీస్‌లో 43-అంగుళాల 4K స్మార్ట్ టీవీని చాలా తక్కువ ధరకే లాంచ్ చేసింది. గురువారం లాంచ్ అయిన ఈ సరికొత్త టీవీ మోడల్ పేరు వన్‌ప్లస్ టీవీ 43 వై1ఎస్ ప్రో (OnePlus TV 43 Y1S Pro).

ఎలక్ట్రానిక్ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus) బడ్జెట్ ధరల్లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ల‌ను లాంచ్ చేస్తూ సూపర్ పాపులర్ అయ్యింది. అంతేకాదు ఇది తక్కువ ధరల్లో ది బెస్ట్ స్మార్ట్‌ టీవీ (Smart TVs)లను కూడా లాంచ్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. వన్‌ప్లస్ కంపెనీ ఇప్పటికే వై సిరీస్(Y Series)లో చాలా టీవీలను ఇండియాలో లాంచ్ చేసింది. తాజాగా కంపెనీ వై సిరీస్‌లో 43-అంగుళాల 4K స్మార్ట్ టీవీని చాలా తక్కువ ధరకే లాంచ్ చేసింది. గురువారం లాంచ్ అయిన ఈ సరికొత్త టీవీ మోడల్ పేరు వన్‌ప్లస్ టీవీ 43 వై1ఎస్ ప్రో (OnePlus TV 43 Y1S Pro). ఈ వన్‌ప్లస్ టీవీ 4K లేదా అల్ట్రా హెచ్‌డీ (UHD) రిజల్యూషన్‌తో పాటు డాల్బీ ఆడియో టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ టీవీ 10 ప్లాట్‌ఫామ్‌పై రన్ అయ్యే ఇది డిఫాల్ట్‌గా గూగుల్ క్రోమ్‌కాస్ట్, గూగుల్ అసిస్టెంట్ కు సపోర్ట్ చేస్తుంది. వన్‌ప్లస్ ఇప్పటికే హెచ్‌డీ, ఫుల్ హెచ్‌డీ స్మార్ట్ టీవీలను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇప్పుడు బడ్జెట్ 4K స్మార్ట్ టీవీని ఇంట్రడ్యూస్ చేసి మరింత మందిని ఆకర్షిస్తోంది.

OPPO Smart Phones: థార్డ్ పార్టీ కంపెనీల‌కు బైబై..మొబైల్ ప్రాసెస‌ర్‌ల‌పై ఒప్పో తాజా నిర్ణయం!

* ధర ఎంత?
వన్‌ప్లస్ టీవీ 43 వై1ఎస్ ప్రో 4K టీవీ ధరను భారతదేశంలో రూ.29,999గా నిర్ణయించారు. ఈ స్మార్ట్ టీవీని ఏప్రిల్ 11 నుంచి భారతదేశంలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్‌లలో కొనుగోలు చేయవచ్చు. వై1ఎస్ ప్రో అమెజాన్, వన్‌ప్లస్, క్రోమా, జియో డిజిటల్, రిలయన్స్ డిజిటల్, ఇతర ఆఫ్‌లైన్ స్టోర్స్ లో ఏప్రిల్ 11 నుంచి అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.

* స్పెసిఫికేషన్‌లు
వన్‌ప్లస్ టీవీ 43 Y1S ప్రో 4K రిజల్యూషన్‌కు సపోర్ట్ చేసే 43-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. ఈ టీవీలో అందించిన గామా ఇంజన్‌ ఓవరాల్ ఇమేజ్ క్వాలిటీని మరింత పెంచుతుంది. ఈ టీవీ డిస్‌ప్లే HDR10+, HDR10, HLG ఫార్మాట్‌లను కూడా సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఆక్సిజన్‌ప్లే 2.0 ఓఎస్‌తో టీవీ రన్ అవుతుంది. ఈ టీవీలో బెజల్-లెస్ డిజైన్, ప్రీమియం స్క్రీన్‌ను ఆఫర్ చేయడం విశేషం. దీన్నిబట్టి టీవీ డిజైన్‌పై వన్‌ప్లస్ కంపెనీ ఏ స్థాయిలో ప్రత్యేక దృష్టి పెట్టిందో అర్థమవుతుంది.

Realme: రియల్‌మీ నుంచి మూడు ప్రొడక్ట్స్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే ..


ఈ టీవీలో డాల్బీ ఆడియో-సపోర్ట్ అవుట్‌పుట్‌తో డ్యూయల్ 24W సౌండ్ స్పీకర్‌లు ఉన్నాయి. ఈ ధర వద్ద, వన్‌ప్లస్ కి ఆల్టర్నేటివ్ గా Mi TV, Vu, Redmi, Realme వంటి ఇతర కంపెనీకు చెందిన 4K స్మార్ట్ టీవీలు అందుబాటులో ఉన్నాయి. కనెక్టివిటీ ఆప్షన్స్ లో 3x HDMI 2.1 (1x eARC) 2xUSB 2.0, ఆప్టికల్, ఈథర్నెట్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.0 ఉన్నాయి.

ఈ టీవీలోని కిడ్స్ మోడ్ ఫీచర్‌ ద్వారా పిల్లలు బెస్ట్ కంటెంట్‌ను చూసేలా, తల్లిదండ్రులు తమ పిల్లలు చూసే కంటెంట్‌ను పర్యవేక్షించేలా మానిటర్ చేసుకోవచ్చు. గేమ్ మోడ్‌ను కూడా ఇందులో ఆఫర్ చేశారు.
Published by:Veera Babu
First published:

Tags: 5g technology, Budget smart tv, Oneplus, Telugu television, Tv channel

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు