హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

OnePlus Nord Buds CE: భారీ బ్యాటరీ లైఫ్‌తో వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ సీఈ టీడబ్ల్యూఎస్ రిలీజ్

OnePlus Nord Buds CE: భారీ బ్యాటరీ లైఫ్‌తో వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ సీఈ టీడబ్ల్యూఎస్ రిలీజ్

OnePlus Nord Buds CE: భారీ బ్యాటరీ లైఫ్‌తో వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ సీఈ టీడబ్ల్యూఎస్ రిలీజ్
(image: OnePlus India)

OnePlus Nord Buds CE: భారీ బ్యాటరీ లైఫ్‌తో వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ సీఈ టీడబ్ల్యూఎస్ రిలీజ్ (image: OnePlus India)

OnePlus Nord Buds CE | వన్‌ప్లస్ నుంచి తక్కువ ధరలో ట్రూవైర్‌లెస్ ఇయర్‌బడ్స్ (True Wireless Earbuds) వచ్చేసింది. వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ సీఈ మోడల్‌ని పరిచయం చేసింది.

ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కంపెనీ అయిన వన్‌ప్లస్ రెండేళ్లుగా నార్డ్ సిరీస్‌లో తక్కువ ధరకే మొబైల్స్‌ని రిలీజ్ చేస్తోంది. దీంతో పాటు నార్డ్ సిరీస్‌లో ట్రూవైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ని (True Wireless Earbuds) కూడా పరిచయం చేసింది. లేటెస్ట్‌గా వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ సీఈ (OnePlus Nord Buds CE) లాంఛ్ అయింది. వన్‌ప్లస్ నార్డ్ సిరీస్‌లో లాంఛ్ అయిన రెండో ఇయర్‌బడ్స్ ఇది. గతంలో వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ రిలీజైంది. ఇప్పుడు వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ సీఈ వచ్చింది. ధర రూ.2,299. వన్‌ప్లస్ ఆన్‌లైన్ స్టోర్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్‌లో కొనొచ్చు. ఆగస్ట్ 4 మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ప్రారంభం అవుతుంది. ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా కొనొచ్చు. మిస్టీ గ్రే, మూన్‌లైట్ వైట్ కలర్స్‌లో లభిస్తుంది. కేవలం ఇండియా కోసమే తక్కువ ధరలో వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ సీఈ ఇయర్‌బడ్స్ లాంఛ్ చేసింది.

వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ సీఈ ఫీచర్స్


వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ సీఈ టీడబ్ల్యూఎస్‌లో టైటానియం డైనమిక్ డ్రైవర్స్ ఉంటాయి. స్పెషల్ క్లోజ్డ్ ట్యూబ్ డిజైన్ మరో ప్రత్యేకత. ఇందులో బాస్, సెరెనేడ్, బ్యాలెన్స్‌డ్, జెంటిల్ ఈక్యూ మోడ్స్ ఉంటాయి. ఒక ఇయర్ బడ్‌లో 27ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఛార్జింగ్ కేస్‌లో 300ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 4.5 గంటల బ్యాటరీ లైఫ్ లభిస్తుందని వన్‌ప్లస్ చెబుతుంది. ఛార్జింగ్ కేస్‌తో 20 గంటల బ్యాటరీ లైఫ్ లభిస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. కేవలం 10 నిమిషాలు ఛార్జింగ్ చేస్తే 81 నిమిషాలపాటు ఇయర్‌బడ్స్ ఉపయోగించవచ్చు. పూర్తిగా ఛార్జ్ చేసినప్పుడు ప్లేబ్యాక్ కోసం 4.5 గంటలు, ఫోన్ కాల్స్ కోసం 3 గంటలు ఉపయోగించుకోవచ్చు.

WhatsApp: వాట్సప్ గ్రూప్ అడ్మిన్లకు శుభవార్త... మీ కోసమే ఈ ఫీచర్

వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ సీఈ టీడబ్ల్యూఎస్‌లో 5.2 బ్లూటూత్ వర్షన్, టైప్ సీ పోర్ట్ సపోర్ట్ లభిస్తుంది. ఇందులో గేమ్ మోడ్ కూడా ఉంది. హెడ్‌సెట్స్‌ని మూడుసార్లు ట్యాప్ చేస్తే గేమింగ్ మోడ్‌లోకి వెళ్తుంది. వాటర్, స్వెట్ రెసిస్టెన్స్ కోసం ఐపీఎక్స్4 రేటింగ్ ఉంది. యాక్టీవ్ నాయిస్ క్యాన్సలేషన్ ఫీచర్ ఉంది. కాల్స్ సమయంలో ఈ ఫీచర్ పనిచేస్తుంది. వన్‌ప్లస్ యూజర్లు వన్‌ప్లస్ ఫాస్ట్ పెయిర్ ఫీచర్ ఉపయోగించుకోవచ్చు. ఇతరులు HeyMelody యాప్ ఉపయోగించవచ్చు. బాక్సులో ఇయర్‌బడ్స్, ఛార్జింగ్ కేస్, టైప్‌సీ కేబుల్ లభిస్తాయి.

Mobile Offer: తొలిసారి రూ.10,000 లోపే ఈ స్మార్ట్‌ఫోన్ సేల్... 6GB వరకు ర్యామ్, 50MP కెమెరా, 5,000mAh బ్యాటరీ

ఇప్పటికే అందుబాటులో ఉన్న వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ ధర రూ.2,799. ఇందులో 30 గంటల బ్యాటరీ లైఫ్ లభిస్తుంది. 10 నిమిషాలు ఛార్జింగ్ చేస్తే 5 గంటల పాటు ఉపయోగించవచ్చు.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Earbuds, Oneplus

ఉత్తమ కథలు