• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • ONEPLUS LAUNCHED ONEPLUS 9 ONEPLUS 9 PRO AND ONEPLUS 9R SMARTPHONES KNOW PRICE AND SPECIFICATIONS SS GH

OnePlus 9 Series: వన్‌ప్లస్ 9 సిరీస్​లో ఒకేసారి మూడు స్మార్ట్​ఫోన్లు రిలీజ్... ధర ఎంతంటే

OnePlus 9 Series: వన్‌ప్లస్ 9 సిరీస్​లో ఒకేసారి మూడు స్మార్ట్​ఫోన్లు రిలీజ్... ధర ఎంతంటే

OnePlus 9 Series: వన్‌ప్లస్ 9 సిరీస్​లో ఒకేసారి మూడు స్మార్ట్​ఫోన్లు రిలీజ్... ధర ఎంతంటే

OnePlus 9 Series | వన్‌ప్లస్ 9 సిరీస్‌లో 3 స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ అయ్యాయి. వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9 ప్రో, వన్‌ప్లస్ 9ఆర్‌ ప్రత్యేకతలేంటో తెలుసుకోండి.

  • Share this:
ప్రముఖ ప్రీమియం స్మార్ట్​ఫోన్​ బ్రాండ్​ వన్​ప్లస్​ స్మార్ట్​ఫోన్​ ప్రియులకు గుడ్​ న్యూస్​ తెలిపింది. వన్‌ప్లస్ 9 సిరీస్‌లో వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9 ప్రో, వన్‌ప్లస్ 9 ఆర్‌ అనే మూడు కొత్త స్మార్ట్​ఫోన్లను లాంఛ్​ చేసింది. ఈ మూడు ఫోన్‌లలో దాదాపు ఒకే రకమైన ఇంటర్‌ఫేస్ కోసం ఆక్సిజన్ ఓఎస్‌, ఆండ్రాయిడ్ 11లను అందించింది. వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9 ప్రో, వన్‌ప్లస్ 9 ఆర్​లోని హార్డ్‌వేర్‌లలో చాలా తేడాలు ఉన్నాయి. వన్‌ప్లస్ 9 ఆర్‌తో పోలిస్తే వన్‌ప్లస్ 9 ప్రోలో మరిన్ని అడ్వాన్సుడ్​ ఫీచర్లను చేర్చింది. ఈ మూడు వేరియంట్లలోనూ 5 జి సపోర్ట్​ను అందించడం విశేషం. ఈ మూడు స్మార్ట్​ఫోన్లలోని ధర, ఫీచర్ల మధ్య ఉన్న ప్రధానమైన తేడాను పరిశీలిద్దాం.

ధర, కలర్​ ఆప్షన్లు


వన్‌ప్లస్ 9 స్మార్ట్​ఫోన్​​ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్​ ధర రూ. 49,999 ఉండగా, 12 జీబీ + 256 జీబీ మోడల్ ధర రూ. 54,999గా ఉంది. వన్‌ప్లస్ 9 ప్రో విషయానికి వస్తే.. దీని 8GB + 128GB మోడల్​ రూ. 64,999లకు లభిస్తుంది. 12GB + 256GB మోడల్ రూ. 69,999 వద్ద లభిస్తుంది. మరోవైపు, వన్‌ప్లస్ 9 ఆర్ 8 జీబీ + 128 జీబీ మోడల్​ రూ. 39,999లకు, వన్‌ప్లస్ 9 ఆర్ టాప్-ఎండ్ 12 జిబి + 256 జిబి మెడల్​ రూ. 43,999లకు లభిస్తుంది. కలర్​ ఆప్షన్ల విషయానికొస్తే, వన్‌ప్లస్ 9 ఆర్కిటిక్ స్కై, ఆస్ట్రల్ బ్లాక్, వింటర్ మిస్ట్ కలర్స్​లో లభిస్తుంది, వన్‌ప్లస్ 9 ప్రో మార్నింగ్ మిస్ట్, పైన్ గ్రీన్, స్టెల్లార్ బ్లాక్ షేడ్స్​లో లభిస్తుంది. వన్‌ప్లస్ 9 ఆర్ కార్బన్ బ్లాక్, లేక్ బ్లూ కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది.

Realme 8 Pro: కాసేపట్లో రియల్‌మీ 8, రియల్‌మీ 8 ప్రో సేల్... ధర రూ.14,999 నుంచి

Redmi Note 10 Pro Max: కాసేపట్లో రెడ్‌మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ సేల్... రూ.1,500 డిస్కౌంట్

స్పెసిఫికేషన్స్


వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9 ప్రో, వన్‌ప్లస్ 9 ఆర్ డ్యూయల్ సిమ్ (నానో) సపోర్ట్​ను కలిగి ఉంటాయి. ఈ మూడు ఫోన్లు ఆండ్రాయిడ్ 11 ఆధారంగా ఆక్సిజన్‌ ఓఎస్‌తో పనిచేస్తాయి. వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9 ఆర్ 6.55 -అంగుళాల ఫుల్​ -హెచ్‌డి + డిస్​ప్లేను కలిగి ఉంటుంది. వీటిలో 20: 9 కారక నిష్పత్తి, 402 పిపి పిక్సెల్ డెన్సిటీతో కూడిన ఫ్లూయడ్​ డిస్​ప్లేను అందించింది. వీటితో పాటు 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్​ను కూడా అందిచింది. ఇక వన్‌ప్లస్ 9 లో అమోలెడ్ ప్యానెల్ ఉండగా, వన్‌ప్లస్ 9 ఆర్‌లో ఎల్‌సిడి ప్యానల్​ ఉంటుంది. వన్‌ప్లస్ 9 ప్రో 6.7- అంగుళాల క్యూహెచ్‌డి ప్లస్​ ఫ్లూయిడ్ అమోలెడ్ లో టెంపరేచర్​ పాలీ క్రిస్టలైన్ ఆక్సైడ్ (ఎల్‌టిపిఓ) డిస్​ప్లేను చేర్చింది. ఇది 20.1: 9 కారక నిష్పత్తి, 525 పిపి పిక్సెల్ డెన్సిటీతో వస్తుంది. వన్‌ప్లస్ 9 ప్రోలో స్మార్ట్ 120 హెర్ట్జ్​ ఫీచర్​ను కూడా చేర్చింది. ఈ ఫీచర్​ బ్యాటరీ వినియోగాన్ని 50 శాతం వరకు తగ్గిస్తుంది. వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9 ప్రో రెండూ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 SoC ప్రాసెసర్​లతో పనిచేస్తాయి. వన్‌ప్లస్ 9 ఆర్‌ మాత్రం ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్​ 870 SoCతో పనిచేస్తుంది.

Flipkart Big Saving Days: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ 20 స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్స్

WhatsApp: వాట్సప్‌లో ఈ సెట్టింగ్స్ మారిస్తే మెసేజెస్, ఫోటోస్ మాయమైపోతాయి

అద్భుతమైన​ కెమెరా ఫీచర్లు


ఫోటోలు, వీడియోల కోసం, వన్‌ప్లస్ 9 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్​ను అందించింది. దీనిలో 48 మెగాపిక్సెల్ సోనీ IMX689 ప్రైమరీ సెన్సార్ ఎఫ్ / 1.8 లెన్స్, 50 మెగాపిక్సెల్ సోనీ IMX766 సెకండరీ సెన్సార్ ఎఫ్ / 2.2 అల్ట్రా-వైడ్ యాంగిల్ ఫ్రీఫార్మ్ లెన్స్, 2-మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ వంటి కెమెరాలను చేర్చింది. మరోవైపు, వన్‌ప్లస్ 9 ప్రో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. వన్‌ప్లస్ 9లో సెన్సార్​ కెమెరాతో పాటు 8 మెగాపిక్సెల్ టెలిఫోటో షూటర్‌ కెమెరాను అందించింది. వన్‌ప్లస్ 9 ఆర్‌లో క్వాడ్ రియర్ కెమెరా సెటప్​ల​ను కూడా చేర్చింది. వన్‌ప్లస్ 9 ఆర్‌లోని కెమెరా సెటప్‌లో 48 మెగాపిక్సెల్ సోనీ IMX586 ప్రైమరీ సెన్సార్, ఎఫ్ /1.7 లెన్స్, 16 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ షూటర్, 5 మెగాపిక్సెల్ మాక్రో షూటర్, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్లను అందించింది. ఇక స్టోరేజీ విషయానికి వస్తే.. వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9 ప్రో, వన్‌ప్లస్ 9 ఆర్ మోడళ్లలో 128 జిబి, 256 జిబి యుఎఫ్ఎస్ 3.1 2-లేన్ స్టోరేజీని అందిస్తున్నాయి. ఈ మూడు ఫోన్లలో 5 జి, 4 జి ఎల్‌టిఈ, వై-ఫై 6, బ్లూటూత్, జిపిఎస్/ ఎ-జిపిఎస్, ఎన్‌ఎఫ్‌సి, యుఎస్‌బి టైప్-సి పోర్ట్​ వంటి ఆప్షన్లను ఒకేలా ఉంటాయి. వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9 ప్రోలో బ్లూటూత్ వి 5.2 ఉండగా, వన్‌ప్లస్ 9 ఆర్ బ్లూటూత్ వి 5.1ను అందించింది. వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9 ప్రో, వన్‌ప్లస్ 9 ఆర్ డ్యూయల్ సెల్ 4,500 ఎంఏహెచ్ బ్యాటరీని ప్యాక్ చేస్తాయి. వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9 ప్రో వార్ప్ ఛార్జ్ 65 టి ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తాయి.
Published by:Santhosh Kumar S
First published: