Home /News /technology /

ONEPLUS LAUNCHED NORD CE 2 5G SMART TV Y1S AND Y1S EDGE LAUNCHED HERE PRICE AND SPECIFICATIONS DETAILS

ఇండియాలో విడుదలైన Nord CE 2 5G, smart TV Y1S, Y1S Edge.. ధర ఇతర ప్రత్యేకతలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజం వన్ ప్లస్ (One Plus) ఈ రోజు ఓ స్మార్ట్ ఫోన్(SmartPhone), రెండు స్మార్ట్ టీవీలను ఇండియలో విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    స్మార్ట్ ఫోన్ (Smart Phone) తయారీ దిగ్గజం వన్ ప్లస్ (One Plus) ఈ రోజు మరో Nord సీరిస్ లో స్మార్ట్ ఫోన్ ను లాంఛ్ చేసింది. మిడ్ సెగ్మెంట్ విభాగంలో ఈ ఫోన్ ను ఆవిష్కరించింది వన్ ప్లస్. OnePlus Nord CE 2 5G పేరుతో ఈ ఫోన్ ఈ రోజు ఇండియన్ మార్కెట్లోకి విడుదలైంది. ఈ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే మీడియా టెక్ చిప్ సెట్ ఈ ఫోన్లో ఏర్పాటు చేశారు. ఇంకా 90Hz రీఫ్రెష్ రేట్ ను ఈ ఫోన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ తో పాటు రెండు స్మార్ట్ టీవీలను సైతం వన్ ప్లస్ ఈ రోజు విడుదల చేసింది. Y సీరీస్ లో ఈ స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. Y1S, Y1S Edge పేర్లతో ఈ టీవీలు విడుదల అయ్యాయి. ఈ రోజు విడుదలైన స్మార్ట్ టీవీలు, స్మార్ట్ ఫోన్ అమెజాన్ లో, వన్ ప్లస్ ఆఫ్ లైన్ స్టోర్ లలో కొనుగోలు చేయొచ్చు.

    OnePlus Nord CE 2 5G ఫీచర్లు:
    ఈ ఫోన్ MediaTek Dimensity 900 చిప్ సెట్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 128 ఇంటర్నల్ స్టోరేజ్ తో 6 జీబీ, 8 జీబీ కంబినేషన్లతో ఈ వేరియంట్లు లభిస్తాయి. ఫోన్ స్టోరేజ్ ను 1 TB వరకు విస్తరించుకోవచ్చు. ఇంకా Oxygen OS 11.3పై ఈ ఫోన్ పని చేస్తుంది. 6.43 ఇంచుల ఆల్మోడ్ డిస్ప్లేతో ఈ ఫోన్ పని చేస్తుంది. 90 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది.
    Infinix Zero 5G: ఇన్ఫినిక్స్ నుంచి మొదటి 5జీ స్మార్ట్​ఫోన్ లాంచ్​.. అందుబాటు ధరల్లో లభ్యం.. ఫీచర్ల వివరాలిలా..

    ఇంకా 64 MP ట్రిపుల్ కెమెరా సెటప్ తో పాటు 8 MP అల్ట్రా వైడ్ సెన్సార్ మరియు 2 MP మాక్రో లెన్స్ ఉంటాయి. ఇంకా 16 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇంకా 3.5 mm జాక్ ఉంటుంది. ఈ ఫోన్ Gray Mirror, Bahama Blue కలర్లలో అందుబాటులో ఉంది. ఇంకా ఈ ఫోన్ 6GB/128GB వేరియంట్ ధర రూ. 23,999 కాగా.. 8GB/128GB వేరియంట్ ధర రూ.12,499. ఈ ఫోన్ సేల్ ఈ నెల 22న ప్రారంభంకానుంది.
    Smart Phone: 9వేల స్మార్ట్‌ఫోన్ రూ.3,399కే.. క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది.. ఎలా కొనాలంటే..?

    OnePlus TV Y1S and Y1S Edge:
    ఇంకా వన్ ప్లస్ Y సీరిస్ లో రెండు స్మార్ట్ టీవీలను లాంఛ్ చేసింది. TV Y1S, Y1S Edge పేరుతో వీటిని విడుదల చేసింది. ఈ ఫోన్లో Oxygen Play 2.0, Gamma engine, HDR and HDR10+, 24W speaker ఫీచర్లు ఉన్నాయి. ఈ రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ TV 11 ఆపరేటింగ్ సిస్టమ్ పై పని చేస్తాయి. TV Y1S టీవీ 20W సౌండ్ అవుట్ పుట్ ను కలిగి ఉండగా.. Y1S Edge 24W సౌండ్ అవుట్ పుట్ ను కలిగి ఉంటుంది. ఈ రెండు టీవీలు 32 ఇంచులు, 43 ఇంచుల స్క్రీన్ ను కలిగి ఉంటాయి. ఇంకా ధరల విషయానికి వస్తే TV Y1S 32 ఇంచుల టీవీ రూ.16,499, 43 ఇంచుల టీవీ ధర రూ.26,999.

    TV Y1S Edge 32 ఇంచుల టీవీ ధర రూ.16,999. ఇంకా 43 ఇంచుల టీవీ ధర రూ.27,999. 32 ఇంచుల టీవీల అమ్మకం ఫిబ్రవరి 21న ప్రారంభం అవుతాయి. Y1S టీవీ 43 ఇంచుల టీవీల అమ్మకం మార్చ్ 2 నుంచి ప్రారంభం అవుతుంది. Flipkart, Amazon, Croma, Reliance Digital తో పాటు కంపెనీ వెబ్ సైట్లో ఈ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: 5G, ONE PLUS, Smartphone

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు