రెండు రోజుల క్రితం వన్‌ప్లస్ నార్డ్ 2 5జీ (OnePlus Nord 2 5G) స్మార్ట్‌ఫోన్ పేలిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. తన జేబులో వన్‌ప్లస్ నార్డ్ 2 స్మార్ట్‌ఫోన్ పేలిందని ఓ వ్యక్తి ట్విట్టర్‌లో ఫోటోలు పోస్ట్ చేశాడు. బాధితుడిని కాంటాక్ట్ అయిన వన్‌ప్లస్ అతనికి రీఫండ్ ఇచ్చినట్టు MySmartPrice వెల్లడించింది. అంతేకాదు... ఈ ఘటన వల్ల సదరు వ్యక్తికి గాయాలు కావడంతో ఆస్పత్రి ఖర్చుల్ని కూడా ఇస్తామని వన్‌ప్లస్ ప్రకటించినట్టు సదరు వెబ్‌సైట్ తెలిపింది. సుహిత్ శర్మ అనే వ్యక్తి పేలిన వన్‌ప్లస్ నార్డ్ 2 స్మార్ట్‌ఫోన్ ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. "ఇలాంటిది మీ నుంచి అస్సలు ఊహించలేదు. వన్‌ప్లస్ నార్డ్ 2 (OnePlus Nord 2) పేలింది. మీ ప్రొడక్ట్ ఎలా ఉందో చూడండి. తర్వాతి పరిణామాలకు సిద్ధంగా ఉండండి. ప్రజల జీవితంతో ఆడుకోవడం ఆపండి" అని ట్వీట్ చేశాడు.
@OnePlus_IN Never expected this from you #OnePlusNord2Blast see what your product have done. Please be prepared for the consequences. Stop playing with peoples life. Because of you that boy is suffering contact asap. pic.twitter.com/5Wi9YCbnj8
— Suhit Sharma (@suhitrulz) November 3, 2021
ఈ ఘటనపై విచారణ జరిపేందుకు వన్‌ప్లస్ టీమ్ రంగంలోకి దిగింది. స్మార్ట్‌ఫోన్ పేలడానికి గల కారణాలను ఆరా తీసింది. బాధితుడికి స్మార్ట్‌ఫోన్ డబ్బుల్ని రీఫండ్ చేసింది. దీంతో పాటు ఆస్పత్రి ఖర్చుల్ని కూడా తామే భరిస్తామని ఒప్పుకుంది. వన్‌ప్లస్ బృందం తనతో టచ్‌లో ఉన్నట్టు బాధితుడు కూడా వెల్లడించాడు. కానీ రీఫండ్ విషయం ట్విట్టర్‌లో వెల్లడించలేదు. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ పేలడానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు వన్‌ప్లస్.
WhatsApp Tricks: వాట్సప్‌లో ఎవరైనా విసిగిస్తున్నారా? వాళ్లకు తెలియకుండా ఇలా చేయండి
వన్‌ప్లస్ నార్డ్ 2 స్మార్ట్‌ఫోన్ ఇప్పుడే కాదు... గతంలో కూడా పేలిన ఘటనలు ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం కేరళలో వన్‌ప్లస్ నార్డ్ 2 ఛార్జర్ పేలింది. పవర్ సాకెట్‌కు కనెక్ట్ చేసి ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది. అప్పుడు కూడా బాధితులు ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే వోల్టోజ్ హెచ్చుతగ్గుల కారణంగా ఈ ఘటన జరిగి ఉండొచ్చని, తమ డివైజ్‌లో ఎలాంటి లోపం లేదని వన్‌ప్లస్ వెల్లడించింది.
Android 12: స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అలర్ట్... ఆండ్రాయిడ్ 12 ఓఎస్ వచ్చే స్మార్ట్‌ఫోన్స్ ఇవే
ఇక అంతకుముందు ఢిల్లీలో ఓ లాయర్ జేబులో వన్‌ప్లస్ నార్డ్ 2 స్మార్ట్‌ఫోన్ పేలినట్టు వార్తలొచ్చాయి. అయితే ఆ ఘటనలో సదరు లాయర్‌దే తప్పు ఉందంటూ వన్‌ప్లస్ లీగల్ నోటీస్ జారీ చేసింది. మరోవైపు అంతకుముందు బెంగళూరులో ఓ మహిళ బ్యాగులో వన్‌ప్లస్ నార్డ్ 2 5జీ స్మార్ట్‌ఫోన్ పేలింది. అప్పుడు కూడా స్మార్ట్‌ఫోన్ తయారీ లేదా డిజైన్‌లో ఎలాంటి లోపం లేదని, స్మార్ట్‌ఫోన్‌పై ఒత్తిడి పడటం వల్ల పేలి ఉండొచ్చని వన్‌ప్లస్ తెలిపింది.
వన్‌ప్లస్ నార్డ్ 2 5జీ స్మార్ట్‌ఫోన్ విషయానికి వస్తే గతేడాది ఇండియాలో బాగా పాపులర్ అయిన వన్‌ప్లస్ నార్డ్ అప్‌గ్రేడ్ వర్షన్‌గా ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. అయితే ఇటీవల కాలంలో వన్‌ప్లస్ నార్డ్ 2 స్మార్ట్‌ఫోన్ పేలిన ఘటనలు ఇప్పటికే ఈ మొబైల్ వాడుతున్నవారిలో కలవరం రేపుతున్నాయి. ఈ ఘటనలకు గల కారణాలను కంపెనీ వెల్లడించాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, Mobile News, Mobiles, Oneplus, Smartphone