హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

OnePlus: త్వరలోనే రెండు డెస్క్‌టాప్‌ మానిటర్లు లాంచ్‌ చేస్తున్న వన్‌ప్లస్‌.. వాటి ఫీచర్లపై ఓ లుక్కేయండి..

OnePlus: త్వరలోనే రెండు డెస్క్‌టాప్‌ మానిటర్లు లాంచ్‌ చేస్తున్న వన్‌ప్లస్‌.. వాటి ఫీచర్లపై ఓ లుక్కేయండి..

Photo Credit : OnePlus

Photo Credit : OnePlus

OnePlus: వన్‌ప్లస్‌ డెస్క్‌టాప్‌ మానిటర్ల విభాగంలోనూ అడుగుపెడుతోంది. డిసెంబర్​ 12న కొత్తగా రెండు డెస్క్‌టాప్‌ మానిటర్లను రిలీజ్​ చేసేందుకు సిద్దమవుతోంది. వన్‌ప్లస్‌ మానిటర్ ఎక్స్ 27, వన్‌ప్లస్‌ మానిటర్ ఈ24 పేర్లతో ఇవి మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఇండియన్‌ మార్కెట్‌లో వన్‌ప్లస్‌ (OnePlus) బ్రాండ్‌కు ఉన్న క్రేజ్‌​ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రీమియం ఫీచర్లతో మిడ్‌రేంజ్‌ ఫోన్లను రిలీజ్​ చేయడం వన్‌ప్లస్‌ ​ ప్రత్యేకత. అందుకే వన్‌ప్లస్‌ ​ బ్రాండ్​ నుంచి విడుదలయ్యే స్మార్ట్‌ఫోన్లు (Smartphones) హాట్‌కేకుల్లా అమ్ముడవుతాయి. ఇప్పుడు ఇదే పాపులారిటీతో తన మార్కెట్‌ను మరింతగా విస్తరించే పనిలో వన్‌ప్లస్‌ ఉంది. ఇందులో భాగంగానే డెస్క్‌టాప్‌ మానిటర్ల విభాగంలోనూ అడుగుపెడుతోంది. డిసెంబర్​ 12న కొత్తగా రెండు డెస్క్‌టాప్‌ మానిటర్లను రిలీజ్​ చేసేందుకు సిద్దమవుతోంది.

వన్‌ప్లస్‌ మానిటర్ ఎక్స్ 27, వన్‌ప్లస్‌ మానిటర్ ఈ24 పేర్లతో ఇవి మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయాన్ని కంపెనీ ట్విట్టర్​ పేజీలో పెట్టిన టీజర్​లో పేర్కొంది. అలాగే అధికారిక వెబ్‌సైట్‌లోనూ ప్రకటించింది. ఉచితంగా మానిటర్లను గెలుచుకునేందుకు ఒక లక్కీడ్రాను కూడా కంపెనీ నిర్వహిస్తోంది.

* లీకైన వన్‌ప్లస్‌​ మానిటర్ల ఫీచర్లు

వన్‌ప్లస్‌ ఎక్స్​27 మానిటర్​ మోడల్​ 27 ఇంచుల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇక వన్‌ప్లస్‌ ఎక్స్​ 24 మోడల్​ 24 ఇంచుల స్క్రీన్‌తో వస్తుంది. వీటిలో ఓ మోడల్​ పోట్రయిడ్​ మోడ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ మానిటర్లలో గేమింగ్ ఎక్స్​పీరియన్స్​ అదిరిపోతుందని వన్‌ప్లస్‌ తన టీజర్​లో పేర్కొంది. అయితే వీటి ధరలపై అధికారిక ప్రకటన చేయనప్పటికీ.. ఎక్స్​ 27 మానిటర్​ ప్రీమియం రేంజ్​, ఈ24 మానిటర్ మిడ్‌రేంజ్‌లో లభించనున్నాయి. దేశంలోని కొనుగోలుదారుల కోసం ఈ మోడల్‌లను రూ.20,000 లోపు విడుదల చేసే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి : అట్రాక్టివ్​ లుక్​, అదిరిపోయే ఫీచర్లతో లాంచ్‌ అయిన టీవీఎస్ అపాచీ స్పెషల్​ ఎడిషన్‌.. దీని ధర ఎంతంటే?

* దేశంలో క్రమంగా విస్తరిస్తోన్న వన్‌ప్లస్‌

వన్‌ప్లస్‌ తన ప్రోడక్ట్ పోర్ట్​ఫోలియోను క్రమంగా విస్తరిస్తోంది. ముందుగా ప్రీమియం స్మార్టఫోన్లు మాత్రమే రిలీజ్​ చేసిన సంస్థ.. క్రమంగా మిడ్​ రేంజ్​ మార్కెట్‌ను ఆక్రమించింది. కేవలం రూ.25 వేల ధరలోనే ప్రీమియం ఫీచర్లు గల ఫోన్లను విక్రయిస్తోంది. దీంతో ఇండియాలో చాలా తక్కువ సమయంలోనే మోస్ట్ పాపులర్​ బ్రాండ్‌గా నిలిచింది.

ఈ పాపులారిటీని కాపాడుకుంటూనే క్రమంగా వేరే ప్రొడక్ట్స్‌ను మార్కెట్​లోకి తీసుకొస్తోంది. నెక్‌బ్యాండ్స్‌, ఇయర్‌బడ్స్‌, ఇతర ఆడియో ప్రొడక్ట్‌లను లాంచ్​ చేస్తుంది. ఇటీవలే స్మార్ట్‌వాచ్‌లను లాంచ్​ చేసింది. మరోవైపు స్మార్ట్‌ టీవీల మార్కెట్‌లోనూ వన్‌ప్లస్‌ జోరు కొనసాగుతోంది.

ఇండియాలో ప్రస్తుతం టాప్​ 3 స్మార్ట్​ టీవీ బ్రాండ్లలో వన్‌ప్లస్‌ ​ ఒకటిగా ఉందని కౌంటర్​ పాయింట్​ రీసెర్చ్​ నివేదిక వెల్లడించింది. ఇప్పుడు డెస్క్‌టాప్‌ మానిటర్ల విభాగంలోకి సైతం అడుగుపెట్టి, ఇండియా ఎలక్ట్రానిక్​ ఇండస్ట్రీలో టాప్​ ప్లేస్​ లక్ష్యంగా కృషి చేస్తోంది. రియల్​మీ, వన్‌ప్లస్‌ కంపెనీలు ఇతర ఇండియన్‌ బ్రాండ్‌లకు గట్టి పోటీ ఇస్తున్నాయి. ఇవి తక్కువ ధరలోనే నాణ్యమైన ప్రొడక్ట్‌లను రిలీజ్​ చేస్తుండటంతో గణనీయమైన పోటీ ఏర్పడింది. ఈ పోటీని తట్టుకునేందుకు ఇతర కంపెనీలు సైతం తమ ప్రోడక్ట్ ధరలను తగ్గించాల్సిన పరిస్థితి నెలకొంది.

First published:

Tags: Monitors, Oneplus, Tech news, Technolgy

ఉత్తమ కథలు