హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

OnePlus Nord CE 3: మిడ్ రేంజ్‌లో రానున్న వన్‌ప్లస్ నార్డ్ CE 3.. లీక్ అయిన ఫీచర్స్!

OnePlus Nord CE 3: మిడ్ రేంజ్‌లో రానున్న వన్‌ప్లస్ నార్డ్ CE 3.. లీక్ అయిన ఫీచర్స్!

OnePlus Nord CE 3: మిడ్ రేంజ్‌లో రానున్న వన్‌ప్లస్ నార్డ్ CE 3.. లీక్ అయిన ఫీచర్స్!

OnePlus Nord CE 3: మిడ్ రేంజ్‌లో రానున్న వన్‌ప్లస్ నార్డ్ CE 3.. లీక్ అయిన ఫీచర్స్!

OnePlus Nord CE 3: టిప్‌స్టర్ ఆన్‌లీక్ Nord CE 3 స్పెసిఫికేషన్స్‌ను లీక్ చేసినట్లు ఆన్‌లైన్ పబ్లికేషన్ MySmartPrice వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌, ఫుల్ HD+ రిజల్యూషన్‌‌తో 6.72-అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉండవచ్చు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

చైనీస్ ఎలక్ట్రానిక్ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus) ఎక్కువగా ప్రీమియం కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని స్మార్ట్‌ఫోన్ల(Smartphones)ను తీసుకొస్తుంది. అందుకు తగ్గట్టుగానే ఇటీవల వన్‌ప్లస్ 11 5జీ, వన్‌ప్లస్ 11 ఆర్ 5జీని లాంచ్ చేసింది. తాజాగా సరసమైన వన్‌ప్లస్ నార్డ్ CE 3 (OnePlus Nord CE 3)పై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. గతేడాది వచ్చిన వన్‌ప్లస్ నార్డ్ CE 2కి సక్సెర్‌గా దీన్ని తీసుకురానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇంటర్‌నెట్‌లో లీక్ అయ్యాయి. ఆ వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం.

* 120Hz రిఫ్రెష్ రేట్‌, AMOLED డిస్‌ప్లే

టిప్‌స్టర్ ఆన్‌లీక్ Nord CE 3 స్పెసిఫికేషన్స్‌ను లీక్ చేసినట్లు ఆన్‌లైన్ పబ్లికేషన్ MySmartPrice వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌, ఫుల్ HD+ రిజల్యూషన్‌‌తో 6.72-అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉండవచ్చు. బయోమెట్రిక్ సెక్యూరిటీ కోసం ఫింగర్‌ఫ్రింట్ స్కానర్ కూడా ఉండవచ్చని MySmartPrice తన రిపోర్ట్‌లో పేర్కొంది.

* ట్రిపుల్ కెమెరా సెటప్, 5,000mAh బ్యాటరీ

ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 782 SoC చిప్‌సెట్ వినియోగించి ఉండవచ్చు. ఇది గరిష్టంగా 12GB RAM + 256GB స్టోరేజ్‌తో కనెక్ట్ అయిన ఉండవచ్చు. 50-మెగాపిక్సెల్ (IMX890) కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరాతో రియర్ ట్రిపుల్ కెమెరా సెటప్, సెల్ఫీల కోసం ఫోన్ ముందు భాగంలో 16-మెగాపిక్సెల్ కెమెరా, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ చేసే 5,000mAh బ్యాటరీ వంటి ఫీచర్స్ ఉండే అవకాశం ఉందని MySmartPrice పేర్కొంది.

* జూన్ లేదా జూలైలో లాంచ్

OnePlus Nord CE 3 ధర విషయంలో స్పష్టత లేదు. స్పెసిఫికేషన్స్ బట్టి చూస్తే ఈ ఫోన్ ధర రూ. 20,000 నుంచి రూ. 25,000 మధ్య ఉండవచ్చు. ఈ ఫోన్ ఈ ఏడాది జూన్ లేదా జూలైలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. కాగా, గతేడాది వచ్చిన OnePlus Nord CE 2 బేస్ వేరియంట్ (6GB RAM + 128GB) ధర రూ.23,999 కాగా, టాప్ వేరియంట్ (8GB RAM + 128GB) ధర రూ. 24,999. అయితే ఈ రెండు వేరియంట్స్ ప్రస్తుతం వరుసగా రూ. 18,999, రూ. 20,999కు అందుబాటులో ఉన్నాయి.

ఇది కూడా చదవండి : ప్రముఖ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. ఆ లింక్స్ పై క్లిక్ చేస్తే మీ డబ్బు గోవిందా గోవిందా!

* నవంబర్ రిపోర్ట్ ప్రకారం..

ఈ OnePlus Nord CE 3 స్పెసిఫికేషన్స్ సంబంధించి ఇప్పటికే ఓ రిపోర్ట్ 2022 నవంబర్‌లో ఇంటర్ నెట్‌లో చక్కర్లు కొట్టింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్, 6.7-అంగుళాల LCD డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ వంటి ఫీచర్స్ ఉంటాయని ఆ రిపోర్ట్ పేర్కొంది. అంతేకాకుండా 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, బ్లాక్ బాడీ, ట్రిపుల్ కెమెరాస్ కోసం వెనుకవైపు రెండు లార్జ్ రౌండ్ కటౌట్స్‌ను ఆ రిపోర్ట్ హైలైట్ చేసింది.

First published:

Tags: New smartphone, Oneplus, Tech news

ఉత్తమ కథలు