ONEPLUS IS REPORTEDLY LOOKING TO INTRODUCE NEW PHONES IN THE SUB RS 20000 SEGMENT GH SSR
OnePlus: వన్‌ప్లస్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. వచ్చే ఏడాది రూ. 20 వేలలోపు బడ్జెట్ స్మార్ట్ఫోన్లు
ప్రతీకాత్మక చిత్రం
స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ భారత బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో పాగా వేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే వన్‌ప్లస్ నుంచి రూ. 30 వేల శ్రేణిలో అనేక ప్రీమియం స్మార్ట్ఫోన్లు విడుదల కాగా.. వాటికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అయితే భారత్‌లో బడ్జెట్ స్మార్ట్ఫోన్లకు గణనీయమైన డిమాండ్ ఉంటుంది.
స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ భారత బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో పాగా వేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే వన్‌ప్లస్ నుంచి రూ. 30 వేల శ్రేణిలో అనేక ప్రీమియం స్మార్ట్ఫోన్లు విడుదల కాగా.. వాటికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అయితే భారత్‌లో బడ్జెట్ స్మార్ట్ఫోన్లకు గణనీయమైన డిమాండ్ ఉంటుంది. ఈ మార్కెట్‌ను ప్రస్తుతం శామ్సంగ్, ఒప్పో, వివో, షియోమి సంస్థలు క్యాష్ చేసుకుంటున్నాయి. అందుకే వాటిని తలదన్నేలా బడ్జెట్ ధరలోనే స్మార్ట్ఫోన్లను ప్రవేశపెట్టాలని వన్‌ప్లస్ యోచిస్తోంది. ఈ మేరకు వచ్చే ఏడాది రెండో త్రైమాసికంలో రూ. 20 వేల సెగ్మెంట్లో స్మార్ట్ఫోన్లను విడుదల చేయాలని ప్రణాళికలు రచిస్తోంది.
ఇందులో భాగంగానే వన్‌ప్లస్ తన ఆక్సిజన్ ఓఎస్‌ను ఒప్పో కలర్ ఓఎస్‌తో విలీనం చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ బడ్జెట్ స్మార్ట్ఫోన్ల రాకపై ప్రముఖ డేటా ఇంజనీర్, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ యోగేష్ బ్రార్ ట్వీట్ చేస్తూ ‘‘వచ్చే ఏడాది నుంచి బడ్జెట్ స్మార్ట్ఫోన్లును తీసుకొచ్చేందుకు వన్‌ప్లస్ సిద్ధమవుతోంది. ప్రస్తుతం వన్‌ప్లస్ పాపులర్ నార్డ్ సిరీస్‌లో అన్ని ఫోన్లను రూ. 20 వేల కంటే తక్కువ ధరకే తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది. దీంతో భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను శాసించాలని భావిస్తోంది. ఇవి వచ్చే ఏడాది రెండో త్రైమాసికంలో భారత్‌లోకి లాంచ్ అయ్యే అవకాశం ఉంది. లేదా కాస్త ఆలస్యం కావచ్చు” అని ట్వీట్లో పేర్కొన్నారు.
* 2022 రెండో త్రైమాసికంలో భారత్‌లోకి..
వన్‌ప్లస్ ప్రస్తుతం ఫ్లాగ్షిప్, ప్రీమియం ఫోన్ల మార్కెట్లో దూసుకుపోతుంది. అయితే రాబోయే కాలంలో బడ్జెట్-ఫ్రెండ్లీ ఫోన్లను పరిచయం చేయడం ద్వారా భారత మార్కెట్లో విస్తరించాలని వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే రూ. 20 వేల ధరల శ్రేణిలో బడ్జెట్ ఫోన్లను నార్డ్ బ్రాండింగ్‌తో పరిచయం చేయనుంది. కంపెనీ ఇటీవల వన్‌ప్లస్ నార్డ్ ఎన్ 200 5జీ వంటి -సరసమైన ఫోన్లను అమెరికా, కెనడా వంటి మార్కెట్లలో ప్రవేశపెట్టింది. అయితే ఈ మోడల్స్ ఇంకా భారతదేశానికి తీసుకురాలేదు.
ప్రస్తుతం శామ్సంగ్, ఒప్పో, వివో, షియోమి వంటి సంస్థలు ఇండియన్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రాణిస్తున్నాయి. ఇవి వరుసగా బడ్జెట్ స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేస్తూ యూజర్ల సంఖ్యను పెంచుకుంటున్నాయి. అయితే అత్యంత పోటీ గల ఈ బడ్జెట్ విభాగంలోకి ఇప్పుడు వన్‌ప్లస్ కూడా ఎంటర్ అవుతోంది. వన్‌ప్లస్ రాకతో బడ్జెట్ స్మార్ట్ఫోన్ల శ్రేణి మరింత విస్తరించే అవకాశం ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.