చైనీస్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం వన్‌ప్లస్ (Oneplus) ఇప్పటి వరకు ప్రీమియం కస్టమర్లను ఆకర్షించడానికి, ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్‌లో వివిధ రకాల డివైజ్‌లను తీసుకొచ్చింది. తాజాగా మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌లో నార్డ్ సిరీస్‌లో ఒక స్మార్ట్‌ఫోన్‌తో పాటు ఇయర్ బడ్స్‌ను లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ జాబితాలో వన్‌ప్లస్ నార్డ్ CE 3 లైట్ 5G, వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 2 ఉన్నాయి. ఈ రెండు ప్రొడక్ట్స్ త్వరలో లాంచ్ కానున్నాయి? వాటి ధరలు, స్పెసిఫికేషన్స్‌పై ఓ లుక్కేద్దాం.
* కలర్ ఆప్షన్స్ వివరాలు
వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 2, వన్‌ప్లస్ నార్డ్ CE 3 లైట్ 5G లాంచ్ తేదీని కంపెనీ నిర్ణయించింది. ఈ రెండు ప్రొడక్ట్స్ ఏప్రిల్ 4న భారత మార్కెట్‌లో అడుగుపెట్టబోతున్నాయి. వీటి డిజైన్ వివరాలను తెలియజేయడానికి వన్‌ప్లస్ మైక్రోసైట్‌ను ఏర్పాటు చేసింది. ఈ మైక్రోసైట్ పేజీ ప్రకారం.. వన్‌ప్లస్ నార్డ్ CE 3 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ పాస్టెల్ లైమ్ కలర్ ఆప్షన్‌లో అందుబాటులోకి రానుంది. LED ఫ్లాష్, రియర్ ట్రిపుల్-కెమెరా సెటప్ వంటి ఫీచర్స్ ఇందులో ఉండనున్నాయి. ఇక, వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 2 బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్స్‌తో రానుంది.
* ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
వన్‌ప్లస్ నార్డ్ CE 3 లైట్ 5G స్పెసికేషన్స్ పూర్తి వివరాలను కంపెనీ ఇప్పటికీ వెల్లడించలేదు. అయితే దీనికి సంబంధించిన కొన్ని ఫీచర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రధానంగా ఇందులో 120 Hz రీఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల IPS LCD డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌లో స్నాప్‌డ్రాగన్ 695 SoC చిప్ సెట్ ఉపయోగించినట్లు సమాచారం. ఇది ఆక్సిజన్ ఓఎస్ 13తో ఆండ్రాయిడ్ 13 రన్ అవుతుంది.
Something's coming. Something #LargerThanLife. Know more on April 4th.#OnePlusNordCE3Lite
— OnePlus India (@OnePlus_IN) March 23, 2023
ట్రిపుల్ కెమెరా సెటప్(108 MP + 2 MP + 2 MP), LED ప్లాష్, 16 MP ఫ్రంట్ కెమెరా, 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5,000 mAh బ్యాటరీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్స్ దీని ప్రత్యేకతలుగా ఉండే అవకాశం ఉంది. ఇక, వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 2 లో స్పెసిఫికేషన్స్‌గా వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్, బ్లూటూత్ 5.3, యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్, మైక్రోఫోన్, ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ మినిమం 20Hz, మ్యాగ్జిమమ్ 20KHz ఉండే అవకాశం ఉంది. ఈ రెండు ప్రొడక్ట్స్‌ను అమెజాన్ , కంపెనీ వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
* అంచనా ధర
వన్‌ప్లస్ కంపెనీ నార్డ్ సిరీస్‌లో ఇప్పటికే CE 2 Lite 5Gను భారత్ లో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. దీని ధర రూ.19,999. తాజాగా లాంచ్ చేయబోయే CE 3 Lite 5G ధర కూడా రూ.20వేల లోపు ఉండే అవకాశం ఉందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక, వన్ ప్లస్ నార్డ్ బడ్స్ 2 ధర రూ. 2999గా ఉండే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి : వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్లు.. ఆ సమస్యలు అన్నింటికీ చెక్..!
* ఆఫర్స్ వివరాలు
వన్‌ప్లస్ కంపెనీ నార్డ్ CE 3 లైట్‌పై లాంచ్ ఆఫర్ ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసేవారికి ఇయర్ బర్డ్ ప్రయోజనాలను అందిస్తోంది. వీటిలో ఉచిత OnePlus ప్రొడక్ట్ (ఏదైనా, పరిమిత-కాల ఆఫర్), తగ్గింపు ధరలో పొడిగించిన వారంటీ, ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లతో ఇన్‌స్టంట్ డిస్కౌంట్, 2 నెలల యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్స్ వంటి ప్రయోజనాలను పొందవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Earbuds, Latest Technology, Oneplus, Tech news