వన్‌ప్లస్ ఫ్యాన్స్‌కు శుభవార్త. ఇండియాలో మరో నార్డ్ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసేందుకు వన్‌ప్లస్ (OnePlus) సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే వన్‌ప్లస్ నార్డ్ 2 (OnePlus Nord 2) రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. త్వరలో వన్‌ప్లస్ నార్డ్ 2 ప్యాక్‌మ్యాన్ లిమిటెడ్ ఎడిషన్ (OnePlus Nord 2 Pac-Man Limited Edition) లాంఛ్ చేయనుంది. ఇందుకు సంబంధించిన టీజర్‌ను వన్‌ప్లస్ ఇండియా ట్వీట్ చేసింది. టీజర్లో ప్యాక్ మ్యాన్ గేమ్ ఇమేజ్ తప్ప ఇతర వివరాలు ఏవీ లేవు. అయితే ప్యాక్ మ్యాన్ థీమ్‌తో వన్‌ప్లస్ నార్డ్ 2 రిలీజ్ చేయొచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న స్పష్టత లేదు. నవంబర్లోనే ఈ స్మార్ట్‌ఫోన్ ఇండియాలో రిలీజ్ అవుతుంది.
Something you definitely won't ? at is coming soon... pic.twitter.com/X0bcyIxEgY
— OnePlus India (@OnePlus_IN) November 4, 2021
వన్‌ప్లస్ నార్డ్ 2 ప్యాక్‌మ్యాన్ లిమిటెడ్ ఎడిషన్ స్పెసిఫికేషన్స్ వన్‌ప్లస్ నార్డ్ 2 లో ఉన్నట్టుగానే ఉండొచ్చు. కేవలం ప్రాసెసర్ మాత్రమే మారుతుందని అంచనా. వన్‌ప్లస్ నార్డ్ 2 స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్ ఉండగా, వన్‌ప్లస్ నార్డ్ 2 ప్యాక్‌మ్యాన్ లిమిటెడ్ ఎడిషన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్ ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. కొందరు టిప్‌స్టర్స్ ఇందుకు సంబంధించిన ట్వీట్స్ చేస్తున్నారు.
WhatsApp: వాట్సప్ యూజర్లకు అలర్ట్... పొరపాటున కూడా ఈ తప్పులు చేయొద్దు
Oneplus Nord 2 Pacman limited edition with SD 778G coming up! Officially Teased! #OneplusNord2Pacman #Pacman https://t.co/t2ToRjfK0V pic.twitter.com/gzIYfpzuyD
— Paras Guglani (@passionategeekz) November 4, 2021
వన్‌ప్లస్ నార్డ్ 2 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ, 12జీబీ+256జీబీ వేరియంట్స్‌లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. కొత్త మోడల్ కూడా ఎన్ని వేరియంట్స్‌తో రిలీజ్ అవుతుందో స్పష్టత లేదు. ప్రస్తుతం వన్‌ప్లస్ నార్డ్ 2 స్మార్ట్‌ఫోన్ 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.29,999 కాగా, 12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.34,999. వన్‌ప్లస్ నార్డ్ 2 ప్యాక్‌మ్యాన్ లిమిటెడ్ ఎడిషన్ ధర దాదాపుగా ఇదే స్థాయిలో ఉంటుందని అంచనా.
ఇక వన్‌ప్లస్ నార్డ్ 2 స్పెసిఫికేషన్స్ చూస్తే 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.43 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమొలెడ్ డిస్ప్లే ఉంది. ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ఏఐ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50 మెగాపిక్సెల్ సోనీ IMX766 ప్రైమరీ కెమెరా + 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా + 2 మెగాపిక్సెల్ మోనోక్రామ్ సెన్సార్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండటం విశేషం. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.
వన్‌ప్లస్ నార్డ్ 2 స్మార్ట్‌ఫోన్‌లో 4,500ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 65వాట్ వార్ప్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్సిజన్ ఓఎస్ 11.3 + ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ బరువు 190గ్రాములు. వన్‌ప్లస్ నార్డ్ 2 స్మార్ట్‌ఫోన్‌ను బ్లూ హేజ్, గ్రే సియెర్రా, గ్రీన్ వుడ్ కలర్స్‌లో కొనొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, Mobile News, Mobiles, Oneplus, Smartphone