Home /News /technology /

ONEPLUS DIWALI SALE ONEPLUS 10 PRO ONEPLUS 10R AND NORD 2T AVAILABLE ON DISCOUNT KMV

Oneplus Sale: ఆఫర్లంటే ఇవే.. ఈ ఫోన్లపై రూ.18 వేల భారీ తగ్గింపు!

 ఆఫర్లంటే ఇవే.. ఈ ఫోన్లపై రూ.18 వేల భారీ తగ్గింపు!

ఆఫర్లంటే ఇవే.. ఈ ఫోన్లపై రూ.18 వేల భారీ తగ్గింపు!

Oneplus Offers | మీరు కొత్త ఫోన్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ లేదా అమెజాన్‌లో సూపర్ డీల్స్ అందుబాటులో ఉన్నాయని సెర్చ్ చేస్తున్నారా? అయితే మీరు ఒక విషయం తెలుసుకోవాలి. మరో అదిరిపోయే డీల్ అందుబాటులో ఉంది. ఇందలో భారీ తగ్గింపు లభిస్తోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam
    Oneplus Smartphones | చాలా మంది వన్‌ప్లస్ ఫ్యాన్స్ ఉన్నారు. మీరు కూడా ఈ బ్రాండ్ ప్రియులు అయితే మీకు గుడ్ న్యూస్. వన్‌ప్లస్ (Oneplus) స్మార్ట్‌ఫోన్ (Smartphone) కొనుగోలు చేయాలని భావించే వారికి అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాలి. వన్‌ప్లస్ ప్రత్యేకంగా వన్‌ప్లస్ దివాలీ సేల్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా వన్‌ప్లస్ ప్రొడక్టులపై భారీ తగ్గింపు పొందొచ్చు. వన్‌ప్లస్ దివాలీ సేల్‌లో భాగంగా పలు వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లపై కూడా భారీ తగ్గింపు ఆఫర్లు లభిస్తున్నాయి. ఈ ఫెస్టివ్ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్లు పొందొచ్చు. ఈ నెల చివరి వరకు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. వన్‌ప్లస్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి సేల్ కింద అందుబాటులో ఉన్నా ఆఫర్లు సొంతం చేసుకోవచ్చు. ఎయిర్‌టెల్ పండుగ గిఫ్ట్.. కస్టమర్లకు 5 జీబీ డేటా ఉచితం! వన్‌ప్లస్ 10 ప్రో 8 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ. 66,999గా ఉంది. ఈ ఫోన్‌ను యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా కొంటే అదనంగా రూ. 6 వేలు తగ్గింపు పొందొచ్చు. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. రూ. 10 వేల వరకు ఎక్స్చేంజ్ తగ్గింపు వస్తుంది. ఇంకా రెడ్ కాయిన్స్‌తో రూ. 2 వేల డిస్కౌంట్ లభిస్తుంది. ఇక వన్‌ప్లస్ 10 ఆర్ స్మార్ట్‌ఫోన్‌పై కూడా ఆఫర్ ఉంది. ఈ ఫోన్ ఇప్పుడు రూ. 32,999కు లభిస్తోంది. యాక్సిస్ క్రెడిట్ కార్డుపై రూ. 3 వేల ఇన్‌స్టంట్ డిస్కౌంట్ వస్తుంది. అలాగే ఎక్స్చేంజ్ డిస్కౌంట్ రూ. 3 వేలు ఉంది. ఐఫోన్ 12పై కనీవినీ ఎరుగని డిస్కౌంట్.. ఫస్ట్ టైమ్ అతి తక్కువ ధరకే! వన్‌ప్లస్ నార్డ్ 2టీ ఫోన్‌ ధర రూ. 28,999గా ఉంది. అయితే దివాలీ సేల్‌లో ఈ ఫోన్‌ను రూ. 24,999కు కొనొచ్చు. అంటే రూ.4 వేల తగ్గింపు ఉంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై ఈ ఆఫర్ ఉంటుంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ ఫోన్ ధర రూ. 18,999గా ఉంది. సేల్‌లో భాగంగా ఈ ఫోన్‌పై రూ. 1500 తగ్గింపు ఉంది. దీన్ని యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో రూ. 17,499కు కొనొచ్చు. కేవలం స్మార్ట్‌ఫోన్ల మీదనే కాకుండా వన్‌ప్లస్ దివాలీ సేల్‌లో భాగంగా కంపెనీ అందిస్తున్న టీవీలపై కూడా ఆఫర్లు పొందొచ్చు. ఇంకా ఇయర్ బడ్స్ కొనుగోలుపై కూడా భారీ డిస్కౌంట్ లభిస్తోంది. వన్‌ప్లస్ సైట్‌లోకి వెళ్లి ప్రొడక్టులపై ఉన్న ఆఫర్ల పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
    Published by:Khalimastanvali Khalimastanvali
    First published:

    Tags: Amazon, Amazon Great Indian Festival Sale, Flipkart, Flipkart Big Billion Days, Latest offers, Oneplus

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు