హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

OnePlus 11R: 25 నిమిషాల్లో ఫుల్‌ఛార్జ్.. 50 మెగాపిక్సెల్ కెమెరా.. ఫిబ్రవరి 7న వన్‌ప్లస్ 11R స్మార్ట్‌ఫోన్ లాంచ్

OnePlus 11R: 25 నిమిషాల్లో ఫుల్‌ఛార్జ్.. 50 మెగాపిక్సెల్ కెమెరా.. ఫిబ్రవరి 7న వన్‌ప్లస్ 11R స్మార్ట్‌ఫోన్ లాంచ్

OnePlus 11R: 25 నిమిషాల్లో ఫుల్‌ఛార్జ్.. 50 మెగాపిక్సెల్ కెమెరా.. ఫిబ్రవరి 7న వన్‌ప్లస్ 11R స్మార్ట్‌ఫోన్ లాంచ్

OnePlus 11R: 25 నిమిషాల్లో ఫుల్‌ఛార్జ్.. 50 మెగాపిక్సెల్ కెమెరా.. ఫిబ్రవరి 7న వన్‌ప్లస్ 11R స్మార్ట్‌ఫోన్ లాంచ్

OnePlus 11R: వన్‌ప్లస్ కంపెనీ మరో ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరిలో జరిగే క్లౌడ్ 11 ఈవెంట్‌లో OnePlus 11R పేరుతో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేస్తున్నట్లు ధ్రువీకరించింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

చైనీస్ ఎలక్ట్రానిక్ దిగ్గజం వన్‌ప్లస్(OnePlus)కు భారత మార్కెట్‌ (Indian Market)లో మంచి డిమాండ్ ఉంది. ఈ కంపెనీ ప్రధానంగా ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్‌ కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని స్మార్ట్‌ఫోన్స్, టీవీలు, రిఫ్రిజిరేటర్స్‌ను అద్భుతమైన ఫీచర్స్‌తో తీసుకొస్తుంది. ఈ సంస్థ మరో ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరిలో జరిగే క్లౌడ్ 11 ఈవెంట్‌లో OnePlus 11R పేరుతో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేస్తున్నట్లు ధ్రువీకరించింది.

ఈ ఫ్లాగ్‌షిప్ డివైజ్‌లో అద్భుతమైన హై-ఎండ్ ఫీచర్స్ ఉన్నాయి. దీంట్లో ADFR 2.0తో 120Hz సూపర్ ఫ్లూయిడ్ డిస్‌ప్లే ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ స్నాప్ డ్రాగన్ 8+Gen 1 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 16 GB వరకు RAM ఉంటుంది. ఈ ఫోన్ ధర రూ.40వేల నుంచి ప్రారంభం కావచ్చు.

* 25 నిమిషాల్లో ఫుల్‌ఛార్జ్

వన్‌ప్లస్ 11R ఫోన్‌లో రియర్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ కెమెరాలు ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్ ముందుభాగంలో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అమర్చారు. సూపర్-ఫాస్ట్ 100W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000mAh బ్యాటరీ ఈ డివైజ్‌లో ఉంటుంది. భారీ సామర్థ్యం బ్యాటరీ కారణంగా 25 నిమిషాల్లో ఫుల్‌ఛార్జ్ అవుతుంది.

* RAM-Vitaతో బెస్ట్ ఎక్స్ పీరియన్స్

వన్‌ప్లస్11R డివైజ్‌లో RAM-Vita అనే మెషిన్-లెర్నింగ్ AI ఉంటుంది. ఫోన్ యూజ్ చేసే సమయంలో RAM రీ- అలకేషన్‌ను వేగవంతం చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఫాస్ట్ సిస్టమ్ రెస్పాన్స్ టైమ్, స్టెబిలిటీని అందిస్తుంది. అలాగే హెవీ డ్యూటీ యాప్స్ ఆపరేటింగ్, స్విచ్ఛింగ్‌ ప్రక్రియను స్మూత్‌గా డీల్ చేస్తుంది. శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 చిప్‌సెట్‌ను ఈ స్మార్ట్‌ఫోన్‌లో వినియోగించారు. దీంతో ఇది మోస్ట్ మెమరీ-ఇంటెన్సివ్ గేమ్‌లను ఆడుతున్నప్పుడు వేగంగా, మరింత సమర్థవంతమైన ఆన్-డివైస్ క్రాస్-టాస్కింగ్‌ను డెలివరీ చేస్తుంది.

* గేమర్స్‌ డివైజ్

ఈ స్మార్ట్‌ఫోన్‌లో లెటెస్ట్ ఇన్నోవేషన్ ‘జనరల్ పెర్ఫార్మెన్స్ అడాప్టర్ (GPA) ఫ్రేమ్ స్టెబిలైజర్ 4.0’ కూడా ఉంటుంది. GPA 4.0 అనేది మెషిన్ లెర్నింగ్ ఫ్రేమ్ స్టెబిలైజేషన్ టెక్నాలజీ. గేమ్‌ ఆడుతున్నప్పుడు యూజర్ చురుకుగా నేర్చుకోవడానికి ఇది సహాయపడుతుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో సిస్టమ్ AI టెక్నాలజీ ఉంటుంది. ఇది డివైజ్ పర్ఫార్మెన్స్, పవర్ కన్జ్యూమ్‌‌ను బ్యాలెన్స్ చేస్తుంది. స్థిరంగా హై ఫ్రేమ్ రేట్ గ్రాఫిక్-ఇంటెన్సివ్ సీన్స్ పొందడానికి లేదా సిస్టమ్ వనరులు తక్కువగా అవసరమైనప్పుడు విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి ఈ ఏఐ టెక్నాలజీ ఉపయోగపడుతుంది.

ఇది కూడా చదవండి : 31 గంటల బ్యాటరీ లైఫ్.. ధర అందుబాటులో.. ఒప్పో నుంచి ఎన్కో ఎయిర్ 3 TWS ఇయర్‌బడ్స్!

LTPS డిస్‌ప్లే కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ADFR 2.0తో వన్‌ప్లస్11R 5G లాంచ్ కానుంది. ADFR 2.0 డిస్‌ప్లే ఫ్రేమ్ రేట్‌ను యూజ్ చేసే‌దాన్ని బట్టి 40Hz, 45Hz, 60Hz, 90Hz, 120Hz మధ్య ఆటోమెటిక్‌గా సర్దుబాటు చేయవచ్చు.

* ఈవెంట్ ఎప్పుడు?

వన్‌ప్లస్‌కు చెందిన క్లౌడ్ 11 ఈవెంట్ ఫిబ్రవరి 7న గ్రాండ్‌గా జరగనుంది. ఈ ఈవెంట్‌లో వన్‌ప్లస్ 11R తోపాటు మరికొన్ని ప్రొడక్ట్స్‌ను కంపెనీ లాంచ్ చేయనుంది. ఈ జాబితాలో వన్‌ప్లస్11 5G, వన్‌ప్లస్ పాడ్, వన్‌ప్లస్ TV 65 Q2 Pro, వన్‌ప్లస్ బడ్స్ Pro 2 వంటి ఫ్లాగ్‌షిప్ డివైజ్‌లు ఉన్నాయి.

First published:

Tags: Oneplus, Smart phone, Tech news

ఉత్తమ కథలు