ONEPLUS COMMUNITY SALE GOOD NEWS FOR ONEPLUS LOVERS EYE CATCHING OFFERS ON SMART PHONES AT COMMUNITY SALE GH EVK
OnePlus Community Sale: వన్‌ప్లస్ లవర్స్‌కు అదిరిపోయే శుభవార్త.. కమ్యూనిటీ సేల్‌లో స్మార్ట్ఫోన్లపై కళ్లు చెదిరే ఆఫర్లు
వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్
OnePlus Community Sale తాజాగా వన్‌ప్లస్ బ్రాండ్ 8వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కమ్యూనిటీ సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో భాగంగా వన్‌ప్లస్ స్మార్ట్ఫోన్ల నుండి టీవీల వరకు అన్ని ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. ఇప్పటికే ప్రారంభమైన ఈ సేల్ డిసెంబర్ 20న ముగుస్తుంది.
చైనా (China)కు చెందిన ప్రముఖ స్మార్ట్ బ్రాండ్ వన్‌ప్లస్ (One Plus) భారత మార్కెట్లో వేగంగా విస్తరిస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఉత్పత్తులను లాంచ్ చేస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇందులో భాగంగా కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా వన్‌ప్లస్ బ్రాండ్ 8వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కమ్యూనిటీ సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో భాగంగా వన్‌ప్లస్ స్మార్ట్ఫోన్ల నుండి టీవీల వరకు అన్ని ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. ఇప్పటికే ప్రారంభమైన ఈ సేల్ డిసెంబర్ 20న ముగుస్తుంది. ఈ సేల్‌లో స్మార్ట్ఫోన్లు (Smart Phones), స్మార్ట్‌టీవీలు, ఇతర వన్‌ప్లస్ ఉత్పత్తులపై కళ్లు చెదిరే ఆఫర్లు ప్రకటించింది. వన్‌ప్లస్ 9 ప్రో అసలు ధర రూ. 64,999 వద్ద ఉండగా.. దీన్ని కేవలం రూ. 59,999 వద్ద అందుబాటులోకి తెచ్చింది. ఇక, వన్‌ప్లస్ 9 అసలు ధర రూ. 49,999 వద్ద ఉండగా.. దాన్ని కేవలం రూ. 36,999 వద్ద అందుబాటులోకి తెచ్చింది.
ఇక, వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9 ప్రో కొనుగోలుపై రూ. 5,000 వోచర్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్ల (Offers)కు అదనంగా, కస్టమర్లు ఐసీఐసీఐ బ్యాంక్ (ICIC Bank), కోటక్ బ్యాంక్(Kotak Bank) కార్డ్‌లు లేదా ఈఎంఐని ఉపయోగించి చేసే లావాదేవీలపై రూ. 8,000 వరకు అడిషనల్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు.
For the ones who turn snaps into their best shots. It’s time for you to up your smartphone game with OnePlus 9 Series 5G at OnePlus Community Sale.
Know More:https://t.co/KKdslFvPlRpic.twitter.com/hFKQjy9Xj2
వన్‌ప్లస్ స్మార్ట్ టీవీలపై రూ. 4వేల వరకు డిస్కౌంట్
మరోవైపు, ఐసీఐసీఐ బ్యాంక్ లేదా కోటక్ మహీంద్రా బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి వన్‌ప్లస్ 9R స్మార్ట్‌ఫోన్ (Smart Phone) ను కొనుగోలు చేస్తే రూ. 3,000 డిస్కౌంట్ పొందవచ్చు. దీనికి అదనంగా రూ. 3,000 వోచర్ కూడా లభిస్తుంది. ఇక, వన్‌ప్లస్ 9 సిరీస్‌లోని పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ (Exchange) చేయడం ద్వారా అదనంగా రూ. 6,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇక, వన్‌ప్లస్ నార్డ్ 2, వన్‌ప్లస్ నార్డ్ సీఈ స్మార్ట్ఫోన్లపై కూడా డిస్కౌంట్లను అందిస్తోంది.
వన్‌ప్లస్ నార్డ్ 2లో కోటక్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి రూ. 1,000 వోచర్‌ను, రూ. 3,000 తగ్గింపును పొందవచ్చు. వీటితో పాటు వన్‌ప్లస్ బ్యాండ్‌ను కేవలం రూ. 999 వద్ద విక్రయిస్తోంది. ఇక, వన్‌ప్లస్ గేమింగ్ ట్రిగ్గర్లను కేవలం రూ. 499 వద్ద అందుబాటులోకి తెచ్చింది. మరోవైపు, వన్‌ప్లస్ స్మార్ట్ టీవీలపై రూ. 4 వేల వరకు తక్షణ తగ్గింపులతో పాటు ఐసీఐసీఐ, కోటక్ బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి చేసే లావాదేవీలపై కూడా తగ్గింపు అందిస్తోంది. మీరు వన్‌ప్లస్ వాచ్, వన్‌ప్లస్ బడ్స్ ప్రో, వన్‌ప్లస్ బడ్స్ జెడ్, ఇతర యాక్సెసరీలపై డిస్కౌంట్లను పొందవచ్చు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.