ONEPLUS BUDS Z2 WITH ANC 38 HOURS OF BATTERY LIFE LAUNCHED PRICE AND SPECIFICATIONS CHECK DETAILS JNK GH
OnePlus Buds Z2: భారత మార్కెట్లోకి వన్‌ప్లస్ బడ్స్ జెడ్2 లాంచ్.. 38 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో పాటు మరెన్నో ఫీచర్లు
వన్ ప్లస్ నుంచి 38 గంటల బ్యాటరీ బ్యాకప్ ఉన్న ఇయర్ బడ్స్
OnePlus Buds Z2: ప్రముఖ స్మార్ట్బ్రాండ్ వన్‌ప్లస్ భారత మార్కెట్లోకి కొత్త ఇయర్‌బడ్స్‌ను లాంచ్ చేసింది. వన్‌ప్లస్ బడ్స్ జెడ్2 పేరుతో వీటిని ఆవిష్కరించింది. ఈ ట్రూ వైర్లెస్ ఇయర్ఫోన్లు మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌కు మద్దతిస్తుంది.
ప్రముఖ స్మార్ట్బ్రాండ్ (Smart Brand)వన్‌ప్లస్ (One Plus) భారత మార్కెట్లోకి కొత్త ఇయర్‌బడ్స్‌ను (Ear Buds) లాంచ్ (Launch) చేసింది. వన్‌ప్లస్ బడ్స్ జెడ్2 పేరుతో వీటిని ఆవిష్కరించింది. ఈ ట్రూ వైర్లెస్ (Wireless) ఇయర్ఫోన్లు (Ear Phones) మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌కు మద్దతిస్తుంది.వీటిలో 11 మి.మీ. డ్రైవర్లను అమర్చింది. ఇది 38 గంటల బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. వన్‌ప్లస్ బడ్స్ జెడ్ 2 గతేడాది ప్రారంభమైన వన్‌ప్లస్ బడ్స్ జెడ్‌కి కొనసాగింపుగా వచ్చింది. డిజైన్ పరంగా చూస్తే, వన్‌ప్లస్ బడ్స్ జెడ్2, వన్‌ప్లస్ జెడ్‌తో సమానంగా కనిపిస్తుంది. వన్‌ప్లస్ బడ్స్ జెడ్2 యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్‌తో వస్తుంది. గతంలో విడుదలైన వన్‌ప్లస్ జెడ్‌లో మెరుగైన బ్యాటరీ లేదని చాలా మంది నిరాశ చెందారు. కానీ, అందుకే తాజాగా విడుదలైన బడ్స్ జెడ్2లో మెరుగైన బ్యాటరీ బ్యాకప్ అందించింది.
వన్‌ప్లస్ బడ్స్ జెడ్2 ధర, లభ్యత
వన్‌ప్లస్ బడ్స్ జెడ్2ను తొలుత చైనా మార్కెట్లోకి విడుదల చేసింది. అక్కడ మంచి రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు భారత మార్కెట్‌తో పాటు గ్లోబల్ మార్కెట్లోకి అధికారికంగా లాంచ్ చేసింది. బడ్స్ Z2 యునైటెడ్ స్టేట్స్లో $99 (సుమారు రూ. 7500), యూరప్‌లో 99 (రూ. 8500) వద్ద విడుదలైంది. ఇది ప్రస్తుతం పెరల్ వైట్ కలర్ వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. త్వరలో బ్లాక్ కలర్ వేరియంట్ కూడా లాంచ్ అవుతుందని నివేదికలు సూచిస్తున్నాయి. అబ్సిడియన్ బ్లాక్ వేరియంట్లో కూడా వచ్చే అవకాశం ఉంది.
వన్‌ప్లస్ బడ్స్ Z2 బాస్- హెవీ మ్యూజిక్‌ను ఉత్పత్తి చేసే 11mm డ్రైవర్లతో వస్తుంది. ఇది యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇయర్‌బడ్స్ 40 డిబి వరకు బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ను క్యాన్సల్ చేయగలవు. మెరుగైన కాల్ క్వాలిటీ కోసం మూడు -మైక్ సెటప్‌లను కూడా అందించింది. ప్రతి బడ్స్‌లో 40mAh బ్యాటరీ ఉంటుంది. దీని ఛార్జింగ్ కేస్ 520mAh బ్యాటరీతో వస్తుంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే బ్యాటరీ 38 గంటల పాటు పని చేస్తుందని కంపెనీ పేర్కొంది. ఇయర్‌బడ్స్ కేవలం 10 నిమిషాల్లో 5 గంటల ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తాయని కంపెనీ తెలిపింది. ఇవి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి మద్దతిస్తాయి. వాటర్, స్వెట్ నుండి ప్రొటెక్షన్ కోసం IP55 రేటింగ్‌తో వస్తాయి. కాబట్టి మీరు జిమ్‌లో ఇయర్‌బడ్స్‌ను సౌకర్యవంతంగా ధరించవచ్చు. ఇక, కనెక్టివిటీ పరంగా చూస్తే.. ఈ ఇయర్‌బడ్‌లు బ్లూటూత్ 5.2 వెర్షన్‌కు మద్దతిస్తాయి.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)గ
Published by:John Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.