భారతదేశంలో త్వరలో జరగబోయే జాతీయపండగ రిపబ్లిక్ డే సందర్భంగా OnePlus కొన్ని అత్యద్భుతమైన ఆఫర్లను విడుదల చేసింది. OnePlus 8T లేదా OnePlus Nord వంటి స్మార్ట్ఫోన్లు, U లేదా Y సిరీస్ వంటి స్మార్ట్ టీవీలు మరియు OnePlus యొక్క ఉపకరణాలు మొదలైన ఉత్పత్తులు అన్ని ఆఫర్లలో ఉన్నాయి. గ్లోబల్ టెక్నాలజీ సంస్థకు చెందిన అత్యుత్తమ ఉత్పత్తులు మరియు పరికరాలను కొనడానికి ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం.
మీ ఎంపికను మరింత సులభతరం చేయడానికి, రిపబ్లిక్ డే సందర్భంగా ఉన్న ఆఫర్ల నుండి మీరు పొందగలిగిన ప్రయోజనాలను ఒక జాబితా చేసాము. దిగువ జాబితా నుండి మీకు నచ్చిన, మీరు మెచ్చిన OnePlus పరికరాన్ని ఎంచుకొని నూతన సంవత్సరాన్ని మరింత వినూత్నంగా ప్రారంభించండి.
OnePlus 8T 5G
ఇటీవలి కాలంలో విడుదలైన OnePlus యొక్క స్మార్ట్‌ఫోన్, OnePlus 8T 5G ఇంత తక్కువ ధరలో లభించడం బహూశ ఇదే మొట్టమొదటిసారి కాబోలు. దాని అసలు ధర INR 42,999 కాగా, అమెజాన్ ఇండియా యొక్క గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో 8T ఇప్పుడు INR 38,999 రూపాయలు మాత్రమే, అంటే దాదాపుగా 4,000 రూపాయల వరకు ఆదా పొందవచ్చు. ఈ ఆఫర్ జనవరి 19వ తారీకు నుండి 23వ తారీకు వరకు అందుబాటులో ఉంటుంది. అమెజాన్ కూపన్ల ద్వారా అదనంగా పొందే INR 2500 డిస్కౌంట్ పరిమిత కాలానికి చెల్లుబాటు అవుతుంది, అంతేకాకుండా SBI క్రెడిట్ కార్డ్ ద్వారా మరొక 1500 రూపాయల తగ్గింపును కూడా పొందవచ్చు.
మీరు OnePlus అధికారిక వెబ్సైట్ oneplus.in, OnePlus Store App, OnePlus Experience Stores లో నుండి నేరుగా కొనుగోలుచేయలంటే కూడా ఎన్నో ఆకర్షణీయమైన ఆఫర్ లు అందుబాటులో ఉన్నాయి. HDFC బ్యాంక్ కార్డుల ద్వారా 8T 5G కొనుగోలుచేసినట్లయితే 2000 రూపాయల వరకు ఆఫ్ పొందవచ్చు, అంతేకాకుండా సులభమైన EMI లు కూడా పొందవచ్చు. oneplus.in మరియు OnePlus Store App నుండి American Express కార్డుల ద్వారా కొనుగోలుకు ఎంచుకున్నట్లయితే మరొక 10% క్యాష్‌బ్యాక్ పొందడానికి కూడా అర్హులవుతారు.
120Hz డిస్ప్లే, సరికొత్త క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్ మరియు దృఢమైన కెమెరా-సెటప్ వంటి ఫ్లాగ్షిప్ స్పెక్స్ లను కలిగిఉన్న అత్యద్భుతమైన స్మార్ట్‌ఫోన్ OnePlus 8T 5G దాదాపుగా రాబోయే రెండు సంవత్సరాల వరకు ఇదే అగ్రగామి అని చెప్పవచ్చు.
OnePlus Nord
2020లో అత్యంత ప్రీతిపాత్రమైన స్మార్ట్ఫోన్లలో ఇది ఎవరూ ఊహించని ధరలకే లభిస్తుంది. ఫ్లాగ్షిప్-లెవల్ ఫీచర్స్, ఫ్లూయిడ్ 90Hz డిస్ప్లే క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 765 జి ప్రాసెసర్ అంతేకాకుండా తక్కువ ధరకే కొన్ని సమర్థవంతమైన కెమెరాలు అందుబాటులోకి తెచ్చి OnePlus Nord తన ప్రత్యేకతను చాటుకుంది.
గ్రే యాష్, బ్లూ మార్బుల్ మరియు గ్రే ఒనిక్స్ అనే మూడు రంగులలో లభించే 8+128 GB వేరియంట్ యొక్క అసలు ధర INR 27,999 కాగా, అలాగే 12+256 GB వేరియంట్ ధర INR 29,999 మాత్రమే. HDFC బ్యాంక్ కార్డులతో 1000 అదనపు తగ్గింపు పొందుతూ 6 నెలల వరకు వడ్డీ లేకుండా EMI చెల్లించవచ్చు. మీరు ఈ ప్రీమియం మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కడినుండి తీసుకుంటారనే దానితో సంబంధం లేకుండా, క్రెడిట్ కార్డులు ఉపయోగించి 6 నెలల వరకు వడ్డీ లేకుండా EMI చెల్లించవచ్చు.
OnePlus TVs
టాప్ నాచ్ డిస్ప్లే, డాల్బీ ఆడియోలను కలిగి ఉన్న OnePlus టీవీలు తక్కువ సమయంలోనే అద్భుతమైన ప్రజాధారణను పొందడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. OnePlus రిపబ్లిక్ డే సేల్ ద్వారా అన్ని బడ్జెట్ Y సిరీస్ మరియు ఫ్లాగ్షిప్ Q1 సిరీస్ పై కొన్ని ఉత్తమ డిస్కౌంట్లను అందిస్తోంది.
OnePlus టివి క్యూ సిరీస్‌లో 4 కె క్యూఎల్ఇడి డిస్ప్లే, డాల్బీ విజన్‌తో పాటు డాల్బీ అట్మోస్‌తో 50 W 8-స్పీకర్ సెటప్‌ను 4000 రూపాయల వరకు డిస్కౌంట్ తో పొందవచ్చు. HDFC క్రెడిట్ కార్డులు, క్రెడిట్ కార్డ్ EMI మరియు డెబిట్ కార్డ్ EMIలను ఉపయోగించి కొనుగోలు చేసేటప్పుడు వారు OnePlus TV Y సిరీస్‌లో INR 1000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. OnePlus TV Y సిరీస్ 43 ”లో అదనపు INR 1000 మరియు OnePlus TV Y సిరీస్ 32” లో INR 500 తగ్గింపు పొందే అవకాశం కూడా ఉంది.
OnePlus ఉపకరణాలు
ఇప్పటి నుండి జనవరి 24 వరకు, మీకు ఇష్టమైన OnePlus ఉపకరణాలను రాయితీ రేటుతో తీసుకోవచ్చు. OnePlus బుల్లెట్ వైర్లెస్ Z సిరీస్ ఇప్పుడు కేవలం 1899 రూపాయలకు లభిస్తుంది, OnePlus పవర్‌బ్యాంక్ ధర కేవలం 999 రూపాయలకే oneplus.in మరియు OnePlus Store App లో లభిస్తుంది. అంతేకాకుండా, OnePlus బడ్స్ 4699 రూపాయలకు లభిస్తుండగా, OnePlus బడ్స్ Z కేవలం 2799 రూపాయలకే oneplus.in మరియు OnePlus Store App లో లభిస్తుంది.
OnePlus బుల్లెట్స్ వైర్లెస్ Z బాస్ ఎడిషన్, OnePlus బడ్స్ మరియు OnePlus బడ్స్ Z Amazon.in, Flipkart.com, OnePlus ఎక్స్‌క్లూజివ్ ఆఫ్‌లైన్ స్టోర్స్ మరియు పార్టనర్ రిటైల్ అవుట్లెట్లలో 5% తక్కువ ధరలో లభిస్తాయి.
OnePlus స్టోర్ యాప్ లేదా oneplus.in లో సైన్ అప్ చేయడం ద్వారా వినియోగదారులు అన్ని oneplus ఉత్పత్తులపై రెడ్ కేబుల్ క్లబ్ సభ్యత్వం ద్వారా అదనపు 100 రూపాయలను ఆదా చేయవచ్చు. రెడ్ కేబుల్ క్లబ్ సభ్యునిగా, మీరు పొందిన డిస్కౌంట్ వోచర్లతో జనవరి 31 వరకు రెడ్ కేబుల్ ప్రైవ్లోని సరికొత్త సరుకులను పొందవచ్చు.
OnePlus స్టోర్ యాప్ లేదా oneplus.in లో సైన్ అప్ చేయడం ద్వారా వినియోగదారులు అన్ని oneplus ఉత్పత్తులపై రెడ్ కేబుల్ క్లబ్ సభ్యత్వం ద్వారా అదనపు 100 రూపాయలను ఆదా చేయవచ్చు. రెడ్ కేబుల్ క్లబ్ సభ్యునిగా, మీరు పొందిన డిస్కౌంట్ వోచర్లతో జనవరి 31 వరకు రెడ్ కేబుల్ ప్రైవ్లోని సరికొత్త సరుకులను పొందవచ్చు. రెడ్ కేబుల్ ప్రైవ్లో భాగంగా, OnePlus 8, 8 Pro & 8T 5G కొనుగోలుపై ఉచితంగా OnePlus పవర్‌బ్యాంక్‌తో పాటు OnePlus 3 నుంచి OnePlus 6 టిని ఉపయోగించే వినియోగదారులకు బ్యాటరీ గ్యారెంటీ పై 50% తగ్గింపు పొందటానికి మీరు అర్హతపొందుతారు. అంతేకాకుండా ఈ ఆఫర్ 2021 చివరి వరకు చెల్లుతుంది.
రెడ్ కేబుల్ క్లబ్ సభ్యుల కోసం ప్రత్యేకంగా OnePlus అర్బన్ ట్రావెలర్ బ్యాక్‌ప్యాక్ కూడా అందుబాటులో ఉంది. మీరు చేయాల్సిందల్లా రెడ్ కేబుల్ ప్రైవ్ నుండి వచ్చిన ఆహ్వాన కోడ్‌ను పొంది, oneplus.in లేదా OnePlus Store App లో కొనుగోలు చేయండి.
రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆనందించడానికి మంచి మంచి ఆఫర్లతో oneplus అనేక రకాల పరికరాలను మన ముందుకు తెచ్చింది. జనవరి 26 వరకు అందుబాటులో ఉండే ఈ సేల్ ముగిసే లోగా వీలైనన్ని ఎక్కువ ఆఫర్లను ఉపయోగించుకొని, మీకు నచ్చిన మీరు మెచ్చిన పరికరాలను మీ సొంతం చేసుకొండి.