హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Oneplus: వన్‌ప్లస్ మొబైల్ యూజర్లకు అలర్ట్.. ఇకపై ఆ మోడల్స్‌కు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌ బంద్..

Oneplus: వన్‌ప్లస్ మొబైల్ యూజర్లకు అలర్ట్.. ఇకపై ఆ మోడల్స్‌కు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌ బంద్..

  Oneplus

Oneplus

Oneplus: తమ సంస్థ నుంచి వచ్చిన రెండు సిరీస్‌ల ఫోన్లకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌ ఇకపై సెండ్ చేయబోమని తాజాగా వన్‌ప్లస్ కంపెనీ ప్రకటించింది. ఆ మోడల్స్ ఏంటో తెలుసుకోండి.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ప్రముఖ ఫ్లాగ్‌షిప్ ఫోన్ల తయారీ కంపెనీ వన్‌ప్లస్ (OnePlus) ఇప్పటికే ఎన్నో ఫోన్లను లాంచ్ చేసింది. 2019లో ఈ కంపెనీ తీసుకొచ్చిన OnePlus 7 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు బాగా పాపులర్ అయ్యాయి. ఈ ఫోన్లతో వన్‌ప్లస్ కంపెనీ షియోమీ, శామ్‌సంగ్ వంటి బ్రాండ్స్‌కి పోటీగా నిలిచింది. వీటి తర్వాత OnePlus 7T సిరీస్‌ను లాంచ్ చేసింది. ఇవి కూడా బాగా అమ్ముడుపోయాయి. అయితే ఈ రెండు సిరీస్ ఫోన్లకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌ ఇకపై సెండ్ చేయబోమని తాజాగా వన్‌ప్లస్ కంపెనీ ప్రకటించింది. నిజానికి OnePlus 7, OnePlus 7T సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం కంటిన్యూగా కంపెనీ అప్‌డేట్‌లను అందించింది. కానీ ఇకనుంచి ఆ సిరీస్ ఫోన్లకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ సపోర్ట్‌ను నిలిపేస్తుంది.

OnePlus 7 సిరీస్ 2019 మే నెలలో ఆక్సిజన్OS 9తో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సిరీస్ లైనప్‌లో వన్‌ప్లస్ 7, వన్‌ప్లస్ 7 ప్రో ఉన్నాయి. OnePlus 7T సిరీస్ ఫోన్లను 2019 అక్టోబర్ నెలలో లాంచ్ చేసింది. అందులో వన్‌ప్లస్ 7T, వన్‌ప్లస్ 7T ప్రో ఉన్నాయి. వీటిలో OxygenOS 10 అవుట్ ఆఫ్ బాక్స్‌గా వచ్చింది.

కాగా ఈ రెండు సిరీస్ మొబైల్స్‌కు OxygenOS 12 వరకు కంపెనీ అప్‌డేట్స్‌ను అందించింది. ఆపై కొత్త ఓఎస్ వెర్షన్ రిలీజ్ చేయబోమని స్పష్టం చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus 7, 7 Pro, 7T సిరీస్ ఫోన్‌లకు కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను విడుదల చేయడాన్ని నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కంపెనీ ప్రకారం, OxygenOS 12 MP3 బిల్డ్ OnePlus 7/7T సిరీస్‌కి చివరి అప్‌డేట్.

వన్‌ప్లస్ 7 సిరీస్‌కు H.32 (GM1911 11.H.32), వన్‌ప్లస్ 7T సిరీస్‌కు F.18 (HD1901 11.F.18) అనేవే చివరి స్టేబుల్ వెర్షన్‌లుగా కంపెనీ పేర్కొంది. "మెయింటెనెన్స్ షెడ్యూల్ ప్రకారం, వన్‌ప్లస్ 7/7 ప్రో కోసం MP3 చివరి బిల్డ్ అవుతుంది." అని కంపెనీ కమ్యూనిటీ ఫారంలో ఒక పోస్ట్‌ ద్వారా తెలిపింది.

ఆక్సిజన్‌ఓఎస్ 12 ఎమ్‌పీ3 డిసెంబర్ 2022 సెక్యూరిటీ ప్యాచ్‌లను వన్‌ప్లస్ 7, వన్‌ప్లస్ 7 టి సిరీస్‌లకు అందిస్తుంది. అలాగే సిస్టమ్‌ స్టెబిలిటీ, పర్ఫామెన్స్ వంటి కొన్ని చిన్న ఇంప్రూవ్‌మెంట్స్ ఆఫర్ చేస్తుంది. కమ్యూనికేషన్ విషయంలో మొబైల్ నెట్‌వర్క్ కనెక్షన్‌ల స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది.

ఇది కూడా చదవండి :  గుండెపోటును ముందే పసిగట్టే స్మార్ట్‌వాచ్‌? నాసా,AI టెక్నాలజీతో వస్తున్న డివైజ్‌ వివరాలివే..

జులై 2021లో OnePlus 8 సిరీస్ తర్వాత లాంచ్ అయిన అన్ని ఫోన్లు మూడు మేజర్ ఆండ్రాయిడ్ అప్‌డేట్స్‌, మూడు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ పొందుతాయని OnePlus ప్రకటించింది. కంపెనీ తన అప్‌కమింగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లలో కొన్నింటికి ఈ లిమిట్‌ను ఇటీవలే నాలుగు సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్‌కి చేంజ్ చేసింది. 2023 నుంచి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లను ఎంచుకోవడానికి నాలుగేళ్ల ఆండ్రాయిడ్ అప్‌డేట్లు, ఐదేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్లను అందిస్తామని వన్‌ప్లస్ ప్రకటించింది.

First published:

Tags: Oneplus, Smartphones, Software, Tech news

ఉత్తమ కథలు