Home /News /technology /

ONEPLUS ANNOUNCES REPUBLIC DAY SALE 2021 DISCOUNTS ON THESE AMAZING PRODUCTS MS GH

OnePlus Republic Day Sale: రిపబ్లిక్ డే ఆఫర్లు.. వన్ ప్లస్ డివైజ్ లపై భారీ డిస్కౌంట్లు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

OnePlus Republic Day Sale: జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా వన్ ప్లస్ సంస్థ తన వస్తువులపై డిస్కౌంట్లు ప్రకటించింది. టీవీలు, స్మార్ట్ ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలపై రాయితీనిచ్చింది. ఈ ఆఫర్లు జనవరి 19 నుంచి 26 వరకు అందుబాటులో ఉండనున్నాయి.

ఇంకా చదవండి ...
  • News18
  • Last Updated :
జనవరి నెలంటేనే పండుగ సీజన్. నూతన సంవత్సరంతో మొదలై సంక్రాంతి.. రిపబ్లిక్ డే వరకు అంతా సందడిగా ఉంటుంది. దీన్నే దృష్టిలో ఉంచుకోనే చాలా సంస్థలు పండుగలకు ఆఫర్లు ప్రకటిస్తాయి. తాజాగా జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా వన్ ప్లస్ సంస్థ తన వస్తువులపై డిస్కౌంట్లు ప్రకటించింది. టీవీలు, స్మార్ట్ ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలపై రాయితీనిచ్చింది. ఈ ఆఫర్లు జనవరి 19 నుంచి 26 వరకు అందుబాటులో ఉండనున్నాయి. యాక్సెసిరీస్ దగ్గరకొస్తే వన్ ప్లస్ పవర్ బ్యాంకులు, వైర్లెస్ ఇయర్ ఫోన్స్ లాంటి వాటిపై డిస్కౌంటు ఇచ్చింది. ఈ ఆఫర్లు వన్ ప్లస్ అధికారిక వెబ్ సైట్ లో లేదా వన్ ప్లస్ స్టోర్ యాప్, దేశవ్యాప్తంగా ఉన్న వన్ ప్లస్ ఎక్స్ పీరియన్స్ స్టోర్స్ లో మాత్రమే అందుబాటులో ఉంటాయి.

వన్ ప్లస్ ఉత్పత్తులు రాయితీలు..

వన్ ప్లస్ 8టీ 5జీ..
ఈ మొబైల్ ఫోన్ ధర వచ్చేసి రూ.38,999లు. ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉన్నవారికి రూ.1500 రాయితీతో పాటు అమేజాన్ కూపన్ డిస్కౌంటు ఉంటుంది. అదనంగా అమెరికన్ ఎక్స్ ప్రెస్ కార్డు ఉన్నవారికి 10 శాతం ఆఫర్, HDFC కార్డులపై రూ.2000 ఆఫర్ లభ్యమవుతుంది అమెజాన్, oneplus.in పోర్టల్, వన్ ప్లస్ స్టోర్, వన్ ప్లస్ ఎక్స పీరియన్స్ స్టోర్లలో కొనుగోలు చేసుకోవచ్చు.

వన్ ప్లస్ టీవీ క్యూ1..
ఈ టీవీ ధర వచ్చేసి రూ.62,900. HDFC క్రెడిట్, డెబిడ్ ఈఎంఐ కార్డు ఉన్న వారికి 4000 ఆఫర్ ఉంటుంది. oneplus.in పోర్టల్, వన్ ప్లస్ స్టోర్, వన్ ప్లస్ ఎక్స పీరియన్స్ స్టోర్లలో కొనుగోలు చేసుకోవచ్చు.

వన్ ప్లస్ టీవీ వై(32-అంగుళాలు)..
ఈ టీవీ ధర వచ్చేసి రూ.14,999. HDFC క్రెడిట్ లేదా డెబిట్ ఈఎంఐ కార్డు ఉన్నవారికి రూ.1000 ఆఫర్ తో పాటు మరో వెయ్యి అదనపు ఆఫర్ ఇచ్చింది. oneplus.in పోర్టల్, వన్ ప్లస్ స్టోర్, వన్ ప్లస్ ఎక్స పీరియన్స్ స్టోర్లలో కొనుగోలు చేసుకోవచ్చు.

వన్ ప్లస్ టీవీ-వై సిరీస్(43-అంగుళాలు)..
ఈ టీవీ ధర వచ్చేసి రూ.19,999. HDFC క్రెడిట్, డెబిట్ కార్డు ఈఎంఐ ఉన్నవారికి రూ.1000ల ఆఫర్ తో పాటు మరో 500 అదనపు ఆఫర్ లభ్యమవుతుంది. oneplus.in పోర్టల్, వన్ ప్లస్ స్టోర్, వన్ ప్లస్ ఎక్స పీరియన్స్ స్టోర్లలో కొనుగోలు చేసుకోవచ్చు.

వన్ ప్లస్ నార్డ్..
ఈ స్మార్ట్ ఫోన్ ఖరీదు వచ్చేసి రూ.27,999. క్రెడిట్ కార్డు, ఈఎంఐపై కొనుగోలు చేసిన వారికి రూ.1000ల ఆఫర్ తో పాటు ఆరు నెల ఆప్షన్ ఎంచుకుంటే నో కాస్ట్ ఈఎంఐ అందుబాటులో ఉంటుంది. oneplus.in పోర్టల్, వన్ ప్లస్ స్టోర్, వన్ ప్లస్ ఎక్స పీరియన్స్ స్టోర్లలో కొనుగోలు చేసుకోవచ్చు.

వన్ ప్లస్ పవర్ బ్యాంకు..
ఈ పవర్ బ్యాంకు ఖరీదు వచ్చేసి రూ.999. oneplus.in పోర్టల్, వన్ ప్లస్ స్టోర్లలో కొనుగోలు చేసుకోవచ్చు.

వన్ ప్లస్ బులెట్స్ వైర్లెస్ జెడ్ సిరీస్..
ఈ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ ఖరీదు వచ్చేసి రూ.1899. అమెజాన్, ఫ్లిప్ కార్టుల్లో కొనుగోలు చేస్తే 5 శాతం అదనపు ఆఫర్ లభ్యమవుతుంది. oneplus.in పోర్టల్, వన్ ప్లస్ స్టోర్లలో కొనుగోలు చేసుకోవచ్చు.

వన్ ప్లస్ బడ్స్..
ఈ ఇయర్ బడ్స్ ధర వచ్చేసి రూ.4,699. అమేజాన్, ఫ్లిప్ కార్టుల్లో కొనుగోలు చేస్తే 5 శాతం అదనపు రాయితీ ఉంటుంది. వీటిని oneplus.in పోర్టల్, వన్ ప్లస్ స్టోర్లలో కొనుగోలు చేసుకోవచ్చు.

వన్ ప్లస్ బడ్స్ జెడ్..
ఈ మోడల్ ఇయర్ బడ్స్ ఖరీదు వచ్చేసి రూ.2,799. అమేజాన్, ఫ్లిప్ కార్టుల్లో కొనుగోలు చేస్తే 5 శాతం అదనపు రాయితీ ఉంటుంది. వీటిని oneplus.in పోర్టల్, వన్ ప్లస్ స్టోర్లలో కొనుగోలు చేసుకోవచ్చు.
Published by:Srinivas Munigala
First published:

Tags: Bumper offer, Mobiles, ONE PLUS, Republic Day 2021, Smart TV, Technology

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు