ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వన్‌ప్లస్ (OnePlus) ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేస్తూ మొబైల్ ప్రియులను ఆకట్టుకుంటోంది. ఇందులో భాగంగా తాజాగా మరొక స్మార్ట్‌ఫోన్ (Smartphone) లాంచ్ చేసేందుకు కంపెనీ సిద్ధమయ్యింది.
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వన్‌ప్లస్ (OnePlus) ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేస్తూ మొబైల్ ప్రియులను ఆకట్టుకుంటోంది. ఇందులో భాగంగా తాజాగా మరొక స్మార్ట్‌ఫోన్ (Smartphone) లాంచ్ చేసేందుకు కంపెనీ సిద్ధమయ్యింది. ఏప్రిల్ 21న వన్‌ప్లస్ ఏస్ (OnePlus Ace) స్మార్ట్‌ఫోన్ ను చైనాలో లాంచ్ చేస్తున్నామని కంపెనీ ధ్రువీకరించింది. చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వీబో (Weibo) ద్వారా వన్‌ప్లస్ ఏస్ లాంచ్ వివరాలను కంపెనీ షేర్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్, లీక్ అయిన స్పెసిఫికేషన్లు ఏవో ఇప్పుడు చూద్దాం.
TMREIS Admissions: తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ అప్లికేషన్స్‌కు గడువు పొడిగింపు.. ఆ రోజు నుంచి పరీక్షలు..
వన్‌ప్లస్ ఏస్ స్మార్ట్‌ఫోన్.. ఇండియాలో ఏప్రిల్ 28న రిలీజ్ కానున్న వన్‌ప్లస్ 10ఆర్ (OnePlus 10R) స్మార్ట్‌ఫోన్‌కి రీబ్రాండెడ్ వెర్షన్ అయి ఉండవచ్చని చాలా మంది టెక్ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. నేమ్స్ డిఫరెంట్ అయినా ఈ రెండు ఫోన్లు ఒకటేనని, ఇవి ఒకే విధమైన డిజైన్లు, మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్‌సెట్‌ను కలిగి ఉన్నాయని లీక్ స్టర్స్ పేర్కొంటున్నారు.
వీబో, వన్‌ప్లస్ వెబ్‌సైట్‌లోని టీజర్లు కూడా వన్‌ప్లస్ ఏస్ మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్‌తో లాంచ్ అవుతుందని, ఇది 150W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందని స్పష్టం చేస్తున్నాయి. ఈ రేంజ్ లో ఫాస్ట్ ఛార్జింగ్ తో వచ్చే ఫోన్ 100% ఛార్జ్ అవ్వడానికి ఎంత తక్కువ సమయం పడుతుందో చూడాలి. ఈ ఫోన్ 17 నిమిషాల్లో 1-100% ఛార్జ్ అవుతుందని నివేదికలు పేర్కొంటున్నాయి. అఫీసియల్ టీజర్ ప్రకారం, వన్‌ప్లస్ ఏస్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో వన్‌ప్లస్ అలర్ట్ స్లైడర్ (Alert Slider) లేదు. దీన్నిబట్టి చూస్తుంటే ఫ్లాగ్షిప్ల కంటే ఇది తక్కువ ధరకే లాంచ్ అవ్వచ్చని తెలుస్తోంది.
ఈ ఫోన్ లో కెమెరా మాడ్యూల్ కింద టెక్షర్ లైన్లు ఉండొచ్చు. ఇది గ్లాస్ బాడీ డిజైన్ తో బ్లూ, బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్లను లాంచ్ కానుంది. డిస్ప్లే టాప్ లెఫ్ట్ కార్నర్లో పంచ్ హోల్ లేఅవుట్ కనిపించింది. వన్‌ప్లస్ ఏడాది పొడవునా ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ రిలీజ్ చేసేలా ప్లాన్ చేసింది. ఈ ప్లాన్ లో భాగంగా వన్‌ప్లస్ నార్డ్ ఫోన్‌ను ఏప్రిల్ 28న జరగనున్న లాంచ్ ఈవెంట్లో ఇండియాలో రిలీజ్ చేయనుంది. వన్‌ప్లస్ 10ఆర్, వన్‌ప్లస్ ఏస్, రియల్మీ జీటీ నియో 3 ఫోన్లలో ఇంటర్నల్ పార్ట్స్, హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్లు ఒకేలా ఉన్నాయని కొందరు టెక్ నిపుణులు చెబుతున్నారు. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్, కొత్త ట్రూ వైర్లెస్ ఇయర్‌బడ్స్ నార్డ్ బడ్స్ ఏప్రిల్ 28న ఇండియాలో లాంచ్ కానున్నాయి. వన్‌ప్లస్ ఏస్, వన్‌ప్లస్ 10ఆర్ సేమ్ అంటున్నారు కాబట్టి ఏప్రిల్ 21న వన్‌ప్లస్ 10ఆర్ ఫీచర్ల గురించి పూర్తి స్థాయిలో తెలిసే అవకాశం ఉంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.