వన్‌ప్లస్ 9RT మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ గల బేస్ వేరియంట్ CNY 3,299 (సుమారు రూ. 38,600) వద్ద లభిస్తుంది.
భారత మార్కెట్లోకి వరుసగా ప్రీమియం, మిడ్‌రేంజ్ స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తూ వన్‌ప్లస్ సంస్థ దూసుకుపోతుంది. ఈ కంపెనీ తాజాగా వన్‌ప్లస్ 9 ఆర్టీ 5జీ (OnePlus 9RT 5G) స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన వన్‌ప్లస్ 9 ఆర్కు తర్వాతి వెర్షన్‌గా వచ్చింది. దీని వెనుక వైపు గల మూడు కెమెరాల్లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా హైలెట్‌గా నిలవనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
వన్‌ప్లస్ 9 ఆర్టీ (OnePlus 9RT 5G) ధర, లభ్యత
వన్‌ప్లస్ 9RT (OnePlus 9RT 5G) మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ గల బేస్ వేరియంట్ CNY 3,299 (సుమారు రూ. 38,600) వద్ద లభిస్తుంది. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ మోడల్ CNY 3,499 (సుమారు రూ. 40,900), 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ గల టాప్ మోడల్ CNY 3,799 (సుమారు రూ. 44,400) వద్ద అందుబాటులో ఉంటుంది. చైనాలో వన్‌ప్లస్ 9RT అమ్మకాలు అక్టోబర్ 19 నుండి ప్రారంభమవుతాయి. ప్రారంభపు ఆఫర్ కింద CNY 100 (సుమారు రూ. 1,200) డిస్కౌంట్ లభిస్తుంది.
వన్‌ప్లస్ 9 ఆర్టీ (OnePlus 9RT 5G) ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఒప్పో కలర్ఓఎస్ పై పనిచేస్తుంది. ఇది 6.62 -అంగుళాల ఫుల్-హెచ్డి ప్లస్ శామ్సంగ్ ఈ 4 అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది. ఆక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 888 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌ను అందించింది. ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ సోనీ IMX766 ప్రైమరీ సెన్సార్ కెమెరాను అందించింది. వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9 ప్రో, వన్‌ప్లస్ నార్డ్ 2లలో కూడా ఇదే కెమెరా అందించడం విశేషం. ఇక, దీనితో పాటు 16 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా, 2 మెగా పిక్సెల్ మాక్రో షూటర్ కెమెరాలను చేర్చింది.
సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ సోనీ IMX471 సెల్ఫీ కెమెరాను చేర్చింది. కనెక్టివిటీ ఆప్షన్ల పరంగా చూస్తే.. 5జీ, 4 జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ v5.2, జీపీఎస్/ ఏజీపీఎస్, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్-సి పోర్ట్ వంటివి అందించింది. వీటితో పాటు యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్, సామీప్య సెన్సార్ వంటివి చేర్చింది. వన్‌ప్లస్ 9 ఆర్టీ డాల్బీ అట్మోస్ సపోర్ట్ గల డ్యూయల్ స్టీరియో స్పీకర్లతో వస్తుంది. దీనిలోని 4,500mAh డ్యూయల్ సెల్ బ్యాటరీ 65T ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతిస్తుంది.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.