హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

OnePlus 9RT 5G: త్వరలోనే లాంచ్ కానున్న వన్‌ప్లస్ 9RT 5G స్మార్ట్‌ఫోన్‌.. దీని ప్రత్యేకతలివే!

OnePlus 9RT 5G: త్వరలోనే లాంచ్ కానున్న వన్‌ప్లస్ 9RT 5G స్మార్ట్‌ఫోన్‌.. దీని ప్రత్యేకతలివే!

OnePlus 9RT 5G

OnePlus 9RT 5G

OnePlus 9RT 5G: భారత మార్కెట్లోకి వరుసగా ప్రీమియం, బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేస్తున్న వన్‌ప్లస్ సంస్థ.. మరో కొత్త మోడల్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది.

భారత మార్కెట్లోకి వరుసగా ప్రీమియం, బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేస్తున్న వన్‌ప్లస్ సంస్థ.. మరో కొత్త మోడల్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. వన్‌ప్లస్ 9 ఆర్‌టి 5జీ (OnePlus 9RT 5G) మోడల్‌ను అక్టోబర్ 13న లాంచ్ చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల ద్వారా ఈ వివరాలను ధ్రువీకరించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఉండే 50 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, దీనికి స్పెషల్ హైలైట్‌గా నిలవనుంది. డ్యుయల్ ఎల్ఈడీ ఫ్లాష్, లేజర్ సెన్సార్‌తో పాటు మరో రెండు కెమెరా సెన్సార్‌లతో దీన్ని అభివృద్ధి చేశారు. డైరెక్ట్ సైలెంట్ మోడ్ కోసం ఫోన్ అంచుల్లో స్లైడర్, పవర్ బటన్, వాల్యూమ్ రాకర్లను సరికొత్తగా డిజైన్ చేశారు. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ సెల్ఫీ కెమెరా ప్లేస్‌మెంట్ ఎలా ఉంటుందనేది అస్పష్టంగా ఉంది. ఈ ఫోన్ భారత్‌లో కూడా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. దీనిపై కంపెనీ అధికారికంగా స్పందించాల్సి ఉంది.ఈ డివైజ్ కోసం వన్‌ప్లస్ వినియోగదారులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. దీని కీలక స్పెసిఫికేషన్లను ఇటీవల కొన్ని నివేదికలు వెల్లడించాయి.

స్పెసిఫికేషన్లు :

ఈ ఏడాది ప్రారంభంలో విడుదల చేసిన వన్‌ప్లస్ 9Rలో వినియోగించిన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 870 చిప్‌సెట్‌కు బదులుగా.. వన్‌ప్లస్ 9RT 5Gలో మరింత వేగవంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 చిప్‌సెట్‌ను సంస్థ అందిస్తోంది. దీంట్లో 500mAh సామర్థ్యం ఉండే బ్యాటరీని అందించింది. ఇది 65W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందని గతంలో విడుదలైన లీకుల ద్వారా తెలిసింది. ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌తో పనిచేసే ఈ డివైజ్‌ 12GB RAMతో రానుంది. సంస్థ విడుదల చేసిన ప్రమోషనల్ పోస్టర్‌లో సిల్వర్ వేరియంట్‌ను హైలైట్ చేసింది. అయితే ఫోన్ ఇతర కలర్ ఆప్షన్లలో సైతం విడుదలయ్యే అవకాశం ఉంది.

గతంలో విడుదల చేసిన వన్‌ప్లస్ 9ఆర్‌ అప్‌డేటెడ్ సిరీస్‌లో భాగంగా కొత్త మోడల్ విడుదల కానున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. వన్‌ప్లస్ 9R డివైజ్‌ 6.5 అంగుళాల ఫ్లూయిడ్ AMOLED డిస్‌ప్లేతో విడుదలైంది. 120.5 రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియోతో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 870 SoC చిప్‌సెట్‌, 12GB RAM, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌ వంటి స్పెసిఫికేషన్లు దీని సొంతం.

ఇది కూడా చదవండి : రోహిత్ శర్మకు భారీ షాక్ తప్పదా..? టీమిండియా నెక్ట్స్ కెప్టెన్ అతడేనా..!

ఇందులో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ (48 మెగాపిక్సెల్ సోనీ IMX586 ప్రైమరీ సెన్సార్, 16 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 5 మెగాపిక్సెల్ మాక్రో షూటర్, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్), 16 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఉన్నాయి. కొత్తగా విడుదల కానున్న వన్‌ప్లస్‌ 9RT 5G స్మార్ట్‌ఫోన్‌లో సైతం ఇలాంటి ఫీచర్లను ఆశించవచ్చు. దీని ధరను అక్టోబర్ 13న ఫోన్ లాంచింగ్ సమయంలోనే సంస్థ ప్రకటించనుంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Latest Technology, ONE PLUS, Smart phone, Technology

ఉత్తమ కథలు