OnePlus 9RT: వన్​ప్లస్​ 9ఆర్​టీ 5జీ స్మార్ట్​ఫోన్ లాంఛ్... 50 ఎంపీ కెమెరాతో పాటు కళ్లు చెదిరే ఫీచర్లు

OnePlus 9RT: వన్​ప్లస్​ 9ఆర్​టీ 5జీ స్మార్ట్​ఫోన్ లాంఛ్... 50 ఎంపీ కెమెరాతో పాటు కళ్లు చెదిరే ఫీచర్లు

OnePlus 9RT | వన్‌ప్లస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న వన్​ప్లస్​ 9 ఆర్​టీ (OnePlus 9RT) స్మార్ట్‌ఫోన్ లాంఛ్ అయింది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ లాంటి ప్రత్యేకతలున్నాయి.

  • Share this:
భారత మార్కెట్​లోకి వరుసగా ప్రీమియం, మిడ్​రేంజ్​ స్మార్ట్​ఫోన్లను విడుదల చేస్తూ వన్​ప్లస్​ (OnePlus) సంస్థ దూసుకుపోతుంది. ఈ కంపెనీ తాజాగా వన్​ప్లస్​ 9 ఆర్​టీ 5జీ (OnePlus 9RT 5G) స్మార్ట్​ఫోన్​ను లాంచ్​ చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన వన్​ప్లస్​ 9 ఆర్​కు తర్వాతి వెర్షన్​గా వచ్చింది. దీని వెనుక వైపు గల మూడు కెమెరాల్లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా హైలెట్​గా నిలవనుంది. ఈ స్మార్ట్​ఫోన్​ 120Hz AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 SoC ప్రాసెసర్​తో పనిచేస్తుంది.

వన్​ప్లస్​ 9 ఆర్​టీ ధర, లభ్యత


వన్​ప్లస్​ 9RT మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. 8 జీబీ ర్యామ్​ + 128 జీబీ స్టోరేజ్ గల బేస్​ వేరియంట్ CNY 3,299 (సుమారు రూ. 38,600) వద్ద లభిస్తుంది. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్​ మోడల్ CNY 3,499 (సుమారు రూ. 40,900), 12 జీబీ ర్యామ్​ + 256 జీబీ స్టోరేజ్​ గల టాప్​ మోడల్​ CNY 3,799 (సుమారు రూ. 44,400) వద్ద అందుబాటులో ఉంటుంది. చైనాలో వన్​ప్లస్​ 9RT అమ్మకాలు అక్టోబర్ 19 నుండి ప్రారంభమవుతాయి. ప్రారంభపు ఆఫర్​ కింద CNY 100 (సుమారు రూ. 1,200) డిస్కౌంట్ లభిస్తుంది.

Realme GT Neo 2 vs iQOO 7: ఈ రెండు 5జీ స్మార్ట్‌ఫోన్లలో ఏది బెస్ట్? తెలుసుకోండి

వన్​ప్లస్​ 9 ఆర్​టీ స్పెసిఫికేషన్లు


వన్​ప్లస్​ 9 ఆర్​టీ ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఒప్పో కలర్‌ఓఎస్ పై పనిచేస్తుంది. ఇది 6.62 -అంగుళాల ఫుల్-హెచ్‌డి ప్లస్​ శామ్‌సంగ్ ఈ 4 అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఆక్టా-కోర్ క్వాల్​కామ్ స్నాప్‌డ్రాగన్ 888 SoC ప్రాసెసర్​తో పనిచేస్తుంది. ఇందులో 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్​ను అందించింది. ఇది​ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ సోనీ IMX766 ప్రైమరీ సెన్సార్ కెమెరాను అందించింది. వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9 ప్రో, వన్‌ప్లస్ నార్డ్ 2లలో కూడా ఇదే కెమెరా అందించడం విశేషం. ఇక, దీనితో పాటు 16 మెగాపిక్సెల్​ అల్ట్రా వైడ్​ యాంగిల్​ లెన్స్​ కెమెరా, 2 మెగా పిక్సెల్​ మాక్రో షూటర్​ కెమెరాలను చేర్చింది.

Realme GT Neo 2: రియల్‌మీ జీటీ నియో 2 స్మార్ట్‌ఫోన్ రిలీజ్... తొలి సేల్‌లో రూ.7,000 డిస్కౌంట్

సెల్ఫీలు, వీడియో కాలింగ్​ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్​ సోనీ IMX471 సెల్ఫీ కెమెరాను చేర్చింది. కనెక్టివిటీ ఆప్షన్ల పరంగా చూస్తే.. 5జీ, 4 జీ ఎల్​టీఈ, వైఫై 6, బ్లూటూత్ v5.2, జీపీఎస్​/ ఏజీపీఎస్​, ఎన్​ఎఫ్​సీ, యూఎస్​బీ టైప్-సి పోర్ట్ వంటివి అందించింది. వీటితో పాటు యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్ వంటివి చేర్చింది. వన్‌ప్లస్ 9 ఆర్​టీ డాల్బీ అట్మోస్ సపోర్ట్‌ గల డ్యూయల్​ స్టీరియో స్పీకర్లతో వస్తుంది. దీనిలోని 4,500mAh డ్యూయల్ సెల్ బ్యాటరీ 65T ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతిస్తుంది.
Published by:Santhosh Kumar S
First published: