వన్‌ప్లస్ ఫ్యాన్స్‌కో గుడ్ న్యూస్. వన్‌ప్లస్ 8టీ స్మార్ట్‌ఫోన్ ఇండియాకు వచ్చేస్తోంది. ఓవైపు వన్‌ప్లస్ నార్డ్ మరిన్ని మోడల్స్ వస్తాయన్న ప్రచారం జరుగుతుండగానే ఇండియాలో వన్‌ప్లస్ 8టీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అక్టోబర్ 14న ఈ స్మార్ట్‌ఫోన్ లాంఛ్ కానుందన్న వార్తలొస్తున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇండియాలో వన్‌ప్లస్ 8, వన్‌ప్లస్ 8 ప్రో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో మూడో ఫోన్ వన్‌ప్లస్ 8టీ రిలీజ్ కానుంది. వాస్తవానికి సెప్టెంబర్‌లోనే వన్‌ప్లస్ 8టీ లాంఛ్ కావాల్సి ఉండగా కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం కారణంగా రిలీజ్ వాయిదా పడింది. అక్టోబర్ రెండో వారంలో ఈ ఫోన్ ఇండియన్ మార్కెట్లోకి రానుంది. అయితే లాంఛింగ్‌పై కంపెనీ నుంచి అధికారికంగా ఎలాంటి వార్తలు లేవు. అయితే వన్‌ప్లస్ అధికారిక ట్విట్టర్లో It's tea time అనే ట్వీట్ లేటెస్ట్గా కనిపించింది. దీంతో ఇండియాలో వన్‌ప్లస్ 8టీ లాంఛింగ్ గురించి కంపెనీ హింట్ ఇస్తోందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఇక వన్‌ప్లస్ 8టీ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్స్ కొన్ని ఆన్లైన్లో ప్రచరంలో ఉన్నాయి. 6.55 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, స్నాప్‌డ్రాగన్ 865+ ప్రాసెసర్ లాంటి ఫీచర్స్ ఉంటాయని అంచనా. 8జీబీ+128జీబీ, 12జీబీ+256జీబీ వేరియంట్లలో వన్‌ప్లస్ 8టీ లాంఛ్ అయ్యే అవకాశముంది. ఇక కెమెరా విషయానికి వస్తే 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 16 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్, 5మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ 2 మెగాపిక్సెల్ పోర్ట్రైట్ సెన్సార్ వెనుకవైపు ఉంటాయి. ఇక ఫ్రంట్‌లో సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 4500ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 65వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇవన్నీ ఆన్లైన్లో ప్రచారంలో ఉన్న స్పెసిఫికేషన్స్ మాత్రమే. ఎలాంటి ఫీచర్స్‌తో ఫోన్ వస్తుందో తెలుసుకోవాలంటే రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.
ఇక ఇటీవల ఇండియాలో తక్కువ బడ్జెట్లో వన్‌ప్లస్ నార్డ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మిడ్ రేంజ్ సెగ్మెంట్లో వచ్చిన ఈ ఫోన్ ధర ఎక్కువ ఉందన్న అసంతృప్తి ఫ్యాన్స్‌లో ఉంది. అయితే రూ.20,000 లోపు, రూ.10,000 లోపు మరో రెండు స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేసేందుకు వన్‌ప్లస్ సన్నాహాలు చేస్తుందన్న వార్తలొస్తున్నాయి. అందులో ఒకటి వన్‌ప్లస్ నార్డ్ లైట్ కావచ్చని అంచనా. స్నాప్‌డ్రాగన్ 665 లేదా స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్‌తో రూ.20,000 లోపు, స్నాప్‌డ్రాగన్ 460 ప్రాసెసర్‌తో రూ.10,000 లోపు స్మార్ట్ఫోన్లు వచ్చే అవకాశముంది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.