ONEPLUS 8T CYBERPUNK 2077 LIMITED EDITION LAUNCHED IN CHINA KNOW SPECS AND PRICE SS
వీడియో గేమ్ ఫ్యాన్స్ కోసం OnePlus 8T Cyberpunk 2077 రిలీజ్
వీడియో గేమ్ ఫ్యాన్స్ కోసం OnePlus 8T Cyberpunk 2077 రిలీజ్
OnePlus 8T Cyberpunk 2077 | వన్‌ప్లస్ నుంచి లిమిటెడ్ ఎడిషన్‌లో మరో స్మార్ట్‌ఫోన్ రిలీజైంది. వన్‌ప్లస్ 8టీ సైబర్‌పంక్ 2077 మోడల్‌ను పరిచయం చేసింది కంపెనీ.
వీడియో గేమ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. వన్‌ప్లస్ 8టీ సైబర్‌పంక్ 2077 లిమిటెడ్ ఎడిషన్ రిలీజైంది. సీడీ ప్రాజెక్ట్ రెడ్‌తో కలిసి ఈ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది వన్‌ప్లస్. ఇప్పటికే రిలీజైన వన్‌ప్లస్ 8టీ స్మార్ట్‌ఫోన్‌కు వినూత్నమైన డిజైన్ తీసుకొచ్చింది వన్‌ప్లస్. ఈ ఫోన్‌పై Cyberpunk 2077 బ్రాండింగ్ ఉంటుంది. సీడీ ప్రాడెక్ట్ రెడ్‌కు చెందిన ఈ గేమ్ బాగా హైప్లో ఉన్న సంగతి తెలిసిందే. అందుకే OnePlus 8T Cyberpunk 2077 లిమిటెడ్ ఎడిషన్ తీసుకొచ్చారు. యెల్లో, బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఈ ఫోన్ ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.55 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఫ్లూయిడ్ అమొలెడ్ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్, 48మెగాపిక్సెల్ IMX586 సెన్సార్‌తో క్వాడ్ కెమెరా సెటప్, 5జీ కనెక్టివిటీ లాంటి ప్రత్యేకతలున్నాయి. కేవలం 12జీబీ+256జీబీ వేరియంట్లో మాత్రమే ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజైంది. ధర సుమారు రూ.44,500. ప్రస్తుతం వన్‌ప్లస్ 8టీ సైబర్‌పంక్ 2077 లిమిటెడ్ ఎడిషన్ ప్రీ-ఆర్డర్స్ చైనాలో మొదలయ్యాయి. నవంబర్ 11న సేల్ మొదలవుతుంది. ఈ ఫోన్ ఇండియాలో ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న స్పష్టత లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.