స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి మరో రెండు కొత్త ఫోన్లు వచ్చేశాయి. వన్‌ప్లస్ 8 సిరీస్‌లో రెండు ఫోన్లు పరిచయమయ్యాయి. వన్‌ప్లస్ 8, వన్‌ప్లస్ 8 ప్రో మోడల్స్‌ని ఆవిష్కరించింది కంపెనీ. ఈ రెండు ఫోన్లు 5జీ సపోర్ట్ చేయడం విశేషం. స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్, 12జీబీ ర్యామ్ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఈ రెండు ఫోన్లు వార్డ్ ఛార్జ్ 30టీ సపోర్ట్ చేస్తాయి. 22 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్ అవుతుందని కంపెనీ చెబుతోంది. అమెరికాలో ఏప్రిల్ 21 నుంచి, యూరప్ దేశాల్లో ఏప్రిల్ 29 నుంచి వన్‌ప్లస్ 8, వన్‌ప్లస్ 8 ప్రో సేల్ మొదలవుతుంది. ఈ ఫోన్లు ఇండియాకు ఎప్పుడు వస్తాయన్న స్పష్టత లేదు. ఈ రెండు ఫోన్లతో పాటు వన్‌ప్లస్ బుల్లెట్స్ వైర్లెస్ జెడ్ కూడా లాంఛ్ చేసింది కంపెనీ. 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే 10 గంటల పాటు పాటలు వినొచ్చు. వన్‌ప్లస్ బుల్లెట్స్ వైర్లెస్ జెడ్ ధర సుమారు రూ.3,700.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.