వన్‌ప్లస్ ఫ్యాన్స్‌కు శుభవార్త. వన్‌ప్లస్ 7 ప్రో ఇండియాకు వచ్చేస్తోంది. ఇప్పటికే ఆన్లైన్లో ఇమేజెస్ లీక్ అయ్యాయి. పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మే 14న అధికారికంగా వన్‌ప్లస్ 7 ప్రో ఇండియాలో రిలీజ్ కాబోతోంది. మొత్తం మూడు వేరియంట్లను కంపెనీ రిలీజ్ చేయబోతోందని అంచనా. 6జీబీ+128జీబీ మోడల్ ధర రూ.49,999 ఉండొచ్చు. అయితే వన్‌ప్లస్ కంపెనీ నుంచి స్పెసిఫికేషన్స్ గురించి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. అయితే వన్‌ప్లస్ 7 ప్రో 5జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తుందని మాత్రం తెలిపింది. ఆన్లైన్లో లీకైన వివరాల ప్రకారం 6జీబీ+128జీబీ ధర రూ.49,999, 8జీబీ+256జీబీ ధర రూ.52,999, 12జీబీ+256జీబీ ధర రూ.57,999 కావచ్చన్న ప్రచారం జరుగుతోంది.
Read this:
Akshaya Tritiya: బంగారం కొనేముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి
వన్‌ప్లస్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్ ఉంటుందని, 4000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుందని, 30 వాట్ ఛార్జర్‌తో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందని సమాచారం. అంతేకాదు... నెబ్యులా బ్లూ, మిర్రర్ గ్రే కలర్స్‌లో వన్‌ప్లస్ 7 ప్రో వస్తోందని సమాచారం లీక్ అయింది. మరి ఇందులో నిజమెంతో తెలియాలి. ఇప్పటికే వన్‌ప్లస్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్ గురించి రకరకాల ప్రచారాలను ఆసక్తిగా గమనిస్తున్న వన్‌ప్లస్ ఫ్యాన్స్... మే 14న బెంగళూరులో జరగబోయే ఈవెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అమెజాన్‌లో వన్‌ప్లస్ 7 ప్రో ప్రీ బుకింగ్ ప్రారంభమైంది.
వన్‌ప్లస్ 7 ప్రో స్పెసిఫికేషన్స్ (అంచనా)
డిస్ప్లే: 6.67 అంగుళాల ఫ్లూయిడ్ అమొలెడ్
ర్యామ్: 6జీబీ, 8జీబీ, 12జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ+256జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 855
రియర్ కెమెరా: 48+8+16 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4000 ఎంఏహెచ్
కలర్స్: నెబ్యులా బ్లూ, మిర్రర్ గ్రే
ధర:
6జీబీ+128జీబీ- రూ.49,999
8జీబీ+256జీబీ- రూ.52,999
12జీబీ+256జీబీ- రూ.57,999
Photos: హీరో నుంచి 3 కొత్త ప్రీమియం బైక్స్... అదిరిపోయే ఫీచర్స్
ఇవి కూడా చదవండి:
Career Guidance: టెన్త్ తర్వాత చదవాల్సిన కోర్సులు ఇవే...
Aadhaar Card: ఆధార్ కార్డును ఎక్కడంటే అక్కడ డౌన్లోడ్ చేస్తున్నారా? జాగ్రత్త...
SBI: మీ ఎస్బీఐ అకౌంట్‌ను ఆన్లైన్లోనే మరో బ్రాంచ్‌కు ట్రాన్స్ఫర్ చేయండి ఇలా...