OnePlus 7 Series: ఇండియాలో రిలీజైన వన్‌ప్లస్ 7 సిరీస్... ఫీచర్స్ ఇవే

OnePlus 7 Series | అమెజాన్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డులపై కొన్నవారికి రూ.2000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దాంతో పాటు జియో నుంచి రూ.9,300 విలువైన బెనిఫిట్స్ ఉన్నాయి.

news18-telugu
Updated: May 15, 2019, 12:24 PM IST
OnePlus 7 Series: ఇండియాలో రిలీజైన వన్‌ప్లస్ 7 సిరీస్... ఫీచర్స్ ఇవే
OnePlus 7 Series: ఇండియాలో రిలీజైన వన్‌ప్లస్ 7 సిరీస్... ఫీచర్స్ ఇవే (image: Oneplus)
news18-telugu
Updated: May 15, 2019, 12:24 PM IST
వన్‌ప్లస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న వన్‌ప్లస్ 7 సిరీస్ ఇండియాలో రిలీజైంది. బెంగళూరులో జరిగిన ఈవెంట్‌లో వన్‌ప్లస్ 7, వన్‌ప్లస్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్లను అధికారికంగా రిలీజ్ చేసింది కంపెనీ. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో యాపిల్, సాంసంగ్, హువావే లాంటి కంపెనీలను టార్గెట్ చేస్తూ రెండు కొత్త ఫోన్లను రిలీజ్ చేసింది వన్‌ప్లస్. ఈ కొత్త ఫోన్లను వన్‌ప్లస్ ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటున్నాయి. వన్‌ప్లస్ 7 ప్రోలో మూడు వేరియంట్లు ఉన్నాయి. ఈ రెండు ఫోన్లకు ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, వాటర్ రెసిస్టెంట్, 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి. వన్‌ప్లస్ 7, వన్‌ప్లస్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్లతో పాటు వన్‌ప్లస్ బుల్లెట్స్ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్‌ను కూడా రిలీజ్ చేసింది కంపెనీ. వీటి ధర రూ.5,990.

Read this: Jio-OnePlus 7: వన్‌ప్లస్ 7 ఫోన్ కొంటే జియో నుంచి రూ.9,300 బెనిఫిట్స్... వివరాలివే

భారతదేశంలో అమెజాన్‌ ఎక్స్‌క్లూజీవ్ పార్ట్‌నర్. వన్‌ప్లస్ 7 ప్రో నెబ్యులా మిర్రర్ గ్రే కలర్ స్మార్ట్‌ఫోన్ సేల్ అమెజాన్‌లో మే 17న ప్రారంభమవుతుంది. నెబ్యులా బ్లూ కలర్ మే 25 నుంచి అందుబాటులో ఉంటుంది. అమెజాన్ ఇండియాతో పాటు వన్‌ప్లస్ వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో కూడా ఈ ఫోన్లు కొనొచ్చు. అమెజాన్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డులపై కొన్నవారికి రూ.2000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దాంతో పాటు జియో నుంచి రూ.9,300 విలువైన బెనిఫిట్స్ ఉన్నాయి. జియో బెనిఫిట్స్ తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.




వన్‌ప్లస్ 7 ప్రో స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.67 అంగుళాల క్యూహెచ్‌డీ+, 3120x1440 పిక్సెల్స్
ర్యామ్: 6 జీబీ, 8జీబీ, 12జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ, 256జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 855
రియర్ కెమెరా: 48+16+8 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 పై+ఆక్సిజన్ ఓఎస్
కలర్స్: నెబ్యులా బ్లూ, ఆల్మండ్, మిర్రర్ గ్రే
ధర:
6 జీబీ+128జీబీ- రూ.48,999
8జీబీ+256జీబీ- రూ.52,999
12జీబీ+256జీబీ- రూ.57,999

వన్‌ప్లస్ 7 స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+, 1080x2340 పిక్సెల్స్
ర్యామ్: 6 జీబీ, 8జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ, 256జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 855
రియర్ కెమెరా: 48+5 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,150 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 పై+ఆక్సిజన్ ఓఎస్
కలర్స్: మిర్రర్ గ్రే, రెడ్
ధర:
6 జీబీ+128జీబీ- రూ.32,999
8జీబీ+256జీబీ- రూ.37,999

Technology: మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

OnePlus 7 Series: అదిరిపోయిన వన్‌ప్లస్ 7, వన్‌ప్లస్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్స్

ఇవి కూడా చదవండి:

LIC Policy: ఎల్ఐసీ పాలసీ నచ్చలేదా? వెనక్కి ఇచ్చేయండి ఇలా

SSY Scheme: రోజుకు రూ.100 పొదుపుతో రూ.16 లక్షల రిటర్న్స్...

WhatsApp Alert: వాట్సప్‌పై సైబర్ ఎటాక్... వెంటనే యాప్ అప్‌‌డేట్ చేయండి
First published: May 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...