One Plus 7 Pro: ఆ కొత్త ఫీచర్‌తో త్వరలో మార్కెట్‌లోకి..

వన్ ప్లస్ 7 ప్రో మోడల్ ఫోన్లలో పాప్ అప్ సెల్ఫీ కెమెరా, ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీ, కర్వ్‌డ్ డిస్‌ప్లే తదితర ఫీచర్లు ఉండనున్నాయి.

news18-telugu
Updated: April 23, 2019, 1:53 PM IST
One Plus 7 Pro: ఆ కొత్త ఫీచర్‌తో త్వరలో మార్కెట్‌లోకి..
one plus 7, one plus 7pro
news18-telugu
Updated: April 23, 2019, 1:53 PM IST
స్మార్ట్‌ఫోన్ రంగంలో సంచలనాలు సృష్టిస్తూ దూసుకుపోతున్న చైనా మొబైల్ సంస్థ వన్ ప్లస్.. మరో కొత్త రకం మోడల్ ఫోన్లను త్వరలోనే మార్కెట్లో ప్రవేశపెట్టబోతోంది. ఎప్పటికప్పుడు కొత్త రకం ఫీచర్లున్న ఫోన్లను విడుదల చేస్తూ వినియోగదారులను ఆకర్షిస్తున్న ఆ సంస్థ.. అదిరిపోయే హంగులు జోడించి 7, 7 ప్రో వేరియంట్‌ ఫోన్లను అందుబాటులోకి తేనుంది. ఈ మధ్యే ఈ ఫోన్ల టీజర్‌ను విడుదల చేసిన వన్‌ప్లస్ సంస్థ సీఈవో పీట్ లౌ.. 7 ప్రో మోడల్ ఫోన్ 5జీ టెక్నాలజీతో విపణిలో అడుగుపెట్టనుందని తాజాగా ప్రకటించారు.

ఈ మోడల్ ఫోన్లు 5.0 వెర్షన్ బ్లూ టూత్‌ను కలిగి ఉండనున్నాయి. 4,000 mAh బ్యాటరీని కలిగి ఉండే ఈ ఫోన్‌లో ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఉంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 855 ఎస్ఓసీ ప్రాసెసర్, 6.64 అంగుళాల సూపర్ ఆప్టిక్ అమోఎల్ఈడీ తెర, 8 జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజీ, ఆండ్రాయిడ్ 9.0పై వెర్షన్, పాప్ అప్ సెల్ఫీ కెమెరా, ట్రిపుల్ రేర్ కెమెరా, 48-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉండనున్నాయి. ప్రో వేరియంట్‌ కర్వ్‌డ్ డిస్‌ప్లేతో రానున్నట్లు సమాచారం. ఈ మోడల్ ఫోన్లను వచ్చే నెల 14న మార్కెట్‌లో విడుదల చేసే అవకాశం ఉంది.

ఇక, 6.4 అంగుళాల తెర, స్నాప్‌డ్రాగన్ 855 చిప్ సెట్, 4000 mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 9.0పై వెర్షన్‌తో వన్ ప్లస్ 7 అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ మోడల్‌లో 6జీబీ ర్యామ్-128 బీజీ స్టోరేజీ, 10జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజీ కలిగి ఉండనున్నట్లు సమాచారం.

First published: April 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...