ONEPLUS 43Y1 TO XIAOMI MI TV 4X KNOW ABOUT BEST SMART TVS UNDER RS 30000 SS
Best Smart TVs: రూ.30,000 లోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు ఇవే
Best Smart TVs: రూ.30,000 లోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)
Best Smart TVs Under Rs 30000 | స్మార్ట్ టీవీ కొనాలనుకునేవారికి మార్కెట్లో అనేక బ్రాండ్స్ నుంచి బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. రూ.30,000 లోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు ఏవో తెలుసుకోండి.
మీరు కొత్త స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా? మీ బడ్జెట్ రూ.30,000 లోపా? ఈ బడ్జెట్లో చాలా బ్రాండ్స్ అద్భుతమైన ఫీచర్స్‌తో టీవీలను అమ్ముతున్నాయి. షావోమీ, వన్‌ప్లస్, మోటోరోలా లాంటి కంపెనీలకు చెందిన స్మార్ట్ టీవీలను రూ.30,000 లోపు కొనొచ్చు. ఇవన్నీ ప్రస్తుత ధరలే. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లేదా ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఈ టీవీలపై డిస్కౌంట్ లభించే అవకాశముంది. ఈ డిస్కౌంట్‌తో పాటు కార్డు డిస్కౌంట్ కూడా ఉంటుంది కాబట్టి తక్కువ ధరకే టీవీ కొనొచ్చు. మరి ఏ టీవీలో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి? వాటి ప్రత్యేకతలేంటీ? ఫీచర్స్ ఏంటీ? తెలుసుకోండి.
XIAOMI MI TV 4X: షావోమీ నుంచి ఇటీవల ఎంఐ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ 4ఎక్స్ రిలీజైంది. షావోమీ నుంచి రిలీజైన బెజెల్ లెస్ టీవీ ఇది. 3840 x 2160 పికెల్స్తో 50 అంగుళాల అల్ట్రా హెచ్డీ 4కే ప్యానెల్ ఉంటుంది. స్క్రీన్ టు బాడీ రేషియో 91.43 శాతం. స్టాక్ ఆండ్రాయిడ్ బేస్డ్ టీవీ ఇది. ఆండ్రాయిడ్ 9.0 పై ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తోంది. 50 అంగుళాల ఎంఐ టీవీ 4ఎక్స్ ధర రూ.29,999.
IFFALCON BY TCL 43K71: ఇఫాల్కాన్ 43K71 కూడా ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీనే. నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ లాంటి యాప్స్ వస్తాయి. గూగుల్ ప్లేస్టోర్ నుంచి మరిన్ని యాప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. 43 అంగుళాల టీవీ ధర రూ.23,999 కాగా 50 అంగుళాల టీవీ ధర 28,499.
MOTOROLA 43SAUHDM: మోటోరోలా 4కే డిస్ప్లే, 3840 x 2160 పిక్సెల్స్‌తో 43SAUHDM మోడల్‌ను పరిచయం చేసింది. 1జీబీ ర్యామ్, 8జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ లాంటి ప్రత్యేకతలున్నాయి. 43 అంగుళాల టీవీ ధర రూ.29,999.
KODAK 43CA2022: సన్నటి బెజెల్స్‌తో కొడాక్ 43CA2022 మోడల్ టీవీని రిలీజ్ చేసింది. 178 డిగ్రీ వ్యూయింగ్ యాంగిల్ మరో ప్రత్యేకత. రెండు స్పీకర్లు 30వాట్ సౌండ్ ఔట్పుట్ ఉంటుంది. 43 అంగుళాల కొడాక్ టీవీ ధర రూ.23,999.
ONEPLUS 43Y1: వన్‌ప్లస్ ప్రీమియం పియానో ఫినిషన్, మినిమల్ బెజెల్స్‌తో 43 అంగుళాల టీవీని రిలీజ్ చేసింది. కాంపాక్ట్ రిమోట్లో నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ బటన్స్ ఉంటాయి. రిమోట్లో ఇంటిగ్రేటెడ్ మైక్రోఫోన్ ఉంటుంది. గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ చేస్తుంది. ధర రూ.Rs 24,999.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.