హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

OnePlus 11: పవర్‌ఫుల్ ప్రాసెసర్, సోనీ కెమెరాతో వన్‌ప్లస్ 11 రిలీజ్... ఫీచర్స్ ఇవే

OnePlus 11: పవర్‌ఫుల్ ప్రాసెసర్, సోనీ కెమెరాతో వన్‌ప్లస్ 11 రిలీజ్... ఫీచర్స్ ఇవే

OnePlus 11: పవర్‌ఫుల్ ప్రాసెసర్, సోనీ కెమెరాతో వన్‌ప్లస్ 11 రిలీజ్... ఫీచర్స్ ఇవే
(image: OnePlus India)

OnePlus 11: పవర్‌ఫుల్ ప్రాసెసర్, సోనీ కెమెరాతో వన్‌ప్లస్ 11 రిలీజ్... ఫీచర్స్ ఇవే (image: OnePlus India)

OnePlus 11 | వన్‌ప్లస్ 11 సిరీస్ (OnePlus 11 Series) స్మార్ట్‌ఫోన్లు వచ్చేశాయి. పవర్‌ఫుల్ ప్రాసెసర్, సోనీ కెమెరాతో వన్‌ప్లస్ 11 రిలీజైంది. ప్రీ-ఆర్డర్ కూడా ప్రారంభమైంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

వన్‌ప్లస్ (OnePlus) నుంచి మరో రెండు స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ అయ్యాయి. వన్‌ప్లస్ 11 5జీ, వన్‌ప్లస్ 11ఆర్ 5జీ (OnePlus 11R 5G) మోడల్స్‌ని రిలీజ్ చేసింది కంపెనీ. వన్‌ప్లస్ ప్యాడ్, వన్‌ప్లస్ బడ్స్ ప్రో 2 కూడా ఇండియాలో లాంఛ్ అయ్యాయి. వన్‌ప్లస్ 11ఆర్ 5జీ విశేషాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఇక వన్‌ప్లస్ 11 5జీ ప్రత్యేకతలు చూస్తే ఈ మొబైల్‌లో ప్రీమియం ఫీచర్స్ ఉన్నాయి. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, QHD+ అమొలెడ్ డిస్‌ప్లే, థర్డ్ జెన్ హ్యాసిల్‌బ్లాడ్ కెమెరా, సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ప్రారంభ ధర రూ.56,999. వన్‌ప్లస్ 11 5జీ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలేంటో తెలుసుకోండి.

వన్‌ప్లస్ 11 5జీ ధర

వన్‌ప్లస్ 11 5జీ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తోంది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.56,999 కాగా, 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.61,999. ఎటర్నల్ గ్రీన్, టైటాన్ బ్లాక్ కలర్స్‌లో కొనొచ్చు. ప్రీ ఆర్డర్ ప్రారంభమైంది. ఫిబ్రవరి 13 వరకు ప్రీ ఆర్డర్ కొనసాగుతుంది. ఫిబ్రవరి 14న సేల్ ప్రారంభం అవుతుంది. అమెజాన్‌తో పాటు వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్‌లో కొనొచ్చు.

Electric Bike: రూ.25 ఖర్చుతో 100 కిలోమీటర్ల ప్రయాణం... కొత్త ఎలక్ట్రిక్ బైక్ విశేషాలివే

వన్‌ప్లస్ 11 5జీ స్పెసిఫికేషన్స్

వన్‌ప్లస్ 11 5జీ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల QHD+ ఫ్లెక్సిబుల్ అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. గొరిల్లా గ్లాస్ విక్టర్ ప్రొటెక్షన్ లభిస్తుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. గేమ్స్ ఆడేవారి కోసం హైపర్‌బూస్ట్ గేమింగ్ ఇంజిన్, అడాప్టర్ ఫ్రేమ్ స్టెబిలైజర్ 4.0 ఫీచర్స్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 13 + ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

వన్‌ప్లస్ 11 5జీ స్మార్ట్‌ఫోన్ కెమెరా ఫీచర్స్ చూస్తే ఇందులో 50మెగాపిక్సెల్ Sony IMX890 ప్రైమరీ కెమెరా + 48మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా + 32మెగాపిక్సెల్ టెలీఫోటో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. హాసిల్‌బ్లాడ్‌తో కలిసి రియర్ కెమెరాను రూపొందించింది వన్‌ప్లస్. వన్‌ప్లస్ 11 5జీ స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.

5G Smartphone: రూ.1,000 ఈఎంఐతో ఈ 5G మొబైల్ మీ సొంతం... 16GB వరకు ర్యామ్, 128GB స్టోరేజ్, మరెన్నో ఫీచర్స్

వన్‌ప్లస్ 11 5జీ కెమెరాలో ఫోటో మోడ్, వీడియో మోడ్, పోర్టైట్ మోడ్, నైట్ మోడ్, ప్రో మోడ్, పనోరమా, మూవీ మోడ్, స్లో-మోషన్, టైమ్-లాప్స్, లాంగ్ ఎక్స్‌పోజర్, డ్యూయల్-వ్యూ వీడియో, టిల్ట్-షిఫ్ట్ మోడ్, ఎక్స్‌పాన్ మోడ్, ఆటో మాక్రో, మాస్టర్ స్టైల్ ఫ్లైటర్స్, రీటచ్, AI హైలైట్ వీడియో, అల్ట్రా స్టెడీ ప్రో, రా ప్లస్ ఫైల్, గూగుల్ లెన్స్, 10బిట్ కలర్, హై ఎఫిషియెన్సీ ఇమేజ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా, 100వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో స్టీరియో స్పీకర్ ఉండటం విశేషం.

First published:

Tags: 5G Smartphone, Oneplus, Smartphone

ఉత్తమ కథలు