కొత్త ఫోన్ కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే ఫిబ్రవరి నెలలో మీకు చాలా ఆప్షన్లు లభించనున్నాయి. ఈ నెలలో మేజర్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు తమ లేటెస్ట్ డివైజ్‌లను లాంచ్ చేసేందుకు సిద్ధం అవుతున్నాయి. ఈ లిస్ట్‌లో శామ్‌సంగ్ గెలాక్సీ S23 సిరీస్, Vivo X90 సిరీస్, వన్‌ప్లస్ 11 సిరీస్, ఐక్యూ నియో 7 5G, షావోమి 13 సిరీస్, రియల్‌మీ 10 5G ఉన్నాయి. ఈ నెలలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2023 (MWC 2023) కూడా జరగనున్న సంగతి తెలిసిందే. కొత్త మోడల్స్ ప్రత్యేకతలు, ధరల వివరాలు ఇప్పుడు చూద్దాం.
రియల్‌మీ 10 5G అనేది 10 సిరీస్‌లో లేటెస్ట్ ఎడిషన్. దీనికి ముందు ఇందులో 10 ప్రో సిరీస్, 10 4G వేరియంట్ ఉన్నాయి. ఈ డివైజ్‌ను ఇండియన్ మార్కెట్‌లో లాంచ్ చేసేందుకు కంపెనీ సిద్ధంగా ఉంది. 10 సిరీస్ లైనప్‌కు 5G కనెక్టివిటీని తీసుకువస్తోంది.
Oppo Reno 8T 5G: కర్వ్‌డ్ డిస్‌ప్లే, పాపులర్ ప్రాసెసర్, 108MP కెమెరాతో ఒప్పో రెనో 8టీ రిలీజ్
గ్లోబల్ మార్కెట్ల కోసం MWC 2023లో షావోమి 13 సిరీస్‌ను ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. భారతదేశంలో Leica-బేస్డ్ కెమెరాలతో వస్తున్న మొదటి షావోమి ఫోన్‌లు ఇవే కావచ్చు. సిరీస్‌లోని ఫోన్‌లు స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌సెట్ ద్వారా రన్ అవుతాయని భావిస్తున్నారు.
ఐక్యూ Neo 7 5G ఫిబ్రవరి 17న లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది MediaTek డైమెన్సిటీ 8200 చిప్‌సెట్‌తో వస్తుంది. ఈ డివైజ్‌లో ప్రధానంగా దాని 120W ఫాస్ట్ ఛార్జింగ్ వేగం ఆకర్షిస్తోంది.
వన్‌ప్లస్ 11 సిరీస్ ఫిబ్రవరి 7న లాంచ్ అవుతోంది. OnePlus 11R మోడల్‌ను భారతీయ మార్కెట్‌కు తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ ఫోన్‌ను గత నెలలో చైనాలో అందుబాటులోకి తీసుకొచ్చారు. వన్‌ప్లస్ 11 స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 SoC ద్వారా రన్ అవుతుంది. స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు థర్డ్ జనరేషన్ హాసెల్‌బ్లాడ్ కెమెరా ఉంటుంది. వన్‌ప్లస్ 11R స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది.
Honda Activa: రూ.2,500 లోపు ఈఎంఐతో హోండా యాక్టీవా కొత్త మోడల్ కొనేయండి
వివో X90 సిరీస్ ఫిబ్రవరి 3న లాంచ్ అయింది. ఇది చైనాలో Origin OS, ఇతర మార్కెట్‌లలో Funtouch OSతో అందుబాటులోకి వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో కెమెరాలో Zeiss ఆప్టిక్స్ లెన్స్‌లు, టాప్-ఎండ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్‌సెట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
శామ్‌సంగ్ తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ల లైనప్ తాజా వెర్షన్ గెలాక్సీ S23 సిరీస్‌ను ఫిబ్రవరి 1న అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో లాంచ్ చేసింది. S23 ధర రూ.74,999, S23+ ధర రూ.94,999, S23 అల్ట్రా రూ.1,24,999గా ఉన్నాయి. ఈ సిరీస్ మోడల్స్ ఫాంటమ్ బ్లాక్, క్రీమ్, గ్రీన్, లావెండర్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తాయి. గెలాక్సీ S23 అల్ట్రా నాలుగు-కెమెరా సెటప్‌తో కొత్త 200MP సెన్సార్‌తో వస్తుంది. S23 సిరీస్ క్వాల్కమ్ ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 SoC ద్వారా రన్ అవుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, Mobile News, Samsung, Smartphone