OnePlus 11 : వన్‌ప్లస్ అభిమానులకు ఓ గుడ్‌న్యూస్. చైనాకు చెందిన ఈ ప్రముఖ దిగ్గజ ఎలక్ట్రానిక్ కంపెనీ మరో ప్రీమియం ఫోన్ లాంచింగ్‌కు సిద్ధమైంది. బెస్ట్ ఫీచర్స్‌తో అదిరిపోయే ప్రీమియం ఫోన్‌లు రిలీజ్ చేసే వన్‌ప్లస్ నుంచి మరో ప్రొడక్ట్ అందుబాటులోకి రానుంది. ఈ లేటెస్ట్ డివైజ్ వన్‌ప్లస్ 11(Oneplus 11) వివరాలను ఇటీవల చైనాలో నిర్వహించిన ఈవెంట్‌లో కంపెనీ రిలీజ్ చేసింది. హ్యాండ్‌సెట్ అధికారిక ట్రైలర్ వినియోగదారులను అమితంగా ఆకర్షిస్తోంది.
టాప్-ఎండ్ ఫీచర్స్
OnePlus 11లో ప్రో(pro) మోడల్‌ను తీసుకురావడం లేదని కంపెనీ స్పష్టం చేసింది. దీంతో టాప్-ఎండ్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్‌తో సింగిల్ మోడల్‌లో OnePlus 11ను తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇటీవలే 3C సర్టిఫికేషన్‌ను పొందింది. లిస్టింగ్ ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఆఫర్ చేయవచ్చు. ఇది 5V/2A, 5-11V/9.1A పవర్ అవుట్‌పుట్‌కు సపోర్ట్ చేసే డిజైన్‌తో రావచ్చు. ఈ ఫోన్ పవర్ అవుట్‌పుట్ అనేది OnePlus 10 Pro కంటే ఎక్కువగా, OnePlus 10T కంటే తక్కువగా ఉంది.
5,000mAh బ్యాటరీ
OnePlus 11 టాప్‌లో పంచ్-హోల్ కెమెరా కట్ ఉండ నుంది. స్మార్ట్‌ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 48MP అల్ట్రా-వైడ్ సెన్సార్, 2x 32MP టెలిఫోటో లెన్స్ ఉండవచ్చు. రియర్ కెమెరా సెటప్ సర్కిల్ షేప్‌లో ఉన్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ కావచ్చు. ఇందులో 5,000mAh బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. ఫారెస్ట్ ఎమరాల్డ్, వోల్కానిక్ బ్లాక్ వంటి రెండు కలర్ వేరియంట్స్‌లో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వన్‌ప్లస్ 11 క్లాసిక్ బ్లాక్ కలర్ ఫినిషింగ్‌లో రానుంది. ఈ హ్యాండ్‌సెట్ గ్లోసీ ఫినిష్(Glossy Finish)తో గ్లాస్ బ్యాక్ ఫీచర్‌తో రావచ్చు.
Expensive Pineapple : ఆ పైనాపిల్ రూ.లక్ష.. ఏంటి దాని ప్రత్యేకత?
స్నాప్‌డ్రాగన్ ఎలైట్ గేమింగ్ టెక్నాలజీ
వన్‌ప్లస్ 11లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల QHD+ AMOLED స్క్రీన్‌తో రానుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో లెటెస్ట్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 2 ప్రాసెసర్‌ను వినియోగించనున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో వినియోగించనున్న న్యూ క్వాల్కామ్ చిప్‌సెట్ గత నెలలో లాంచ్ అయింది. ప్రస్తుతం ఉన్న చిప్‌సెట్ కంటే ఇది 40 శాతం ఎక్కువ పవర్ ఎఫిసియంట్‌గా పనిచేయనుంది. ఇది స్నాప్‌డ్రాగన్ ఎలైట్ గేమింగ్ టెక్నాలజీతో రానుంది. ఈ టెక్నాలజీ న్యూ Adreno GPUతో 25 శాతం వరకు మెరుగైన గేమింగ్ పనితీరును అందించనుంది. ఈ చిప్‌సెట్‌లో Kryo CPU వంటి ఫీచర్ ఉంటుంది. తద్వారా ఆన్‌గోయింగ్ చిప్‌సెట్ కంటే ఇది 40 శాతం వరకు మెరుగైన శక్తి సామర్థ్యం తో పని చేయనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Oneplus, Smart phone