ప్రపంచ వ్యాప్తంగా చైనీస్ ఎలక్ట్రానిక్(Electronic) దిగ్గజం వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లకు క్రేజ్ ఎక్కువ. జనవరి 4న ఈ కంపెనీ చైనాలో లాంచ్ చేసిన వన్‌పస్ల్ 11 5జీ సరికొత్త సేల్స్ రికార్డులు క్రియేట్ చేసింది. ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్‌లో(Segment) తీసుకొచ్చిన ఈ హ్యాండ్‌సెట్‌ను గ్లోబల్‌గా ఫిబ్రవరి 7న లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర, స్పెసిఫికేషన్స్ ఇప్పుడు పరిశీలిద్దాం.
ప్రైస్, కలర్ ఆప్షన్స్
వన్‌ప్లస్ 11 5జీ మూడు వేరియంట్లలో లాంచ్ అయింది. 12GB/256GB బేస్ వేరియంట్ ధర చైనా కరెన్సీలో CNY 3,999 (దాదాపు రూ.48,000). 16GB/256GB వేరియంట్ ధర CNY 4,399 (దాదాపు రూ.52,800). హై ఎండ్ వేరియంట్ 16GB/512GB ధర CNY 4,899 (దాదాపు రూ.58,800)గా కంపెనీ నిర్ణయించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇన్‌స్టంట్ బ్లూ, ఎండ్‌లెస్ బ్లాక్ వంటి రెండు కలర్ ఆప్షన్స్‌లో లభించనుంది.
స్పెసిఫికేషన్స్
OnePlus 11 5జీ స్మార్ట్‌ఫోన్ LTPO 3.0 టెక్నాలజీ సపోర్ట్ చేసే 6.7-అంగుళాల 2K (QHD+) ఫ్లెక్సిబుల్ AMOLED డిస్‌ప్లేతో లభిస్తుంది. కర్వ్‌డ్ స్క్రీన్ 1Hz నుంచి 120Hz మధ్య స్కేల్ చేయగల అనుకూల రిఫ్రెష్ రేట్‌తో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్యానెల్.. 1300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 525 PPI పిక్సెల్ డెన్సిటీతో ఉంటుంది. డిస్‌ప్లే గొరిల్లా గ్లాస్ 7 ప్రొటెక్షన్‌తో HDR, డాల్బీ విజన్‌కు సపోర్ట్ చేస్తుంది.
5,000 mAh బ్యాటరీ
ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 SoC ద్వారా బెస్ట్ పర్ఫార్మెన్స్ అందించనుంది. ఇది 16GB LPDDR5X RAMతో వస్తుంది. ఈ ఫోన్ 512GB UFS 4.0 స్టోరేజ్ ఫీచర్‌తో లభిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5,000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ColorOS 13పై రన్ అవుతుంది. అయితే భారత్‌లో లాంచ్ అయ్యే OnePlus 11లో మాత్రం ఆక్సిజన్ ఓఎస్ ఉపయోగించే అవకాశం ఉంది.
50 MP సోనీ IMX890 సెన్సార్
వన్‌ప్లస్ 11 5Gలో రియర్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50 MP సోనీ IMX890 సెన్సార్ వస్తుంది. ఇది f/1.8 ఎపర్చర్, OIS సపోర్ట్‌తో ఉంటుంది. మిగతా రెండు కెమెరాల్లో 115-డిగ్రీస్ FOVతో కూడిన 48 MP అల్ట్రావైడ్ షూటర్, 2x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 32 MP టెలిఫోటో యూనిట్ ఉంటుంది. ముందు భాగంలో f/2.4 ఎపర్చర్‌తో 16 MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. రియర్ కెమెరా సెటప్ Hasselblad సహకారంతో ట్యూన్ చేశారు.
X-యాక్సిస్ వైబ్రేషన్ మోటారు
ఈ హ్యాండ్‌సెట్‌లో X-యాక్సిస్ వైబ్రేషన్ మోటారు కూడా ఉంటుంది. డాల్బీ అట్మోస్, స్పేషియల్ ఆడియో సపోర్ట్‌తో స్టీరియో స్పీకర్ ఇందులో ఉంటుంది. కనెక్టివిటీ ఆప్షన్స్‌గా 5G, 4G LTE, బ్లూటూత్ 5.3, Wi-Fi 6, NFC వంటి వాటికి ఈ స్మార్ట్‌ఫోన్ సపోర్ట్ చేస్తుంది.
రెండు గంటల్లోనే రికార్డ్ సేల్స్
వన్‌ప్లస్ చైనా ప్రెసిడెంట్ Li Jie ప్రకారం.. OnePlus 11 5జీ చైనాలో లాంచ్ అయిన రెండు గంటలకే, గత ప్రీ-సేల్ రికార్డులను బద్దలు కొట్టింది. చైనాలో ఈ హ్యాండ్‌సెట్ విక్రయాలు జనవరి 9 నుంచి స్టార్ట్ కానున్నాయి. మరోపక్క OnePlus 11 Pro లాంచ్ ఇప్పట్లో లేనట్లుగా తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5g technology, ONE PLUS, Technology