Home /News /technology /

ONEPLUS 10T 5G LAUNCHED IN INDIA WITH SNAPDRAGON 8 PLUS GEN 1 PROCESSOR 150W SUPERVOOC CHARGING SUPPORT KNOW PRICE AND SPECIFICATIONS SS

OnePlus 10T 5G: వన్‌ప్లస్ 10టీ 5జీ వచ్చేసింది... సరికొత్త ప్రాసెసర్, అమొలెడ్ డిస్‌ప్లే, Sony IMX769 కెమెరా

OnePlus 10T 5G: వన్‌ప్లస్ 10టీ 5జీ వచ్చేసింది... సరికొత్త ప్రాసెసర్, అమొలెడ్ డిస్‌ప్లే, Sony IMX769 కెమెరా
(image: OnePlus India)

OnePlus 10T 5G: వన్‌ప్లస్ 10టీ 5జీ వచ్చేసింది... సరికొత్త ప్రాసెసర్, అమొలెడ్ డిస్‌ప్లే, Sony IMX769 కెమెరా (image: OnePlus India)

OnePlus 10T 5G | ఇండియాలో వన్‌ప్లస్ 10టీ 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజైంది. ఇందులో సరికొత్త ప్రాసెసర్, అమొలెడ్ డిస్‌ప్లే, Sony IMX769 కెమెరా, 150వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి.

వన్‌ప్లస్ ఇండియా మరో స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో లాంఛ్ చేసింది. వన్‌ప్లస్ 10 సిరీస్‌లో వన్‌ప్లస్ 10టీ 5జీ (OnePlus 10T 5G) మోడల్ రిలీజ్ అయింది. ఇప్పటికే వన్‌ప్లస్ 10 సిరీస్‌లో వన్‌ప్లస్ 10ఆర్, వన్‌ప్లస్ 10 ప్రో మోడల్స్ ఉన్నాయి. రెండేళ్ల తర్వాత టీ సిరీస్‌లో వన్‌ప్లస్ నుంచి మొబైల్ రావడం ఇదే తొలిసారి. రెండేళ్ల క్రితం వన్‌ప్లస్ 8టీ (OnePlus 8T) లాంఛైన సంగతి తెలిసిందే. ఇప్పుడు వన్‌ప్లస్ 10టీ వచ్చేసింది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్, Sony IMX769 కెమెరా, అమొలెడ్ డిస్‌ప్లే, 150W ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఇందులో అలర్ట్ స్లైడర్‌ను తొలగించింది వన్‌ప్లస్.

వన్‌ప్లస్ 10టీ 5జీ ధర


వన్‌ప్లస్ 10టీ 5జీ ధర వివరాలు చూస్తే ఈ స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో రిలీజైంది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.49,999 కాగా, 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.54,999. ఇక హైఎండ్ వేరియంట్ 16జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.55,999. ఆగస్ట్ 6న సేల్ ప్రారంభం కానుంది. జేడ్ గ్రీన్, మూన్‌స్టోన్ బ్లాక్ కలర్స్‌లో కొనొచ్చు. బ్యాంక్ కార్డుతో కొంటే రూ.5,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్‌తో వన్‌ప్లస్ 10టీ 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.44,999 ధరకు, 12జీబీ+256జీబీ వేరియంట్‌ను రూ.49,999 ధరకు, 16జీబీ+256జీబీ వేరియంట్‌ను రూ.50,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. అమెజాన్‌తో పాటు వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్‌లో కొనొచ్చు.

Apps Ban: 348 యాప్స్‌ని నిషేధించిన భారత ప్రభుత్వం


వన్‌ప్లస్ 10టీ 5జీ స్పెసిఫికేషన్స్


వన్‌ప్లస్ 10టీ 5జీ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఫ్లూయిడ్ అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. ఫోన్ స్క్రీన్‌కు లో టెంపరేచర్ పాలీక్రిస్టల్లిన్ ఆక్సైట్ (LTPO) టెక్నాలజీ ఉండటం విశేషం. ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్1 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ లేటెస్ట్‌గా రిలీజైన ఐకూ 9టీ మొబైల్‌లో కూడా ఉంది.

Airtel Data Plans: ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్‌తో ఎయిర్‌టెల్ నుంచి డేటా ప్లాన్స్... బెనిఫిట్స్ ఇవే

వన్‌ప్లస్ 10టీ 5జీ కెమెరా ఫీచర్స్ చూస్తే ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 50మెగాపిక్సెల్ Sony IMX769 మెయిన్ సెన్సార్ + 8మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ సెన్సార్ + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.



వన్‌ప్లస్ 10టీ మొబైల్‌లో 4,800ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 150వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 0 నుంచి 100 శాతం కేవలం 19 నిమిషాల్లో ఛార్జింగ్ చేయొచ్చని కంపెనీ చెబుతోంది. ఇతర ఫీచర్స్ చూస్తే 3D కూలింగ్ సిస్టమ్, వన్‌ప్లస్ హైపర్‌బూస్ట్ గేమింగ్ ఇంజిన్ టెక్నాలజీ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి.
Published by:Santhosh Kumar S
First published:

Tags: 5G Smartphone, Amazon, Mobile News, Mobiles, Oneplus, Smartphone

తదుపరి వార్తలు