ఫ్లాగ్‌షిప్‌లు అనగానే గుర్తొచ్చేవి పవర్, పెర్‌ఫార్మెన్స్. OnePlus 10R మరియు దాని శక్తివంతమైన MediaTekDimensity 8100-MAX SoCతో పాటు 12 GB వరకు LPDDR5x RAM ఇంకా 256 GB UFS 3.1 స్టోరేజ్ కలిసి వస్తున్నప్పుడు ఇవి ఖచ్చితంగా లభిస్తాయి.
పోటీలో మిగతా వాటి కంటే భిన్నంగా నిలవడానికి కారణం ఏమిటి? కేవలం కెమెరాలు, అంతర్గత అంశాలు మాత్రమే సరిపోవు కదా? ఇక్కడే డిజైన్, ఎర్గోనామిక్స్ మరియు అందం కీలకం అవుతాయి. ఇప్పటి వరకు మేము ఫోన్‌ను చూసిన దానిని బట్టి, ఈ అంశాలలో OnePlus చాలా శ్రమ పెట్టింది, ఆ శ్రమ ఫలిచింది.
Featuring flat sides and a chassis that is a mere కేవలం 8.17 mm మందం ఉన్న ఛాసిస్, సమాంతరంగా ఉన్న పక్క అంచులతో, ఇది చాలా సన్నని ఫోన్. మంచి గ్రిప్ ఉండటంతో పాటు ప్రత్యేకంగా కనిపించేలా ఫోన్ వెనుక భాగంలో ‘నానో స్థాయి డాట్ మ్యాట్రిక్స్’ టెక్స్‌చర్. OnePlus అక్కడితో ఆగలేదు, సాధారణ టెక్స్‌చర్ కాకుండా, కెమెరా బంప్ కింద నుండి ఫోన్ కింది భాగం వరకు గీతలు కనిపించే రెండు-విధాల టెక్స్‌చర్ అందిచారు. ఇది ఆసక్తికరం మాత్రమే కాదు, 10Rకు ప్రత్యేకమైన డిజైన్కు హుందాతనాన్ని, మెరుపుని అందిస్తుంది.
ఈ ఫోన్ సియెర్రా బ్లాక్, అంతే అందమైన ఫారెస్ట్ గ్రీన్ రంగులలో అందుబాటులో ఉంది.
బోనస్ అంశం ఏమిటంటే, ఈ నానో-స్థాయి డాట్ మ్యాట్రిక్స్‌పై వేలిముద్రలు పడవు, ఫ్రిక్షన్ ఉంటుంది కాబట్టి పట్టు బాగుంటుంది. అదనపు ప్రయోజనం, ఫోన్ బరువు కేవలం 186 గ్రాములు, ఇలాంటి ఫోన్‌లలో ఇది తక్కువ బరువు. సమాంతరంగా ఉంటే అంచులతో పాటు, 10R ఎక్కువ సేపు చేతిలో పట్టుకుని ఉన్నా భారంగా అనిపించదు, ప్రత్యేకించి అందమైన AMOLED స్క్రీన్‌పై గేమ్‌లు ఆడేటప్పుడు అలాగే వీడియోలు చూసేటప్పుడు.
డిస్‌ప్లేల గురించి మాట్లాడుకోవాలి అంటే, ఫోన్ ముందు భాగం 6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లే, వైడ్ P3 కలర్ స్పేస్‌కు సపోర్ట్‌తో పాటు HDR10+ సర్టిఫికేషన్‌తో వెనుక భాగం అంత సొగసుగా ఉంటుంది. ముందు భాగంలో చిన్న పంచ్-హోల్ కెమెరా ఉంది, కెమెరా చాలా నేర్పుగా దాచి పెట్టగల వాల్‌పేపర్‌లతో ఇది దాదాపు కనిపించదు కూడా.
ఈ ఫోన్‌లో OxygenOS 12.1 ఉంది, దీనిని OnePlus ‘బర్డెన్‌లెస్’ అంటుంది. ఈ OS అంశాలు అలాగే డిజైన్ ఫోన్ హుందాతనాన్ని పెంచేలా తయారు చేయబడ్డాయి. అందువల్ల ఫోన్ మరింత పొందికగా, ఆకర్షణీయంగా ఉంది.
సరైన పనితీరు లేకపోతే, హుందాతనం సంపూర్ణ కాదు కదా. ప్రయాణం సౌకర్యవంతంగా లేనప్పుడు Ferrari మరియు దాని 600 BHP ఇంజిన్ లేదా భారీ టార్క్ లేని Rolls Royce ప్రయోజనం ఏమిటి?
120 Hz డిస్‌ప్లే మరియు కాంతి వేగంతో దూసుకుపోయే 1000 Hz టచ్-రెస్పాన్స్, శక్తివంతమైన హార్డ్‌వేర్‌తో కలిసి 10Rకు దాని ప్రీమియం స్థాయికి తగ్గ శక్తి, పనితీరును అందిస్తాయి.
పనితీరులో నిలకడ ఉండేలా చేసే భారీ వేపర్ ఛాంబర్ కూలర్ అలాగే Dimensity 8100 యొక్క AI చిప్ల ప్రయోజనాలు అందేలా సాఫ్ట్వేర్లో చేసిన మార్పులు ఫ్రేమ్ డ్రాప్లు మరియు ఇలాంటి ఇతర అంశాలను ముందుగానే అంచనా వేసి నివారించగలవు.
చివరగా, బ్యాటరీ అలాగే ఛార్జర్, ఇవి రెండు మీ ఫోన్ రోజంతా ఒకే స్థాయిలో, ఎలాంటి డౌన్-టైమ్ లేకుండా పని చేసేలా చేస్తాయి.
OnePlus 10R మే మే 4న సేల్‌కు రానుంది లాంచ్ సమయంలో ఈ ఫోన్ సియెర్రా బ్లాక్ మరియు ఫారెస్ట్ గ్రీన్ రంగులలో, 8 లేదా 12 GB RAM మరియు 128 లేదా 256 GB స్టోరేజ్‌తో రానుంది. డిఫాల్ట్‌గా, ఫోన్‌తో పాటు 80 W ఛార్జర్ మరియు 5,000 mAh బ్యాటరీ వస్తాయి. వీటి వల్ల కేవలం 30 నిమిషాలలో 100% ఛార్జ్ అవుతుంది. మీరు కావాలి అనుకుంటే చిన్న 4,500 mAh బ్యాటరీతో వచ్చే 150 W SUPERVOOC ఎన్‌డ్యూరెన్స్ ఎడిషన్ మోడల్‌ని కూడా ఎంచుకోవచ్చు. బ్యాటరీ కాస్త చిన్నది, కానీ కేవలం 3 నిమిషాలలో ఇది 30% ఛార్జ్ చేస్తుంది 1-100% కేవలం 17 నిమిషాలలో చేరుకుంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, Mobile News, Mobiles, Oneplus, Smartphone