వన్‌ప్లస్ 10 సిరీస్‌లో ఇటీవల వన్‌ప్లస్ 10ఆర్ (OnePlus 10R) స్మార్ట్‌ఫోన్ లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్ సేల్ ప్రరంభమైంది. వన్‌ప్లస్ 10ఆర్ గతంలోనే చైనాలో లాంఛ్ అయింది. చైనాలో వన్‌ప్లస్ ఏస్ పేరుతో చైనాలో రిలీజైన మొబైల్ ఇండియాలో వన్‌ప్లస్ 10ఆర్ పేరుతో వచ్చింది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 8100 (MediaTek Dimensity 8100) ప్రాసెసర్ ఉండటం విశేషం. 80వాట్, 150వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ లభిస్తుంది. వన్‌ప్లస్ 10ఆర్ మూడు వేరియంట్లలో రిలీజైంది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ధర రూ.38,999 కాగా, 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర రూ.42,999. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లకు 80వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ 150వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఎండ్యూరెన్స్ ఎడిషన్ కొనాలనుకుంటే రూ.43,999 చెల్లించాలి.
అమెజాన్‌తో పాటు వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్‌లో వన్‌ప్లస్ 10ఆర్ సేల్ ప్రారంభమైంది. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుతో కొంటే రూ.2,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్‌తో 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.36,999 ధరకు, 12జీబీ+256జీబీ వేరియంట్‌ను రూ.40,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. ఇప్పటికే వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నవారు అప్‌గ్రేడ్ చేస్తే రూ.2,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్ లభిస్తుంది.
Amazon Summer Sale: ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్... త్వరపడండి
The wait is over now!
Get your hands on the new #OnePlus10R, designed to give you the speed you need in life with the 150W SuperVOOC Fast Charging and MediaTek Dimensity 8100 Max Processor.
Get yours now!
— OnePlus India (@OnePlus_IN) May 4, 2022
వన్‌ప్లస్ 10ఆర్ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ లభిస్తుంది. ఇటీవల రిలీజ్ అయిన రియల్‌మీ జీటీ నియో 3 స్మార్ట్‌ఫోన్‌లో కూడా ఇదే ప్రాసెసర్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 + ఆక్సిజన్ఓఎస్ 12.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. మూడు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, నాలుగేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ లభిస్తాయని కంపెనీ చెబుతోంది. వన్‌ప్లస్ 10ఆర్ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 50మెగాపిక్సెల్ Sony IMX766 ప్రైమరీ కెమెరా + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ సెన్సార్ + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.
Smartphone Offer: ఎస్‌బీఐ కార్డ్ ఉందా? ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.7,000 డిస్కౌంట్
వన్‌ప్లస్ 10ఆర్ స్మార్ట్‌ఫోన్‌లో రెండు రకాల బ్యాటరీ కెపాసిటీలతో వేర్వేరు వేరియంట్స్ ఉన్నాయి. 5,000ఎంఏహెచ్ బ్యాటరీకి 80వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తే, 4,500ఎంఏహెచ్ బ్యాటరీకి 150వాట్ సూపర్‌వూక్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 150వాట్ సూపర్‌వూక్ ఎండ్యూరెన్స్ ఎడిషన్ ఛార్జర్‌తో కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే రోజంతా స్మార్ట్‌ఫోన్ ఉపయోగించుకోవచ్చు. 1 నుంచి 100 శాతానికి కేవలం 17 నిమిషాల్లో ఛార్జింగ్ చేయొచ్చు. స్మార్ట్ బ్యాటరీ హెల్త్ ఆల్గరిథమ్ చెక్ ఫీచర్ ఉంది. ఇక 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను 80వాట్ సూపర్‌వూక్ ఛార్జర్‌తో 1 నుంచి 100 శాతానికి 32 నిమిషాల్లో ఛార్జింగ్ చేయొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, Mobile News, Mobiles, Oneplus, Smartphone