గేమింగ్ మరియు స్మార్ట్‌ఫోన్‌ల విషయానికి వస్తే రెండు అంశాలు కీలకం: కూలింగ్ మరియు ఎర్గోనామిక్స్. రా పెర్‌ఫార్మెన్స్ ముఖ్యమే, కానీ సరైన కూలింగ్ లేకపోతే అంతగా ఉపయోగం ఉండదు. అదే సమయంలో దీర్ఘకాలం గేమింగ్‌కి అనుకూలంగా లేని ఫోన్‌లో ఎక్కువ సమయం ఆడలేరు. ఈ మధ్య లాంచ్ చేసిన 10Rతో OnePlus, రా పెర్‌ఫార్మెన్స్ అందించడంతో పాటు పై రెండు సమస్యలను కూడా పరిష్కరించాము అని ప్రకటించారు. రెండు రకాల విజయం కదా? నిజమే అనిపిస్తుంది. కానీ ముందుగా, ఈ సమస్యలను ఎలా పరిష్కరించారో చూద్దాం.
OnePlus 10Rకి MediaTek Dimensity 8100-Max SoC ఆధారం ఉంది. ఈ చిప్‌లో 2.85 GHz వరకు క్లాక్ చేసిన 8-core CPU, ARM Mali-G610 GPU, imagiq 780 ISP, AI కోసం కొత్త APU 580 చిప్, 12 GB వరకు LPDDR5 RAM, మరియు 256 GB వేగవంతమైన UFS 3.1 స్టోరేజ్ ఉన్నాయి. మొత్తంగా, OnePlus, ఈ చిప్ 11% అధిక CPU పవర్, 20% అధిక GPU పవర్, మరియు ఇంతక ముందుకంటే 80% వేగవంతమైన AI ఇంజిన్ ఉన్నాయి. మొత్తంగా సిస్టమ్ అంతా 25% మరింత శక్తి సమర్థవంతమైనది, కాబట్టి బ్యాటరీ లైఫ్ కూడా సమస్య కాదు.
ఇది చాలా శక్తివంతమైన హార్డ్‌వేర్ అలాగే దీనికి సమర్థవంతమైన కూలింగ్ సిస్టమ్ అవసరం. సాధారణంగా, చిప్ వేడిగా అయితే, నెమ్మదిగా అయిపోతుంది – దీనినే థర్మల్ త్రోట్లింగ్ — దీని వల్ల చిప్ జీవిత కాలం అలాగే ఫోన్ పట్టుకోవడానికి వేడిగా అయిపోకుండా కాపాడుతుంది.
ఇలా జరగకుండా ఆపడానికి, OnePlus వారు ఇప్పటి వరకు ఉపయోగించిన కూలింగ్ సిస్టమ్‌లలోనే భారీ దానిని ఉపయోగిస్తున్నాము అని చెప్పారు. ఈ వేపర్ ఛాంబర్ 4,100 చదరపు mm, అంటే అందుబాటులో ఉన్న కూలింగ్ ఏరియా 35,000 చదరపు mm! ఈ వేపర్ ఛాంబర్ సరి కొత్త జెనరేషన్ గ్రాఫీన్ మరియు గ్రాఫైట్‌ను వినియోగిస్తోంది. దీనిని 3D పేసివ్ కూలింగ్ సిస్టమ్ అని అంటారు.
దీనితో పాటు, OnePlus పనితీరును మెరుగు చేయడానికి HyperBoost గేమింగ్ ఇంజిన్‌ను ఉపయోగిస్తోంది. ఈ సిస్టమ్‌లో ఒక భాగం జెనరల్ పెర్‌ఫార్మెన్స్ అడాప్టర్ (GPA) ఫ్రేమ్ స్టెబిలైజర్ (FS), ఇది మీ గేమ్ స్థాయిని పెంచడానికి రూపొందించబడినది.
GPA FS వాస్తవికి పరిస్థితులలో CPU మరియు GPU రిసోర్స్‌లను బ్యాలెన్స్ చేయడానికి మానిటరింగ్ అలాగే AI టూల్స్ ఉపయోగిస్తుంది, అదే సమయంలో మీ గేమింగ్ అనుభవానికి అంతరాయం కలగకుండా అనుకోని ఫ్రేమ్-డ్రాప్‌లు మెల్లగా జరిగేలా చూసుకుంటుంది.
మరొక అప్‌డేట్ వైర్‌లెస్ సిస్టమ్. మీరు మీ ఫోన్‌ను ఎలా పట్టుకున్నా సరే, కనెక్టివిటీ సమస్య లేకుండా ఆరు యాంటీనాలు ఉన్నాయి, బ్లూటూత్ మరియు Wi-Fi ఒకే సమయంలో ఉపయోగించినా అంతరాయం లేకుండా అప్‌డేట్ చేయబడిన సిస్టమ్ ఉంది.
డిస్‌ప్లే విషయానికి వస్తే, 6.7-అంగుళాల స్క్రీన్ 120 Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తోంది, కానీ మరింత ముఖ్యంగా, 1000 Hz టచ్ రెస్పాన్స్ ఉంది. దీనితో పాటు HDR10+ సర్టిఫై చేసిన కలర్ యాక్యురేట్ P3 ప్యానెల్ కూడా తోడయితే, మీకు వర్చువల్‌గా కాంతివంతమైన, కలర్-ఖచ్చితమైన, బ్లర్ లేకుండా ఉండే గేమింగ్ అనుభవం అందుతోంది.
చివరగా, బ్యాటరీ లైఫ్. మీరు గేమ్‌లో కీలకమైన ఘట్టంలో ఉండగా బ్యాటరీ ఖాళీ అయిపోయినా లేదా ఆడటానికి ఉత్సాహంగా ఉన్నప్పుడు ఫోన్ ఛార్జ్ అయ్యేంత వరకు వేచి ఉండటం చాలా ఇబ్బందికరంగా ఉంటుందో కదా?
ఈ సమస్యలు రాకుండా చూసేదే OnePlus యొక్క కాంతి వేగంతో ఛార్జ్ చేసే SUPERVOOC ఛార్జింగ్ సిస్టమ్. రెండు రకాలలో వస్తోంది — 5,000 mAh బ్యాటరీతో 80W మరియు 4,500 mAh బ్యాటరీతో వచ్చే150 W —10R అద్భుతమైన బ్యాటరీ పనితీరును మరియు ఛార్జింగ్ వేగాలను అందిస్తోంది. ‘నెమ్మది అయిన’ 80 W ఛార్జర్ 5,000 mAh బ్యాటరీని కేవలం 30 నిమిషాలలో పూర్తిగా ఛార్జ్ చేస్తుంది, కానీ 150 W వెర్షన్ కేవలం 3 నిమిషాలలో 30% ఛార్జ్ చేస్తుంది, కేవలం 17 నిమిషాలలోనే పూర్తి ఛార్జ్ అయిపోతుంది. ఇది మీరు స్నానం చేయడానికి పట్టేంత సమయం అంతే.
దీర్ఘకాలిక గేమింగ్ సమయాల కోసం, పట్టుకోవడానికి అనుకూలంగా ఉండే ఫోన్ కావాలి. 10R సొగసుగానే కాకుండా పట్టుకోవడానికి వీలుగా ఉండే సరళమైన, అంచులు సమాతరంగా ఉన్న డిజైన్ ఎంచుకుంది. కేవలం 8.17 mm మరియు 186గ్రా బరువుతో చాలా సన్నగా ఉంటుంది.
దీని వలన ఎక్కువ కాలం ఆడినా అలసట రాదు. దీనితో పాటు అదనంగా, ముందు వైపు గ్లాస్ నానో-టెక్స్‌చర్ ఫినిష్‌తో వస్తుంది, కాబట్టి మంచి ఫ్రిక్షన్ ఇవ్వడంతో పాటు వేళ్ళకు అనుకూలంగా కూడా ఉంటుంది.
OnePlus 10R, 38,999 రూపాయల ప్రారంభ ధరతో మే 4న సేల్‌కు రాబోతోంది ఈ ఫోన్ సియెర్రా బ్లాక్ అలాగే ఫారెస్ట్ గ్రీన్ రంగులలో అందుబాటులో ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, Mobile News, Mobiles, Oneplus, Smartphone