ఏప్రిల్ 28న సాయంత్రం ఏడు గంటలు, ఈ తేదీ మరియు సమయాన్ని గుర్తుంచుకోండి, ఈ సమయంలోనే OnePlus, దాని ల్యాప్‌టాప్-క్లాస్ 150W ఫాస్ట్ ఛార్జర్‌తో వచ్చే ప్రముఖ OnePlus 10Rను మాత్రమే కాకుండా OnePlus Nord 2 CE Lite 5G మరియు OnePlus Nord Budsను కూడా ఆవిష్కరించనుంది. ‘మోర్ పవర్ టూ యూ’ ఈవెంట్ ప్రత్యక్ష ప్రసారం కోసం ఇక్కడ చూడండి.
డివైస్‌ల గురించి మనకు ఏమి తెలుసు?
వాస్తవానికి మనకు తెలిసింది కొంచమే. మీ కోసం ఎలాంటి ప్రత్యేక ధరలు లేవు, కానీ OnePlus 10R, MediaTek వారి శక్తివంతమైన కొత్త డైమెన్సిటీతో కూడిన 8100 MAX 5G చిప్‌తో మీకు అందించబడుతుందని మాకు తెలుసు, అలాగే అది కనీసం ఒక కొత్త వేరియంట్ 12GB RAM, 256 GB స్టోరేజ్‌తో వస్తుందని కూడా మనం ఆశించవచ్చు.
రంగు మరియు స్టోరేజ్ ఫీచర్లను పక్కన పెడితే లాంచ్ సమయంలో ఫోన్‌లో రెండు విభిన్న రకాలను మనం చూడవచ్చు: 4,500 mAh బ్యాటరీతో కూడిన 150 W సూపర్‌వూక్ ఎండ్యూరెన్స్ ఎడిషన్ మోడల్ మరియు 80 W సూపర్‌వూక్ ఛార్జర్, 5,000 mAh బ్యాటరీతో కూడిన "రెగ్యులర్" మోడల్.
150 W ఛార్జర్ ల్యాప్‌టాప్‌లతో వచ్చే ఛార్జర్‌ల కన్నా మరింత శక్తివంతమైనదని చెప్పడం కొంచెం వెటకారంగా అనిపించినప్పటికీ అదే వాస్తవం, ఎందుకనగా ఇది 17 నిమిషాల్లో 1-100% నుండి ఫ్లాట్ 10Rను పొందగలదని హామీ ఇవ్వబడింది! అయితే, 32 నిమిషాల్లో 1-100% ఛార్జింగ్ సమయంతో వచ్చే 80 W వెర్షన్ ఛార్జర్ నెమ్మదిగా పనిచేస్తుందని కాదు.
OnePlus ఎల్లప్పుడూ బ్యాటరీ ఆరోగ్యం లేదా డ్యామేజ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతోంది. సెన్సార్‌లు మరియు AI-ఆధారిత టెక్నాలజీల కలయిక బ్యాటరీని, దాని ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలించగలవని, అలాగే డివైస్‌ను సురక్షితంగా, సరైన పద్దతిలో ఛార్జ్ అయ్యేలా చూసేందుకు ఛార్జింగ్ పనితీరును తెలివిగా సర్దుబాటు చేయగలవని నిర్ధారిస్తుంది. అయితే, వాస్తవానికి 150 W ఛార్జర్ రెండు అంతర్గత బ్యాటరీలను 75 W చొప్పున ఛార్జ్ చేస్తుంది, అందులో ప్రతి ఒక్కటి స్మార్ట్‌ఫోన్‌లోకి ఎక్కువ శక్తిని పంపింగ్ చేసే ప్రభావాన్ని మరింత తగ్గిస్తాయి. ఇలాంటి ప్రత్యేక చర్యలు అమలులో ఉన్నందున OnePlus, 150 W ఛార్జర్‌తో బ్యాటరీ 1600 ఛార్జ్ సైకిళ్ల తర్వాత కూడా 80% ఛార్జ్‌ను కలిగి ఉంటుందని పేర్కొంది (రోజుకు ఒకసారి డివైస్‌ను ఛార్జ్ చేస్తున్నప్పుడు అది 4 సంవత్సరాలకు పైగా ఉంటుంది).
అదనంగా భద్రతా కారణాల దృష్ట్యా ఛార్జింగ్ కేబుల్‌లు ఎన్‌క్రిప్ట్ చేయబడ్డాయి, కావున ఛార్జింగ్ స్పీడ్‌లను నిర్వహించడానికి 80 W మరియు 150 W వంటి దృవీకరించబడిన కేబుల్‌లు మాత్రమే ఆ వేగంతో ఛార్జింగ్ చేయడానికి ఉపయోగించవచ్చని ఇది నిర్ధారిస్తుంది, సాధారణ కేబుల్స్ ఫోన్‌ను ఛార్జ్ చేస్తాయి కానీ సురక్షితంగా, నెమ్మదిగా చేస్తాయి.
మిగిలిన వివరాల్లోకి వెళ్తే, ఫోన్ 120 Hz డిస్‌ప్లేతో వస్తుందని మరియు వెనుకవైపు Sony IMX 766- పవర్డ్ ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుందని మాత్రమే మాకు తెలుసు.
తదుపరి మా వద్ద OnePlus Nord CE 2 Lite 5G ఉంది. ఇది ఇంతకు ముందు వచ్చిన Nord ఫోన్‌ల మాదిరిగా ఉన్నట్లయితే CE2 Lite ఖచ్చితంగా దాని లాంచ్ ధర వద్ద అమ్ముడుపోతుంది. ప్రస్తుతానికి ఫోన్‌లో 33 W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే 5,000 mAh బ్యాటరీ ఉందని మాత్రమే మనకు తెలుసు. అంటే అది 30 నిమిషాల్లో 0-50% వరకు ఛార్జ్ అవుతుంది.
వెనుకవైపు 64 MPతో ట్రిపుల్ కెమెరాల వరుసను మరియు ముందు భాగంలో 6.59-అంగుళాల 120 Hz డిస్‌ప్లేను మీరు కనుగొనవచ్చు.
చివరగా మా వద్ద OnePlus Nord Buds అందుబాటులో ఉన్నాయి. ఇవి బ్రాండ్ నుండి వచ్చిన మొదటి Nord TWS మరియు OnePlus TWS లైనప్‌లో ఇవి మరింత సరసమైన ఎంపికగా వస్తాయని మేము భావిస్తున్నాము, అంతేకాకుండా, అవి అనేక-ఫీచర్లతో మరియు సామర్థ్యాని కలిగి ఉంటాయని మేము ఆశిస్తున్నాము. అద్భుతమైన బాస్ డెలివరీ కోసం ఇది పెద్ద 12.4 mm డ్రైవర్లను ఉపయోగిస్తోందని, AI- ఆధారిత నాయిస్ క్యాన్సిలింగ్ టెక్‌ను కలిగి ఉందని OnePlus వెల్లడించింది.
Buds కూడా IP55 స్ప్లాష్ మరియు డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్‌ను కూడా కలిగి ఉన్నాయి మరియు 10 నిమిషాల ఛార్జ్ నుండి 5 గంటల వినియోగాన్ని అందిస్తాయి.
ఇవి OnePlus నుండి విడుదల కాబోయే అద్భుతమైన మోడల్‌లు మరియు ఇవి ఎలాంటి ప్రత్యేక ఫీచర్లతో ప్యాక్ చేయబడ్డాయో తెలుసుకోవడానికి మేము ఆసక్తిగా ఎదురు చూస్తున్నాము. మీరు కూడా ఈ వివరాలను ప్రత్యక్షంగా చూడడానికి ఏప్రిల్ 28న జరిగే ఈవెంట్‌కు ట్యూన్ చేయడం మర్చిపోకండి!
అప్పటి వరకు, మీరు మరిన్ని టీజర్‌లు మరియు సమాచారం కోసం OnePlus ఫోరమ్‌లు, Instagram పేజీని వీక్షించవచ్చు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, Mobile News, Mobiles, Oneplus, Smartphone