హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

OnePlus 10R: 150W SUPERVOOC ఛార్జర్‌తో 17 నిమిషాల్లో 100% ఛార్జింగ్... బ్యాటరీ సురక్షితం (Advertisement)

OnePlus 10R: 150W SUPERVOOC ఛార్జర్‌తో 17 నిమిషాల్లో 100% ఛార్జింగ్... బ్యాటరీ సురక్షితం (Advertisement)

OnePlus 10R: 150W SUPERVOOC ఛార్జర్‌తో 17 నిమిషాల్లో 100% ఛార్జింగ్... బ్యాటరీ సురక్షితం (Advertisement)

OnePlus 10R: 150W SUPERVOOC ఛార్జర్‌తో 17 నిమిషాల్లో 100% ఛార్జింగ్... బ్యాటరీ సురక్షితం (Advertisement)

OnePlus 10R యొక్క ఆకర్షణీయమైన 150W SUPERVOOC ఛార్జింగ్ మీకు కేవలం 17 నిమిషాల్లో 100% ఛార్జ్ ఇవ్వడమే కాకుండా మీ బ్యాటరీని సురక్షితంగా కూడా ఉంటుంది.

  మీరు దీన్ని ఏవిధంగా చూసినా కూడా, OnePlus 10R అనేది అత్యంత ఆకర్షణీయమైన కిట్గా సెట్ చేయబడినది. ఈరోజు సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానున్న ఈ ఫోన్ పరిశ్రమలోని అద్భుతమైన 150W SUPERVOOC ఛార్జింగ్ టెక్నాలాజీని పరిచయం చేసింది, ఈ అంశం ఇదే ధరతో కూడిన విభిన్న ఫోన్ల మధ్య OnePlus 10R 5G ని భిన్నంగా నిలిపింది. ఈ స్మార్ట్ఫోన్ MediaTek వారి శక్తివంతమైన డైమెన్సిటీ 8100 MAX 5G SoC ద్వారా ఆధారితమైనది, ఇది ప్రత్యేకంగా OnePlus 10R కు అనుకూలీకరించబడింది.

  అయితే, OnePlus ఫోన్తో వస్తున్న ఛార్జర్లు మరింత ఆకర్షణగా నిలుస్తున్నాయి. లాంచ్ సమయంలో ఈ ఫోన్ రెండు ఛార్జర్లతో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు: 5,000 mAh బ్యాటరీతో కూడిన ఫోన్తో టామర్ 80 W SUPERVOOC ఛార్జర్ మరియు 4,500 mAh బ్యాటరీతో కూడిన ఫోన్తో అద్భుతమైన 150 W SUPERVOOC ఛార్జర్ లభిస్తున్నాయి.

  ఈ ఛార్జింగ్ పవర్తో మీకు ఏమి లభిస్తుంది? 10 నిమిషాల్లో 1-70%, 17 నిమిషాల్లో 1-100% ఛార్జింగ్ లభిస్తుంది, అయితే మీరు 80W వెర్షన్ని ఎంచుకున్నట్లయితే 32 నిమిషాల్లో 1-100% ఛార్జింగ్ పొందవచ్చు!

  ఇది నిజంగా ఆకర్షణీయమైన విషయం, కానీ క్యాచ్ ఉందా?


  ఇది నిజంగా ఆకట్టుకునే విషయం, అయితే ఈ వేగవంతమైన ఛార్జింగ్ బ్యాటరీ లైఫ్పై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే ప్రశ్న మన మనస్సులో మెదులుతుంది. సాధారణ ఫాస్ట్ ఛార్జర్లు (20-30 W) ఉపయోగించిన ఒక సంవత్సరంలోనే బ్యాటరీ సామర్థ్యం 80%కి పడిపోవడం మనకు అలవాటైన విషయం. అయితే 150Wతో, కేవలం కొన్ని నెలల వినియోగాన్ని మాత్రమే ఆశించాలా?

  80W మరియు 150W ఛార్జర్లను ఉపయోగించినప్పటకీ, ఇతర స్మార్ట్ఫోన్ బ్యాటరీల కంటే చాలా ఎక్కువ లైఫ్ అందిస్తుందని OnePlus సూచిస్తుంది. వారి అంచనాల ప్రకారం, 150W SUPERVOOC ఎండ్యూరెన్స్ ఎడిషన్ ఫోన్ 1600 సార్లు ఛార్జింగ్ పెట్టిన తరువాత కూడా దాని సామర్థ్యం 80% వరకూ నిలుపుకుంటుంది. అంతేకాకుండా ఒకరోజులో 4,500 mAh బ్యాటరీని వినియోగించే భారీ వినియోగదారులకు కూడా, ఇది 4 సంవత్సరాలకు పైగా అద్భుతమైన బ్యాటరీ లైఫ్ అందిస్తుంది.

  తాజా ఫోరమ్ పోస్ట్లో, OnePlus యొక్క ఈ ఆకర్షణీయమైన పనితీరు అనేక కీలక సాంకేతికతల సౌజన్యంతో విపులంగా వివరించబడినది. మరో విషయం ఏమిటంటే, ఫోన్ యొక్క ఎండ్యూరెన్స్ ఎడిషన్లో డ్యూయల్ ఛార్జ్ పంప్ కలదు, అయితే ఇది OnePlus 10R బ్యాటరీని ఒక్కొక్కటి 75 W చొప్పున ఛార్జ్ చేస్తుంది (మొత్తం 150 W). ఇది ఉష్ణ ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడడమే కాకుండా, బ్యాటరీ జీవితాన్ని, ఛార్జింగ్ రేటును మెరుగుపరుస్తుంది. దీనితో పాటుగా, స్మార్ట్ బ్యాటరీ హెల్త్ అల్గారిథమ్ (SBHA) మరియు బ్యాటరీ హీలింగ్ టెక్నాలజీ వంటి అనేక స్మార్ట్ ఫీచర్లు కలవు, దీనిలోని బ్యాటరీ హెల్త్ ఇంజిన్ అనేక సెన్సార్ల సహాయంతో బ్యాటరీ జీవితకాలాన్ని పొడిగించి, సంరక్షిస్తాయి.

  ఉదాహరణకు స్మార్ట్ బ్యాటరీ అల్గారిథం ఇచ్చిన స్పెసిఫికేషన్లో బ్యాటరీ పనిచేస్తోందని నిర్ధారించుకోవడానికి గరిష్ట ఛార్జింగ్ కరెంట్ని ట్రాక్ చేసి నియంత్రిస్తుంది. ఛార్జింగ్ సైకిల్స్ సమయంలో ఎలక్ట్రోడ్లు నిరంతరం మరమ్మతులు చేయబడతాయని, కాలక్రమేణా అరుగుదల తగ్గుతుందని OnePlus చెబుతోంది.

  మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దీనిలో ‘VFC ట్రికిల్ ఛార్జింగ్ ఆప్టిమైజేషన్ అల్గారిథమ్' కూడా కలదు, ఇది ఛార్జింగ్ చివరి దశలో (90-100% నుండి) ఛార్జింగ్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ దశలో బ్యాటరీకి చాలా నష్టం జరిగే అవకాశం ఉంటుంది, అయితే ఆప్టిమైజేషన్ అల్గారిథమ్ ఛార్జింగ్ సామర్థ్యాన్ని మెరుగుపరచి, వేడిని తగ్గించడానికి పవర్ డ్రాను తగ్గిస్తుంది. మీరు మీ ఫోన్ను ఎప్పుడు అన్ప్లగ్ చేయబోతున్నారో కూడా ఇది అంచనా వేయగలగడమే కాకుండా, ఫోన్ను ఎక్కువసేపు 100% స్టాండ్బైలో ఉంచడం కంటే మీకు అవసరమైనప్పుడు 100% ఉందని నిర్ధారిస్తుంది.

  భద్రతా ఫీచర్ల సంగతి ఏమిటి?


  ఈ అల్గారిథమ్లతో సహా, వేడిని అదుపులో ఉంచి, బ్యాటరీ దెబ్బతినకుండా ఉండడానికి రూపొందించిన అనేక భద్రతా ఫీచర్లు కలవు. దీనిలోని 13 సెన్సార్లు ఛాసిస్ లోని వివిధ పాయింట్ల వద్ద ఉష్ణోగ్రతలను ట్రాక్ చేస్తాయి. ఈ సెన్సార్ల నుండి వచ్చే ఫీడ్బ్యాక్ ఛార్జింగ్ అల్గారిథమ్ని ఆప్టిమైజ్ చేయడంలో సహాయపడుతుంది.

  మరీ ముఖ్యంగా, ఫోన్ సురక్షితంగా ఛార్జ్ అయ్యేలా చూసుకోవడానికి మీరు సరైన ఛార్జింగ్ కేబుల్లను ఉపయోగించాలి. అన్ని కేబుల్స్ 80 W మరియు 150 W ఛార్జింగ్ శక్తిని నిర్వహించలేవు, పైగా అవి అగ్ని ప్రమాదానికి కూడా దారితీయవచ్చు. OnePlus కేబుల్లను ఎన్క్రిప్ట్ చేయడం ద్వారా ఫోన్ను పూర్తి 80 W లేదా 150 W వేగంతో ఛార్జ్ చేయడానికి అనుమతినిస్తుంది. OnePlus ఇతర ఛార్జింగ్ కేబుల్లను ఉపయోగించవచ్చని కూడా చెబుతుంది, అయితే అవి సరైన కేబుల్ కానట్లయితే మాత్రం అంత సురక్షితం కాదు అని కూడా ధ్రువీకరించారు.

  OnePlus నిన్న రాత్రి జరిగిన 'మోర్ పవర్ టు యు' ఈవెంట్లో OnePlus 10R, OnePlus Nord CE 2 Lite 5G మరియు OnePlus Nord బడ్స్లను ఆవిష్కరించింది. మీరు ఈ లాంచ్ ఈవెంట్ని ఇక్కడ చూడవచ్చు!

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: 5G Smartphone, Mobile News, Mobiles, Oneplus, Smartphone

  ఉత్తమ కథలు