హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

OnePlus 10R 5G: ఇండియాలో రేపే వన్‌ప్లస్ 10R 5G ప్రైమ్ బ్లూ ఎడిషన్ లాంచ్.. ఫీచర్లు సూపరో సూపర్..

OnePlus 10R 5G: ఇండియాలో రేపే వన్‌ప్లస్ 10R 5G ప్రైమ్ బ్లూ ఎడిషన్ లాంచ్.. ఫీచర్లు సూపరో సూపర్..

OnePlus 10R 5G: ఇండియాలో రేపే వన్‌ప్లస్ 10R 5G ప్రైమ్ బ్లూ ఎడిషన్ లాంచ్.. ఫీచర్లు సూపరో సూపర్..

OnePlus 10R 5G: ఇండియాలో రేపే వన్‌ప్లస్ 10R 5G ప్రైమ్ బ్లూ ఎడిషన్ లాంచ్.. ఫీచర్లు సూపరో సూపర్..

OnePlus 10R 5G: ఇండియాలో వన్‌ప్లస్ 10R 5G ప్రైమ్ బ్లూ ఎడిషన్‌(Prime Blue Edition)ను లాంచ్ చేయనున్నట్లు వన్‌ప్లస్ అధికారికంగా ట్విట్టర్‌లో ప్రకటించింది. ఈ అప్‌కమింగ్ స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. 

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ప్రముఖ చైనీస్ మొబైల్ తయారీ సంస్థ వన్‌ప్లస్ (OnePlus) ఇండియాలో సరికొత్త స్మార్ట్‌ఫోన్ల‌ (Smartphones)ను ఎప్పటికప్పుడు లాంచ్ చేస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో వన్‌ప్లస్ 10R 5G (OnePlus 10R 5G) ఫోన్‌ను కంపెనీ తీసుకొచ్చింది. రూ.38,999 స్టార్టింగ్ ప్రైస్‌తో లాంచ్ అయిన వన్‌ప్లస్ 10R 5G మిడ్-రేంజ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఇండియా (India)లో బాగా అమ్ముడుపోయింది. అయితే ఈ ఫోన్ క్రేజ్‌ను గుర్తించిన కంపెనీ.. ఇదే సిరీస్‌లో ప్రైమ్ బ్లూ ఎడిషన్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమైంది. రేపు అంటే సెప్టెంబర్ 22న ఇండియాలో వన్‌ప్లస్ 10R 5G ప్రైమ్ బ్లూ ఎడిషన్‌(Prime Blue Edition)ను లాంచ్ చేయనున్నట్లు అధికారికంగా ట్విట్టర్‌లో ప్రకటించింది. ఈ అప్‌కమింగ్ స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

వన్‌ప్లస్ ఇప్పటికే వన్‌ప్లస్ 10R 5G మోడల్‌ను ఇండియాలో పరిచయం చేసింది. ఈ మొబైల్‌ను రెండు ఎడిషన్లలో మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇందులోని మొదటిదైన ఎండ్యూరెన్స్ ఎడిషన్ 150W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌ ఆఫర్ చేస్తోంది.

ఇక రెండవ ఎడిషన్ 80W SuperVOOC ఛార్జింగ్ సపోర్ట్‌తో వచ్చింది. వన్‌ప్లస్ కంపెనీ వన్‌ప్లస్ 10R 5G ప్రైమ్ బ్లూ ఎడిషన్‌ లాంచ్ డేట్‌ను ప్రకటిస్తూనే అమెజాన్ వెబ్‌పేజీ లింక్‌ను ట్వీట్ చేసింది. ఈ లింక్‌ క్లిక్ చేస్తే OnePlus 10R 5G ప్రైమ్ బ్లూ ఎడిషన్‌లోని మెయిన్ ఫీచర్లన్నీ కనిపిస్తున్నాయి.

అమెజాన్.ఇన్ వెబ్‌పేజీ ప్రకారం, OnePlus 10R 5G ప్రైమ్ బ్లూ ఎడిషన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8100-Max, 150వాట్ల SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్, 50MP ప్రైమరీ, 8MP అల్ట్రావైడ్, 2MP మాక్రో కెమెరాలు, GPA ఫ్రేమ్ స్టెబ్లైజర్‌తో సహా గేమింగ్ ప్రియుల కోసం 720Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో హైపర్‌బూస్ట్ గేమింగ్ ఇంజన్‌ను ఆఫర్ చేశారు.

అమెజాన్ ప్రోమో పేజీ ఈ అప్‌కమింగ్ మొబైల్ 4,500 mAh బ్యాటరీతో కూడా వస్తుందని తెలిపింది. అయితే 150W ఫాస్ట్ ఛార్జింగ్ సియెర్రా బ్లాక్ మోడల్ 12GB/256GB వెర్షన్‌కు మాత్రమే వస్తుందని సమాచారం. ఇక ఈ మొబైల్‌లో వచ్చే మిగతా ఫీచర్లన్నీ ఇంతకు ముందు విడుదలైన OnePlus 10R 5G మాదిరిగానే ఉంటాయి.

ఇది కూడా చదవండి : ఆఫర్ల జాతర.. అమెజాన్, ఫ్టిప్‌కార్ట్ సేల్స్ లో రూ.40వేలలోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

* స్పెసిఫికేషన్లు

స్మార్ట్‌ఫోన్ స్టాండర్డ్ వెర్షన్‌ 6.7-అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లే, 120Hx డైనమిక్ రిఫ్రెష్ రేట్, 2.5 కర్వ్డ్ కార్నింగ్ గోరిలా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌, మీడియాటెక్ డైమెన్సిటీ 8100 Max ప్రాసెసర్, 12GB వరకు LPDDR5 RAM తో వస్తుంది. వెనుక వైపు 50 MP Sony IMX766 ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP మాక్రో షూటర్‌ అందించగా ముందువైపు 16MP సెల్ఫీ కెమెరాను ఆఫర్ చేశారు. ఈ లేటెస్ట్ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత OxygenOS 12.1పై రన్ అవుతుంది. 3D పాసివ్ కూలింగ్ టెక్నాలజీ, హైపర్‌బూస్ట్ గేమింగ్ ఇంజన్, జనరల్ పర్ఫామెన్స్ అడాప్టర్ (GPA) ఫ్రేమ్ స్టెబిలైజర్ ఇందులో అందించారు.

* ధర

వన్‌ప్లస్ 10R 5G ప్రైమ్ బ్లూ ఎడిషన్‌ ధర ఎంతో కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఇంపాజ్‌బుల్లి ఫాస్ట్ ఛార్జింగ్ అనే ఛార్జింగ్ సపోర్ట్‌తో ఇది వస్తుందని అమెజాన్ తెలిపింది. కొత్త, పాత మోడళ్లలో ఫీచర్లు ఒకేలా ఉన్నా కలర్‌లో మాత్రం మార్పు ఉంటుంది. ఇక డిజైన్ కూడా ఒకే విధంగా ఉంటుంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Amazon Great Indian Festival Sale, Oneplus, Smart phone, Tech news

ఉత్తమ కథలు