Amazon Offer | ఆన్లైన్లో అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ (Smartphone) కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. దిగ్గజ ఈకామర్స్ సంస్థలు అమెజాన్ (Amazon), ఫ్లిప్‌కార్ట్ (Flipkart) పోటాపోటీ ఆఫర్లు అందుబాటులో ఉంచాయి. పలు రకాల ప్రొడక్టులపై తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్లు అన్నీ అక్టోబర్ 23 వరకే అందుబాటులో ఉంటాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివ్ సేల్ కూడా రేపటితో ముగుస్తుంది. ఇంకా ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ కూడా రేపు క్లోజ్ అవుతుంది.
అందువల్ల మీరు కొత్తగా ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తే.. ఇప్పుడే త్వరపడటం ముఖ్యం. అమెజాన్‌లో ఒక ఫోన్‌పై అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. వన్‌ప్లస్ కంపెనీకి చెందని పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 10ఆర్5జీ పరైమ్ ఫోన్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. బంపర్ డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. పలు రకాల ఆఫర్లు ఉన్నాయి.
మెస్మరైజ్ ఆఫర్.. ఈ ఫోన్‌పై ఏకంగా రూ.87 వేల తగ్గింపు.. ఒక్క రోజే ఛాన్స్!
ఈ ఫోన్ అసలు ధర రూ. 38,999. 8 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ వేరియంట్‌కు ఇది వర్తిస్తుంది. ఈ ఫోన్‌ను గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా రూ. 32,999కు కొనొచ్చు. అంటే ఈ ఫోన్‌పై 15 శాతం తగ్గింపు ఉంది. అలాగే బ్యాంక్ ఆఫర్ కూడా ఒకటుంది. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై రూ. 1750 వరకు డిస్కౌంట్క సొంతం చేసుకోవచ్చు.
బంగారంపై భారీ తగ్గింపు.. ఏ ఏ జువెలరీ షాపులో ఎలాంటి ఆఫర్లు ఉన్నాయంటే?
ఇంకా మూడు నెలల పాటు అమెజన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ కూడా ఉచితంగా పొందొచ్చు. అంతేకాకుండా ఈ ఫోన్‌పై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా లభిస్తోంది. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద ఈ ఫోన్‌పై ఏకంగా రూ. 28 వేల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ ఆఫర్లు అన్నింటికీ కలుపుకుంటే.. ఈ ఫోన్‌ను రూ. 3249కే కొనుగోలు చేయొచ్చు.
అయితే ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది మీ ఫోన్ వేరియంట్ ప్రాతిపదికన మారుతుంది. అంటే కొన్ని ఫోన్లకు ఎక్కువ విలువ రావొచ్చు. మరికొన్నింటికీ తక్కువ విలువ రావొచ్చు. అందువల్ల మీరు మీ ఫోన్‌కు ఎంత ఎక్స్చేంజ్ విలువ ఉందో చెక్ చేసుకోండి. అంతేకాకుండా మీ వద్ద క్రెడిట్ కార్డు ఉంటే.. మీరు ఈఎంఐలో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు. నెలవారీ ఈఎంఐ రూ. 1577 నుంచి ప్రారంభం అవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amazon, Amazon Great Indian Festival Sale, Flipkart, Flipkart Big Diwali Sale, Latest offers, Mobile offers