వన్‌ప్లస్ (OnePlus) ఫ్లాగ్షిప్ స్పెసిఫికేషన్లతో బెస్ట్ మొబైల్ ఫోన్స్ రిలీజ్ చేస్తోంది. ఇది బడ్జెట్ ఫోన్స్ కూడా రిలీజ్ చేస్తూ బాగా పాపులర్ అవుతోంది. ఏప్రిల్ 28న వన్‌ప్లస్ 10ఆర్ 5జీ (OnePlus 10R 5G), వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ (OnePlus Nord CE 2 Lite) అనే కొత్త మొబైల్స్ లాంచ్ చేస్తున్నట్లు వన్?
ప్రముఖ చైనీస్ (Chinese) మొబైల్ తయారీ సంస్థ వన్‌ప్లస్ (OnePlus) ఫ్లాగ్షిప్ స్పెసిఫికేషన్లతో బెస్ట్ మొబైల్ ఫోన్స్ రిలీజ్ చేస్తోంది. ఇది బడ్జెట్ ఫోన్స్ కూడా రిలీజ్ చేస్తూ బాగా పాపులర్ అవుతోంది. ఇండియాలో ఇది ఈ నెలలో రెండు స్మార్ట్ఫోన్లు రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యింది. ఏప్రిల్ 28న వన్‌ప్లస్ 10ఆర్ 5జీ (OnePlus 10R 5G), వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ (OnePlus Nord CE 2 Lite) అనే కొత్త మొబైల్స్ లాంచ్ చేస్తున్నట్లు వన్‌ప్లస్ తెలిపింది. అలాగే కొత్త ట్రూ వైర్లెస్ ఇయర్‌బడ్స్ ని ఏప్రిల్ 28న ఇండియాలో లాంచ్ చేయనుంది. ఐతే లాంచింగ్‌కు ముందు వన్‌ప్లస్ 10ఆర్ 5జీ, వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ ఫోన్ల స్పెక్స్ (Specs) టీజ్ చేస్తూ హైప్ పెంచుతోంది వన్‌ప్లస్ కంపెనీ. మరి ఈ స్పెసిఫికేషన్లు ఏవో ఇప్పుడు చూద్దాం.
ఇండియాలో కంటే ముందుగా చైనాలో ఒక ఫోన్ లాంచ్ చేసేందుకు వన్‌ప్లస్ కంపెనీ సిద్ధమయ్యింది. వన్‌ప్లస్ ఏస్ (OnePlus Ace) అనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఏప్రిల్ 21న లాంచ్ చేస్తోంది. వన్‌ప్లస్ ఏస్ ఫోన్.. వన్‌ప్లస్ 10ఆర్ ఒకటేనని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఇవి రెండు ఒకటేనని కాకపోతే వేర్వేరు పేర్లతో లాంచ్ అవుతున్నట్టు వన్‌ప్లస్ లేటెస్ట్ టీజర్లు కూడా క్లియర్ హింట్ ఇస్తున్నాయి. ఇటీవల విడుదలైన ఒక వన్‌ప్లస్ ఏస్ టీజర్ కొన్ని స్పెసిఫికేషన్ల (Specifications) ను బయటపెట్టింది. వన్‌ప్లస్ ఏస్ లో బ్యాక్ సైడ్ ట్రిపుల్-కెమెరా సెటప్ ఉంటుందని ఈ టీజర్ స్పష్టం చేసింది. న్యూ డిజైన్‌తో వచ్చే ఈ ఫోన్ బ్లాక్, బ్లూ కలర్ ఆప్షన్స్ లో లాంచ్ అవ్వచ్చు.
ఇందులో వన్‌ప్లస్ స్లైడర్ ఉండదు కానీ కింది భాగంలో యూఎస్బీ టైప్-సి పోర్ట్, కుడివైపు పవర్ బటన్ ఉంటుంది. వన్‌ప్లస్ 10ఆర్ విషయానికొస్తే, ఇందులో కూడా ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇది 150W SuperVOOC ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. వన్‌ప్లస్ 10ఆర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8100 మ్యాక్స్ (MediaTek Dimensity 8100-MAX) ప్రాసెసర్ సాయంతో రన్ అవుతుందని ఇప్పటికే కంపెనీ ఒక ట్వీట్ ద్వారా కన్ఫామ్ చేసింది.
నిజానికి ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8100ని ఉపయోగిస్తుంది, అయితే ఈ చిప్‌సెట్‌ను మీడియాటెక్ డైమెన్సిటీ 8100-MAX అని వన్‌ప్లస్ పిలుస్తోంది. దీన్నిబట్టి వన్‌ప్లస్ తన కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం మీడియాటెక్ కస్టమ్ వేరియంట్‌ను తయారు చేసిందని.. ఇది రెగ్యులర్ డైమెన్సిటీ 8100 కంటే ఎక్కువ క్లాక్ స్పీడ్‌తో వస్తుందని తెలుస్తోంది. దీనర్థం ఇది గేమర్స్ ని లక్ష్యంగా చేసుకుంది. మీడియాటెక్ ప్రాసెసర్ తో వన్‌ప్లస్ బ్రాండ్ నుంచి వస్తున్న మొదటి ఫ్లాగ్షిప్ ఇదే కావడం విశేషం.
5,000ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చే నార్డ్ సీఈ 2 లైట్ 5జీ 33W SuperVOOC ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందని వన్‌ప్లస్ టీజ్ చేసింది. ఈ ఫోన్లో ట్రిపుల్ కెమెరా సెటప్, అధిక రిఫ్రెష్-రేట్ ప్యానెల్ కూడా ఉండవచ్చని అంచనా. ఈ ఫోన్ ధర మిగతా స్పెసిఫికేషన్లు కొద్దిరోజుల్లో తెలిసే అవకాశం ఉంది. ఈ ఫోన్ రూ.20 వేల లోపు ఉండొచ్చని సమాచారం. ఇదే ధరతో వన్‌ప్లస్ ఫోన్ వస్తే బడ్జెట్ సెగ్మెంట్ లో శాంసంగ్ (Samsung) , రియల్మీ వంటి బ్రాండ్లు గట్టిపోటీని ఎదుర్కోవచ్చు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.