వన్‌ప్లస్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తోన్న వన్‌ప్లస్ 10 ప్రో(One Plus Pro) లాంచింగ్‌పై సరికొత్త అప్డేట్ వచ్చింది. రేపు (జనవరి 4)న వన్‌ప్లస్ లాంచింగ్ డేట్ ప్రకటిస్తామని వన్‌ప్లస్ కంపెనీ అధికారిక ట్విట్టర్(Twitter) పేజీలో పేర్కొంది. ఈ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ తొలుత చైనా మార్కెట్‌కి రానుంది. ఆ తర్వాత భారత్‌తో సహా ఇతర దేశాల్లోకి విడుదల కానుంది. అయితే, లాంచింగ్‌కు ముందే ఈ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు ఆన్లైన్లో(Online) లీకయ్యాయి. ప్రముఖ టిప్‌స్టర్ ఇషాన్ అగర్వాల్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వన్‌ప్లస్ 10ప్రో స్పెసిఫికేషన్లను వెల్లడించారు. మెరుగైన వీక్షణ అనుభవం కోసం LTPO 2.0 డిస్ప్లేతో డిజైన్ చేసినట్లు తెలిపారు. ఇది స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 చిప్సెట్ ద్వారా పనిచేస్తుందని ఇషాన్ అగర్వాల్ పేర్కొన్నారు. అయితే, వన్‌ప్లస్ 10 సాధారణ మోడల్ లాంచింగ్‌పై మాత్రం స్పష్టతనివ్వలేదు.
ఆన్లైన్లో లీకైన స్పెసిఫికేషన్లు..
టిప్‌స్టర్ ప్రకారం, వన్‌ప్లస్ ప్రో మోడల్ 120Hz రిఫ్రెష్ రేట్, క్వాడ్ హెచ్డీ+ రిజల్యూషన్ గల 6.7-అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 80W సూపర్ VOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతిస్తుంది. దీనిలో 5,000mAh బ్యాటరీని అమర్చింది. వన్‌ప్లస్ 10 ప్రో క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 చిప్సెట్ ద్వారా పనిచేస్తుంది. దీనిలో 5 ర్యామ్, UFS 3.1 స్టోరేజ్‌ను అందించింది.
కెమెరా విషయానికి వస్తే.. దీని వెనుకవైపు సెల్బ్లాడ్ కెమెరాలను అమర్చింది. దీని బ్యాక్ కెమెరా మాడ్యూల్లో 48- మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 -మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ స్నాపర్ కెమెరాలను చేర్చింది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ప్రత్యేకంగా దీని ముందు భాగంలో 32 -మెగాపిక్సెల్ సెల్ఫీ స్నాపర్ కెమెరాను చేర్చింది.
వన్‌ప్లస్ 10 ప్రో డిజైన్ విషయానికి వస్తే.. ఇది 8.5 మి మీ. మందం కలిగి ఉంటుంది. అంటే వన్‌ప్లస్ 9 ప్రో (8.7 మి.మీ. మందం) కంటే చాలా సన్నగా ఉంటుంది. అంతేకాదు, శామ్సంగ్ గెలాక్సీ ఎస్21 అల్ట్రా (8.9mm) వంటి కొన్ని ఫ్లాగ్షిప్ ఆండ్రాయిడ్ ఫోన్ల కంటే ఫోన్ సన్నగా ఉంటుంది. కాగా, జనవరి 4వ తేదీనే రియల్మీ తన అత్యంత ప్రీమియం రియల్మీ జీటీ2 ప్రోని చైనా మార్కెట్లోకి ఆవిష్కరించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 చిప్సెట్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.