ONEPLUS 10 PRO TO LAUNCH IN INDIA IN MARCH MOST AFFORDABLE 5G ONEPLUS PHONE COMING LATER GH VB
OnePlus 10 Pro: ఆ నెలలోనే భారత మార్కెట్లోకి వన్‌ప్లస్ 10 ప్రో లాంచ్.. ధర, ఫీచర్లు ఎలా ఉంటాయంటే..?
ప్రతీకాత్మక చిత్రం
చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ భారత మార్కెట్లో దూసుకుపోతోంది. ఇందులో భాగంగా, వన్‌ప్లస్10 ప్రో పేరుతో ఈ నెలాఖరులోగా మరో స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసేందుకు సిద్దమవుతోంది.
చైనీస్ స్మార్ట్‌ఫోన్(Chiphone) బ్రాండ్ వన్‌ప్లస్ భారత మార్కెట్లో దూసుకుపోతోంది. ఇందులో భాగంగా, వన్‌ప్లస్10 ప్రో పేరుతో ఈ నెలాఖరులోగా మరో స్మార్ట్‌ఫోన్(Smart Phone) లాంచ్ చేసేందుకు సిద్దమవుతోంది. దీని లాంచింగ్‌ను వన్‌ప్లస్(One Plus) సీఈవో పీట్ లా ధ్రువీకరించారు. వన్‌ప్లస్ 10 ప్రో ఇప్పటికే చైనా మార్కెట్లోకి రిలీజైంది. అక్కడ దీనికి మంచి స్పందన లభిస్తోంది. దీంతో, నెలాఖరులోగా భారత్‌లో లాంచ్ చేయనుంది. ఇది శామ్సంగ్(Samsung) గెలాక్సీ S22, ఐక్యూ 9 ప్రో వంటి ఇతర ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లకు గట్టిగా పోటీనివ్వనుంది. త్వరలోనే బార్సిలోనాలో జరిగే MWC 2022 ఈవెంట్లో స్మార్ట్‌ఫోన్‌ను(Smartphone) ప్రదర్శించనున్నట్లు పీట్ వెల్లడించారు. వన్‌ప్లస్‌కు అమెరికా, యూరప్, చైనాలతో పాటు భారతదేశం కూడా కీలక మార్కెట్‌గా ఆయన పేర్కొన్నారు.
అత్యంత సరసమైన వన్‌ప్లస్ 5జీ ఫోన్..
వన్‌ప్లస్ నుండి విడుదలకానున్న వన్‌ప్లస్ 10 ప్రో.. 2022లో చౌకైన 5G స్మార్ట్‌ఫోన్‌గా నిలువనుంది. ఈ ఫోన్లోSuperVOOC ఛార్జింగ్‌ను అందించనున్నట్లు కంపెనీ ధృవీకరించింది. ఇది 150W SuperVOOC ఛార్జింగ్‌కు మద్దతిస్తుందని తెలిపింది. ఇది స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు, గేమింగ్ కన్సోల్‌లలో పని చేస్తుంది. SuperVOOC ఛార్జింగ్ టెక్నాలజీని ప్రస్తుతం ఒప్పో ఉపయోగిస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కోసం దీనిలో స్పీడ్ కస్టమైజ్డ్ ట్విన్ బ్యాటరీ, ఇండస్ట్రీ-లీడింగ్ బ్యాటరీ, PCB ప్రొటెక్షన్ బోర్డ్, ఛార్జింగ్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి అత్యంత సమీకృత మైక్రోకంట్రోలర్ వంటివి అందించింది. ఈ ఛార్జింగ్ టెక్నాలజీ ద్వారా కేవలం ఐదు నిమిషాల్లోనే 0 నుండి 100 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.
గతేడాది రికార్డు స్థాయిలో అమ్మకాలు..
వన్‌ప్లస్, ఒప్పో సాఫ్ట్వేర్ విలీనంతో గతేడాది రికార్డు స్థాయిలో అమ్మకాలు నమోదయ్యాయి. ఈ రెండు సంస్థలు కలిసి 2021లో ప్రపంచవ్యాప్తంగా 11 మిలియన్లకు పైగా స్మార్ట్ఫోన్లను షిప్పింగ్ చేశాయి. ఈ ఘనత సాధించడం వన్‌ప్లస్ చరిత్రలోనే తొలిసారి. ఈ అమ్మకాలలో ఎక్కువ భాగం నార్డ్ ఫోన్ల నుండి వచ్చింది. ఇప్పటివరకు వన్‌ప్లస్ నార్డ్ సిరీస్ ఫోన్లు 10 మిలియన్ యూనిట్లకు పైగా అమ్ముడయ్యాయి.
గతేడాది వన్‌ప్లస్, ఒప్పో తమ స్మార్ట్ఫోన్లలో ఏకీకృత సాఫ్ట్వేర్ అనుభవాన్ని అందిస్తామని వన్‌ప్లస్ ప్రకటించింది. మరోవైపు, 2022లో వన్‌ప్లస్ కొత్త రిటైల్ మోడల్‌ను సెటప్ చేసింది. ఇది ఆన్లైన్, ఆఫ్‌లైన్ సేల్స్ సిస్టమ్‌ల మధ్య వారధిగా పనిచేస్తుంది. దీని ద్వారా ఆన్లైన్లో వన్‌ప్లస్ ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసుకోవచ్చు. నేరుగా రిటైల్ స్టోర్ నుంచి కూడా కొనుగోలు చేయవచ్చు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.