జనవరిలో వన్‌ప్లస్ 10 ప్రో (OnePlus 10 Pro) మోడల్‌ను లాంచ్ చేయనున్నట్లు వన్‌ప్లస్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ పీట్ లా మంగళవారం అధికారికంగా ధ్రువీకరించారు. ఈ ఫ్లాగ్షిప్ ఫోన్ వన్‌ప్లస్ 9 ప్రో కి కొనసాగింపుగా రానుంది.
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ బ్రాండ్ వన్‌ప్లస్ (OnePlus) భారత మార్కెట్లో వేగంగా విస్తరిస్తోంది. ఇటీవలి కాలంలో వరుసగా స్మార్ట్ఫోన్లను (Smartphone) విడుదల చేస్తున్న వన్‌ప్లస్.. న్యూ ఇయర్ కానుకగా జనవరిలో మరో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. జనవరిలో వన్‌ప్లస్ 10 ప్రో (OnePlus 10 Pro) మోడల్‌ను లాంచ్ చేయనున్నట్లు వన్‌ప్లస్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ పీట్ లా మంగళవారం అధికారికంగా ధ్రువీకరించారు. ఈ ఫ్లాగ్షిప్ ఫోన్ వన్‌ప్లస్ 9 ప్రో కి కొనసాగింపుగా రానుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ఎస్ఓసీ ప్రాసెసర్‌తో వస్తుందని లీకేజీలను బట్టి తెలుస్తోంది. జనవరిలో రిలీజ్ కానున్న వన్‌ప్లస్ 10తో పాటే వన్‌ప్లస్ 10 ప్రో కూడా వస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కాగా.. జనవరిలో వన్‌ప్లస్ 10 ప్రో లాంచ్ అవుతుందని వన్‌ప్లస్ సీఈవో పీట్ లా చెప్పినప్పటికీ.. కచ్చితమైన లాంచింగ్ తేదీని మాత్రం వెల్లడించలేదు. అయితే, వన్‌ప్లస్ జనవరి 5న అమెరికా లాస్ వెగాస్‌లో నిర్వహించనున్న సీఈఎస్ 2022 లాంచ్ ఈవెంట్లో దీన్ని విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. ఇదే ఈవెంట్లో వన్‌ప్లస్ 10, వన్‌ప్లస్ 10 ప్రో రెండింటినీ ఒకేసారి లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ రెండు ఫోన్లలోనూ తాజాగా క్వాల్కామ్ ఆవిష్కరించిన స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ఎస్ఓసీ ప్రాసెసర్‌ను అందించనుంది. ఈ కొత్త వన్‌ప్లస్10 ప్రో మోడల్ తొలుత చైనాలో అందుబాటులోకి రానుంది. 2022 మొదటి త్రైమాసికంలో భారత్‌తో సహా ఇతర మార్కెట్లోకి రానుంది. Storage monitoring apps: స్మార్ట్‌ఫోన్ లో అవసరంలేని ఫోటోలను గుర్తించే టాప్-5 యాప్స్ ఇవే.. ఓ లుక్కేయండి
వన్‌ప్లస్ 10 ప్రో స్పెసిఫికేషన్లు (అంచనా)
ఆన్లైన్లో లీకైన సమాచారం ప్రకారం, వన్‌ప్లస్ 10 ప్రో స్క్వేర్ షేప్‌లో బ్యాక్ కెమెరా మాడ్యూల్తో వస్తుంది. వన్‌ప్లస్ 9 ప్రో వలే దీనిలో కూడా జూమ్ ఫీచర్‌ను అందించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో వస్తుంది. వన్‌ప్లస్ 10 ప్రో ఇతర స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.7 అంగుళాల క్యూహెచ్డీ+ డిస్ప్లేను కలిగి ఉంటుంది. 12 జీబీ ర్యామ్, గరిష్టంగా 256 జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. దీనిలో 5,000mAh బ్యాటరీ ప్యాక్‌ను అందించనుంది. ఈ ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి మద్దతిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 12- ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 12పై పనిచేస్తుంది. అయితే దీని ధరపై మాత్రం కంపెనీ సీఈవో ఎంటువంటి స్పష్టతనివ్వలేదు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.